1200 సంవత్సరాల నుంచి మిస్టరీగా మారిన రాయి,బ్యాలన్స్ ఎలా ఆపుకుంటోంది ?

  ఆ గుడి నిర్మాణంలో అణువణువు అనేక రహస్యాలను దాచిపెట్టుకుని ఉంది. 1200 సంవత్సరాల చరిత్ర గలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు..షాక్ కొట్టించే రహస్యాలు ఇలా ఎన్నో మనకు దర్శనమిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆ గుడిలో ఉన్న రాయిని కదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కాని ఎవ్వరి వల్లా కాలేదు. ఇక ఆ గుడిలో శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే రాకెట్లను ప్రయోగించే టెక్నాలజీకి నాంది పలికారని అనిపిస్తుంది. అదే తమిళనాడులోని మహాబలిపురం దేవాలయం.. అణువణువు రహస్యాలను నింపుకున్న ఆ దేవాలయంపై స్పెషల్ కధనం.

  ఆ వేదభూమిలో దాగిన వేల ఏళ్ల రహస్యాలను బయటపెట్టిన నాసా

   

  వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం చెన్నై నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఒకప్పుడు మామల్లపురంగా మహాబలిపురం ని పిలిచేవారు. 7నుండి 10 వ శతాబ్దాల కాలంలో పల్లవ రాజుల కాలం లో పేరెన్నిక కలిగిన ఓడ రేవు ఇది.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. భగవాన్ విష్ణు మూర్తి తో జరిగిన యుద్ధంలో మరణించిన మహాబలి అనబడే కిరాతకుడైన రాక్షసుడి పేరు ఈ నగరానికి వచ్చిందని మరికొందరు చెబుతారు..

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  మహాబలిపురం అంటేనే సముద్ర తీరంలో వెలిసిన దేవాలయానికి ప్రసిద్ధి.కంచి రాజధానిగా పాలించిన ఆనాటి పాలకులు విదేశీ నిపుణులను రప్పించి, స్వదేశీ కళాకారుల అండదండలతో సాగరతీరంలోని ఈ ఊళ్లో అద్బుత రాతి కట్టడాలను సృష్టించారు.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  ఆనాటి రాజుల ఆ కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడి ప్రసిద్ద ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి ఎందరో శిల్పులు, నిపుణులు పరవశించిపోతారు.వాటిలో ప్రధానమైనవి కృష్ణుని రాయి. దీన్ని Krishnas Butter Ball అని పిలుస్తారు.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  దీనికి దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది దాదాపు 20 అడుగుల వెడల్పు అలాగే పొడవు ,ఎత్తు కలిగి కేవలం రెండు చదరపు గజాల స్థలంలో నిలిచి ఉంటుంది. దాదాపు 250 టన్నుల బరువున్న ఈ రాయి అక్కడ చెక్కు చెదరకుండా ఉండటమే ఇప్పటికీ మిస్టరీ.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  ఈ రాయిని తొలగించాలని ఎంతో మంది ప్రయత్నించారు. అయితే ఎవ్వరూ ఇంచు కూడా కదపలేకపోయారు. 1908వ సంవత్సరంలో ఈ ప్రదేశానన్ని పరిశీలించిన ఆర్థర్ ఆలీ అనే బ్రిటీష్ దొర ఈ రాయిని చూసి ఇది చాలా ప్రమాదం దీన్ని తొలగించాలని ప్రయత్నించాడు.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  ఇందుకోసం ఏడు ఏనుగులను తెప్పించి పెద్ద పెద్ద గొలుసులతో దాన్ని ఎత్తు నుండి పల్లంలోకి కదిలించడానికి నానా ప్రయత్నాలు చేశారు. అయితే వారు ఆ రాయిని కొంచెం కూడా కదపలేక నిరాశతో వెనుదిరిగారని చరిత్ర చెబుతోంది.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఈ రాయిని ఆనాటి పల్లవరాజు నరసింహవర్మ ఇది ఆకాశదేవుని రాయని దీన్ని ఏ శిల్సి ముట్టకూడదని శాసించాడని ఓ కథనం చెబుతోంది. మరి కొందరు ఇది గుడికోసం తెచ్చిన రాయిని అయితే మధ్యలోనే వదిళేశారని వాదిస్తారు.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  మరికొందరు మాత్రం ఇది గ్రహాంతరవాసుల ఎగిరే పళ్లాలని చెబుతారు. దాదాపు 250 టన్నుల బరువు ఉండే ఈ రాయిని కొండ పైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పనికాదని అందుకే ఇవి ఏలియన్స్ కు సంబంధించినవని చెబుతారు.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  అచ్చం ఇలాంటి రాయిని పోలిన రాళ్లు ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయి. అవి ఏలియన్స్ తిరుగుతన్నారన్న ఊహగానాలు వెలువడే ప్రదేశాలైన మెక్సికన్ నగరం అలాగే పెరూ మాచుపిచులో ఉన్నాయి. అచ్చం ఇలాంటి రాళ్లే అక్కడ కూడా ఉన్నాయి.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  ఇక ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే ఇంత టెక్నాలజీని వాడారా అనిపిస్తుంది. ఒకే చిత్రంలో ఆవుని పాలు తాగుతున్న దూడని చూడొచ్చు. అలాగే అదే చిత్రంలో ఏనుగును అలాగే పాలు తాగుతున్న పిల్ల ఏనుగును చూడొచ్చు.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  అప్పట్లోనే అంతరిక్ష పరిశోధనకు శ్రీకారం చుట్టారనడానికి అనేక శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. అప్పట్లోనే పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేశారనడానికి చాలా ఆధారాలు కనపడతాయి.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  ఆ ఆలయంలోని గణేశిని విగ్రహం పైన రాకెట్ లాంచిగ్ వెహికల్ కనిపిస్తుంది. దాంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక రూపాలు కనిపిస్తాయి. ఇవన్నీ రాకెట్ లాంచింగ్ చేస్తున్నట్లే కనిపిస్తాయి.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  ఇక్కడ ఉన్న మరో టెక్నాలజీ చిత్రం బావి. ఆ కాలంలో కొలతలు కూడా లేవు. అలాంటిది ఎంతో ఖచ్చితత్వంతో ఆ బావిని తయారుచేశారు. అప్పట్లోనే టెక్నాలజీని వాడారనడానికి ఇది గొప్ప ఉదాహరణ.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  ఆలయ గోపురంపై ఉన్న శూలాన్ని చూస్తే మనకు టెక్నాలజీ గుర్తుకు వస్తుంది. ఈ శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు. అతని తల మీద రెండు కొమ్ములు అలాగే హెల్మెట్ ధరించినట్లు మనకు అనిపిస్తుంది.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  అంతా విదేశీయుడిని పోలినట్లు మనకు కనిపిస్తుంది. అచ్చం శాటిలైట్ స్థంభంలాగానే కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదసీలోకి వెళుతున్న వ్యోమగాముల్లాగా మనకు కనిపిస్తుంది. అంతే కాకుండా విమానగోపురం చుట్టూ అచ్చం వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  ఇంకా విచిత్రకరమైన అంశం ఏమిటంటే గర్భగుడిలోకి ఎక్కడా గాలిచొరబడకుండా దాన్ని కట్టారు. శాటిలైట్ పంపినప్పుడు విడుదలయ్యే వాయువులు పోయే విధంగా ద్వారాలు కట్టారనిపిస్తుంది.ఎక్కడా కిటికీలు తలుపులు కనపడవు. అంటే రాకెట్ లాంచిగ్ సమయంలో వెలువడే రేడియేషన్ తట్టుకును విధంగా ఈ గుడిని నిర్మించారని తెలుస్తోంది.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకున్న ఈ దేవాలయం విశేశంగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఉన్న లైట్ హౌస్ దాదాపు వెయ్యేళ్ల క్రితానికి చెందినదిగా భావిస్తారు. మహాబలిపురానికి వచ్చే ఓడలకు దారిచూపించేందుకు ఈ లైట్ ను ఏర్పాటుచేశారని ప్రసిద్ధి.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  పురాతన కాలంలోనే మన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తం అయిందని చెప్పడానికి ఈ దేవాలయమే ఓ చక్కటి ఉదాహరణ. అణువణువు టెక్నాలజీని నింపుకుని పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ గుడిని ఒక్కసారైన దర్శించాల్సిందే.

  ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

  టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

  https://www.facebook.com/GizBotTelugu/

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Here Write What is the history science behind Krishnas Butter Ball rock in Mahabalipuram
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more