తొలి సునామి దెబ్బకు లక్షల ఏళ్లు

Written By:

సునామి..ఈ పేరు వింటే చాలు జనాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎక్కడ మమ్మల్ని లాగేసుకుంటుందోనని భయపడుతూ ఉంటారు. అది ఎప్పుడు పోద్దిరా దేవుడా అంటూ ఊపిరిబిగపట్టుకుని ఎదురుచూస్తుంటారు. అంతటి భయంకరమైన సునామి తొలిసారిగా ఎక్కడ వచ్చింది. భూమి మీద వచ్చిందా లేక అంగారక గ్రహం మీద వచ్చిందా.. అంటే శాస్ర్తవేత్తలు కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. లక్షల ఏళ్ల క్రితమే సునామీలు వచ్చాయని చెబుతున్నారు.

Read more: ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తొలి సునామి దెబ్బకు లక్షల ఏళ్లు

కొన్ని కోట్ల సంవత్సరాల కింద అంగారకుడిని రెండు భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల ఆ భయంకర ఉత్పాతం ధాటికి అంగారకగ్రహంపై రెండు సునామీలు సంభవించాయని తాజా పరిశోధనలో తేలింది.

తొలి సునామి దెబ్బకు లక్షల ఏళ్లు

దాదాపు 340 కోట్ల సంవత్సరాల కింద మార్స్ ని భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల తొలిసారిగా ఓ భయంకరమైన సునామీ అల ​​ఏర్పడిందని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుడు అల్బర్టో ఫెయిరెన్ తెలిపారు.

తొలి సునామి దెబ్బకు లక్షల ఏళ్లు

అయితే ఇది ఎలా ఏర్పడిందంటే అక్కడి ద్రవరూపంలోని నీరు వల్లే ఈ అల ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే వెను వెంటనే జరిగిన మరో భారీ ఉల్కా విస్ఫోటం వల్ల రెండో సునామీ చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు ఖచ్చితమైన ఆధారాలను కనుగొన్నారు.

తొలి సునామి దెబ్బకు లక్షల ఏళ్లు

ఈ రెండు సునామీలకు దెబ్బకు లక్షల సంవత్సరాల కాలం పాటు అంగారకుడు అతి శీతల స్థితిలోకి వెళ్లిపోయాడని గుర్తించారు. ఆ సమయంలోనే అక్కడి నీరు ఘనీభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

తొలి సునామి దెబ్బకు లక్షల ఏళ్లు

దీని ద్వారా అక్కడి సముద్రతీరం ప్రాంతంలోని నీరు చాలా వెనక్కి వెళ్లడం ద్వారా రెండో సముద్రతీరం ఏర్పడిందని భావిస్తున్నారు.

తొలి సునామి దెబ్బకు లక్షల ఏళ్లు

రెండో సునామీ సంభవించిన సమయంలో సముద్రంలోని మంచు ఎగిరి చాలా దూరంలో పడిపోయిందని, ఇది తిరిగి సముద్రంలోకి రాలేదని ఫెయిరెన్ పేర్కొన్నారు.

తొలి సునామి దెబ్బకు లక్షల ఏళ్లు

అంగారకుడు ఏర్పడిన తొలినాళ్లలో చాలా చల్లటి సముద్రాలు ఉండేవని స్పష్టం చేశారు. అయితే ఉత్పాతాల వల్ల అవి ఇప్పుడు వేడెక్కాయని శాస్ర్తవేత్తలు నిర్థారిస్తున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write There Were Mega-Tsunamis on Mars
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot