సైన్స్‌కే సవాల్ విసరనున్న సర్జరీ..ఒకరి తలను మరొకరికి..

Written By:

సైన్స్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టంచడానికి శాస్ర్తవేత్తలు రెడీ అవుతున్నారు.చనిపోయిన దేహానికి ఉన్న తలను తీసి బతికి ఉన్న దేహం తలను అంటించనున్నారు. ఈ ఆపరేషన్ 2017లో జరగనుంది. ఇదే కనుక జరిగితే చరిత్రలో ఓ షాకింగ్ ఘట్టానికి తెరలేచినట్లే..మరి అదెలా సాధ్యం..అసలు ఎవరు అంత సాహసానికి పూనుకుంటున్నారు..ఎక్కడ జరుగుతోంది అనే షాకింగ్ విషయాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

సైంటిస్టుల ముందడుగు..చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

రష్యాకు చెందిన వాలెరీ స్పిరిడోనోవ్ అనే వ్యక్తి ఈ ఆపరేషన్ కు సిద్ధమయ్యాడు. ఎంతో ప్రమాదకరమైన ఈ చికిత్సను తీసుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చానని చెబుతున్నారు.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

వెర్డింగ్‌నింగ్-హాఫ్‌మన్ అనే అరుదైన నాడీ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న వాలెరీ జీవితం కుర్చీలకే పరిమితమైంది. ఈ వ్యాధి భారీన పడిన వారు యుక్త వయసు రాగానే మరణిస్తారు. దీంతో వాలెరీ కొత్త జీవితం కోసం ఈ ఆపరేషన్ చేయించుకున్నట్లు చెబుతున్నారు.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకు నా ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతోంది. చావు నా దరికి చేరేలోపు నేను వేరే దేహానికి వెళ్లాలనుకుంటున్నాను. నా తలను వేరే దేహానికి అమర్చుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పుకుంటున్నానని తెలిపారు.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

ఈ ఆపరేషన్ విజయవంతమయితే చరిత్రలో తొలి వ్యక్తిగా వాలెరీ అరుదైన ఘనతను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదే ఫైయిలైతే తిరిగిరాని లోకాలకు వెళ్లే అవకాశం ఉంది.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

ఈ ఆపరేషన్ ఎవరు చేస్తున్నారంటే ఇంతకు ముందు నా తలను కత్తితో నరుక్కుని మళ్లీ ఆరోగ్యకరమైన దేహానికి అతికించుకోగలనంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సెర్జియో కానావెరో సహకారంతో ఇటలీకి చెందిన సర్జన్ ఫ్రాంకేన్‌స్టెయిన్ ఈ సర్జరీ నిర్వహించనున్నారు

image source: east2westnews

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

ఈ ఆపరేషన్ 2017లో జరిపేందుకు వైద్యులు ఇప్పటినుంచే అన్ని కసరత్తులు చేస్తున్నారు. 2017 క్రిస్మస్ రోజున ఈ ఆపరేషన్ కి ప్లాన్ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

ఈ ఆపరేషన్ కి పేరు ఏం పెట్టారో తెలుసా.. హెవన్ క్లుప్తంగా హెడ్ అనాస్తోమోసిస్ వెంచర్ అని పెట్టారు. స్వర్గానికి నీకు దారులు చూపిస్తున్నామంటూ ఈ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

ఈ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు...దాదాపు 14 మిలియన్ పౌండ్లు మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 122 కోట్లు.. ఇక ఈ అరుదైన సర్జరీకి చైనా వేదిక కానుంది.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

36 గంటల పాటు సాగనున్న ఈ ఆపరషన్‌లో 150 మంది డాక్టర్లు, వందల మంది నర్సులు పాల్గొననున్నారు.ఈ ఆపరేషన్ కోసం కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉన్న థియేటర్లను సిద్ధం చేస్తున్నారు.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

ఈ సర్జరీలో బాగం కానున్న దేహాన్ని అంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క శరీరాన్ని ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

ఈ ఆపరేషన్ పూర్తయిన తరువాత నాలుగు వారాల పాటు పేషెంట్ కోమాలోనే ఉంటాడని వైద్యులు చెబుతున్నారు. ఆ తరువాత అతను మాట్లాడటం అలాగే నడక అన్నీ మాములుగా ఉంటాయని చెబుతున్నారు.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

అయితే ఈ తరహా సర్జరీ ఇంతకు ముందు జంతువులపై ప్రయోగించారు కూడా. 1970లో ప్రయోగాత్మకంగా కోతిపై నిర్వహించగా, అది ఎనిమిది వారాలపాటు జీవించింది. ఆ తరువాత దేహానికి తలకు సెట్ కాకపోవడంతో కోతి చనిపోయింది.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

మరి ఇదే జరిగితే సైన్స్ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయానికి తెరలేచనట్లేనని డాక్టర్లు సైంటిస్టులు చెబుతున్నారు. ఏం జరుగుతుందనేది అప్పటిదాకా వేచి చూడాల్సిందే.

సైన్స్ చరిత్రలోనే షాకింగ్‌ న్యూస్..ఒకరి తలను మరొకరికి..

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write World’s first head transplant to go ahead next year
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot