గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి

Written By:

అంతరిక్షా పరిశోధనా రంగంలో ఇస్రోకి విజయాలు అలవాటైపోయాయి. అపజయాలను తరిమికొడుతూ ఇస్రో విక్టరీ సింబల్ ను ఎగరేసి ప్రపంచదేశాలను ముక్కునవేలేసుకునేలా చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఇస్రో మరో రికార్డు విక్టరీని సొంతం చేసుకుంది. ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపి అన్నిదేశాలకు ఆశ్చర్యంతో పాటు షాక్ ను ఇచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో నింగిలోకి పంపిన 20 ఉపగ్రహాలపై స్పెషల్ ఫోకస్.

Read more: మాకు మీరే దిక్కంటున్న అగ్రరాజ్యం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

ఒకేసారి 20 ఉపగ్రహాలు నింగిలోకి పంపి ఇస్రో సరికొత్త రికార్డును సృష్టించింది. అమెరికా, రష్యా తర్వాత ఒకేసారి 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. రాకెట్‌ ప్రయోగం తర్వాత నింగిలోకి ఉప గ్రహాలు ప్రవేశ పెట్టేందుకు 26 నిమిషాల సమయం పటింది.

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపాలంటే ఇప్పుడు ప్రపంచదేశాలు ఇస్రో వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఇస్రో నుంచి అంతరిక్షంలోకి ఏ ఉపగ్రహమైన గురి తప్పకుండా కక్ష్యలోకి చేరుకుంటుంది. అంత నమ్మకం ఉంది కాబట్టే విదేశాలు ఇస్రో వైపు చూస్తున్నాయి. 1993 నుంచి ఇస్రోకి అన్ని విజయాలే

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

భూపరిశీలన కోసం రూపొందించిన కార్టోశాట్ -2 శాటిలైట్ ను నింగిలోకి తీసుకెళ్లింది. ఇది డ్రాయింగ్ మ్యాప్ అప్లికేషన్ కోసం ఈ శాటిలైట్ ను ఉపయోగిస్తారు. అలాగే వాతావరణ పరిస్థితులు సముద్ర తీరంలోని పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఈ శాటిలైట్ పంపిస్తుంది.

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

అమెరికాకు చెందిన డవ్ అనే 12మైక్రో శాటిలైట్స్, స్కైశాట్ జెన్ 2-1 అనే మరో శాటిలైట్‌, కెనడాకు చెందిన 2శాటిలైట్స్, జర్మనీకి చెందిన బైరోస్ శాటిలైట్, ఇండోనేషియాకు చెందిన లపన్-ఎ3 శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి చేరవేసింది.

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

దీన్నే స్కైజాట్ జెన్ 2-1 అనిపిలుస్తారు. ఇది గూగుల్ కంపెనీ అయిన తెర్రాబెల్లా తయారుచేసింది. స్కైశాట్ జెన్ -2 హైక్వాలిటీ వీడియోలను అంతరిక్షం నుంచి భూమికి పంపనుంది. ఇది దాదాపు 100 కేజీల బరువు ఉంది.

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

వీటితో పాటు 12డవ్ శాటిలైట్లు భూమిని పరిశోధించనున్నాయి. ఈ శాటిలైట్లు ఒక్కోటి 4.7 కేజీల బరువు ఉంటుంది. వీటిల్లో ప్లోక్ -2పీ శాటిలైట్ ను అమెరికాకు చెందిన ప్లానెట్ ల్యాబ్ తయారుచేసింది. ఇవి భూమిని పరిశోధించే అతి పెద్ద ఉపగ్రహాల కూటమి.

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

ఈ సారి ఇస్రో స్టూడెంట్లు తయారుచేసిన రెండు శాటిలైట్లను నింగిలోకి పంపింది. అవి సత్యభామ అలాగే స్వయం. సత్యభామను చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ విద్యార్థులు డెవలప్ చేయగా స్వయంను పుణే కాలేజి విద్యార్థులు డెవలప్ చేశారు. ఇవి భూ పరిశోధనను చేపట్టనున్నాయి.

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

ఇస్రో నింగిలోకి పంపిన మొత్తం శాటిలైట్ల బరువు దాదాపు 1288 కేజీలు.వీటిలో అత్యంత బరువైన శాటిలైట్ కార్టోశాట్ -2 దీని బరువు 727.5 కేజీలు. అలాగే అత్యంత చిన్న శాటిలైట్ స్వయం. దీని బరువు కేవలం ఒక కేజీ.

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

బుధవారం ఉదయం 9:26 గంటలకు షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ధృవ ఉపగ్రహ వాహననౌక పీఎస్ఎల్వీ సీ-34 ద్వారా 20 ఉపగ్రహాలను రోదసిలోకి పంపి మరో మైలురాయిని చేరుకుంది. మొత్తం 26 నిమిషాల 30 సెకన్లలో ప్రయోగం పూర్తి అయింది. ఫస్ట్ కార్టోశాట్ అంతరిక్షంలోకి వెళ్లగా చివరగా డవ్ శాటిలైట్ వెళ్లింది.

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

ఇప్పటివరకు ప్రపంచదేశాలకు చెందిన 57 శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపింది. వీటిల్లో 20 దేశాలకు చెందిన శాటిలైట్లు ఉన్నాయి. అయితే వీటిని నింగిలోకి పంపడానికి ఇస్రో మిగతా స్పేస్ సెంటర్ల కన్నా 10 శాతం తక్కువే ఛార్జ్ చేస్తుంది. అది ఇండియా అంటే అని ప్రపంచదేశాలు పొగుడుతున్నాయి.

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

ఈ ప్రయోగం విజయంలతో ఇస్రోలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రధాని అలాగే రాష్ట్రపతితో పాటు విదేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు ఇస్రోని అభినందనలతో ముంచెత్తారు.

గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్మాయి

శాస్ర్తవేత్తలకే షాక్ ఇస్తున్న మామ్ ఫోటోలు

మామ్ ఏడాది పయనంలో మరచిపోలేని చిత్రాలెన్నో..

ఇస్రో: భారతీయులు తెలుసుకోవాల్సిన నిజాలు !

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write ten things you must know about isros record launch of 20 satellites
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot