ఆకాశంలో అద్భుతానికి రెండే రోజులు

Written By:

నింగి దీపావళి పండుగను చేసుకోబోతుందా అన్నట్లుగా వెలుగులు విరజిమ్మేందుకు కేవలం రెండే రోజులు సమయముంది. అవును ఈ నెల 11వ తేదీన ఆకాశంలో అద్భుతం జరగనుంది. వందల ఉల్కలు తారాజువ్వల్లా నేల రాలనున్నాయి. అవి నేల రాలుతున్న సమయంలో ఆకాశం వెలుగులు విరజిమ్ముతూ నిప్పులు చిమ్ముతూ మనకు కనిపిస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈనెల 11న ఆకాశం నుంచి ఉల్కలు

ఆకాశంలో అద్భుతానికి రెండే రోజులు

ఈనెల 11న ఆకాశం నుంచి ఉల్కలు తారాజువ్వల్లా నేలరాలనున్నాయి. ఆ రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉల్కలు భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని, దీంతో భారీ వెలుగులు కనపడతాయని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

200 వరకు ఉల్కలు 59 కిలోమీటర్ల వేగంతో

ఆకాశంలో అద్భుతానికి రెండే రోజులు

దాదాపు 200 వరకు ఉల్కలు 59 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని నాసా పేర్కొంది. ఈ ఉల్కలు సెకనుకు 59 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వస్తాయని అవి వచ్చే సమయంలో నింగి దీపావళి పండుగను సంతరించుకుంటుందని నాసా తెలిపింది.

దుమ్ము, ధూళి కణాలను ఢీకొట్టడం వల్ల

ఆకాశంలో అద్భుతానికి రెండే రోజులు

ఉల్కలు భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో దుమ్ము, ధూళి కణాలను ఢీకొట్టడం వల్ల అవి మండిపోతాయని, తద్వారా భారీ వెలుగు వస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.

స్విఫ్ట్-టటిల్ తోక చుక్క

ఆకాశంలో అద్భుతానికి రెండే రోజులు

సూర్యుడి కక్ష్యలో 133 ఏళ్లకోసారి తిరిగే స్విఫ్ట్-టటిల్ తోక చుక్క సౌర వ్యవస్థలో ట్రిలియన్లకొద్దీ ముక్కలను వదిలేస్తుందని, ఈ ముక్కలు భూ వాతావరణాన్ని తాకినప్పుడు పెద్ద ఎత్తున వెలుగు వర్షం కురుస్తుందని వివరించారు. 

దాదాపు గంటపాటు కాంతి వర్షాన్ని

ఆకాశంలో అద్భుతానికి రెండే రోజులు

ఆగస్ట్ 11-12 తేదీల్లో రాత్రిపూట గంటకు దాదాపు 200 ఉల్కలు భూమిపైకి దూసుకొచ్చే అవకాశముందని నాసా తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ ఉల్కలు దాదాపు గంటపాటు కాంతి వర్షాన్ని కురిపిస్తాయని నాసా పేర్కొంది.

2009లో ఇలాంటి అద్భుతం

ఆకాశంలో అద్భుతానికి రెండే రోజులు

2009లో ఇలాంటి అద్భుతం జరిగిందని, ఇప్పుడు మళ్లీ దీన్ని చూడవచ్చని నాసా శాస్తవ్రేత్త బిల్ కూక్ అన్నారు. ప్రతి ఉల్క తోకచుక్కలోని ఒక చిన్న భాగమని ఆయన తెలిపారు.

భూమికి ఎలాంటి ప్రమాదం లేదని

ఆకాశంలో అద్భుతానికి రెండే రోజులు

ఈ ఉల్కలు సెకన్‌కు 59కిలోమీటర్ల వేగంతో భూవాతావరణాన్ని తాకినప్పుడు 1600 నుంచి 5500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడుతుందని, భూపరితలంపై 80 కిలోమీటర్ల మేర మండుతుందని,అయితే దానివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా వెల్లడించింది.

మీ కళ్లను చీకటికి అలవాటు చేసుకుని

ఆకాశంలో అద్భుతానికి రెండే రోజులు

ఆ రోజు రాత్రి  దాదాపు 45నిమిషాల పాటు మీ కళ్లను చీకటికి అలవాటు చేసుకుని నేరుగా ఆకాశంలో వెలుగుల దీపావళిని చూడండని బిల్ పేర్కొన్నారు. సో బీ రెడి గా ఉండండి మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The Meteor Shower of the Decade Is Coming this Week
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting