ప్రపంచంలోనే తొలి హ్యాక్ ఫ్రూప్ శాటిలైట్.. చైనా చేతిలో

Written By:

ప్రపంచంలోనే తొలి క్వాంటం ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది. ఈ శాటిలైట్ ని హ్యాక్ చేయాలంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. అలాగే నకిలీ క్వాంటంను కూడా సృష్టంచలేరు. అత్యంత పకడ్భందీగా చైనా ఈ శాటిలైట్ ని రోదసీలోకి పంపింది. మరి రోదసీలో ఇది ఏం చేస్తుంది. ఏం సమాచారాన్ని అందిస్తుంది. ఇంకా ఇతర అంశాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

విధ్వంసక శాటిలైట్లతో చైనా దూకుడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచంలోనే తొలి హ్యాక్ ఫ్రూప్ శాటిలైట్ చైనా చేతిలో

ప్రపంచపు తొలి క్వాంటం ఉపగ్రహాన్ని చైనా రోదసిలోకి ప్రయోగించింది. పూర్తి హాక్‌ ప్రూఫ్‌ అయిన ఈ కమ్యూనికేషన్ల ఉపగ్రహంలో వైర్‌ టాపింగ్‌, మధ్యంతర అవరోధాల వంటి వాటిని నివారించే భద్రతా ఏర్పాట్లుండటం విశేషం.

ప్రపంచంలోనే తొలి హ్యాక్ ఫ్రూప్ శాటిలైట్.. చైనా చేతిలో

ఈ ఉపగ్రహాన్ని జియుక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 1.40 గంటలకు ప్రయోగించినట్లు అధికార సిన్హువా వార్తాసంస్థ వెల్లడించింది.

ప్రపంచంలోనే తొలి హ్యాక్ ఫ్రూప్ శాటిలైట్.. చైనా చేతిలో

600 కిలోలకు పైగా బరువున్న ఈ ఉపగ్రహం భూమి నుండి 500 కి.మీ ఎత్తులో వున్న స్థిర కక్ష్యలో పరిభ్రమిస్తూ ప్రతి 90 నిముషాలకు ఒకసారి భూ పరిభ్రమణం పూర్తి చేస్తుందని చైనా రోదసీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో వివరించింది.

ప్రపంచంలోనే తొలి హ్యాక్ ఫ్రూప్ శాటిలైట్.. చైనా చేతిలో

క్రీ.పూర ఐదవ శతాబ్దానికి చెందిన చైనా శాస్త్రవేత్త 'మిషియస్‌' పేరిట ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

ప్రపంచంలోనే తొలి హ్యాక్ ఫ్రూప్ శాటిలైట్.. చైనా చేతిలో

రెండేళ్ల పాటు కక్ష్యలో పరిభ్రమించే ఈ ఉపగ్రహం పూర్తి హాక్‌ ప్రూఫ్‌ ఏర్పాట్లతో క్వాంటం కమ్యూనికేషన్‌ ప్రసారాలతో కమ్యూనికేషన్ల రంగానికి సేవలందించనుంది.

ప్రపంచంలోనే తొలి హ్యాక్ ఫ్రూప్ శాటిలైట్.. చైనా చేతిలో

క్వాంటం కమ్యూనికేషన్‌ వ్యవస్థ అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు కలిగినదని, క్వాంటం ఫోటాన్‌ను వేరు చేయటం లేదా నకిలీ సృష్టించటం సాధ్యం కాదని ప్రభుత్వం ఈ ప్రకటనలో వివరించింది.

ప్రపంచంలోనే తొలి హ్యాక్ ఫ్రూప్ శాటిలైట్.. చైనా చేతిలో

గత నెల జియుక్వాన్ శాటిలెట్ లాంచ్ సెంటర్ సరఫరా చేసిన తర్వాత స్పేస్ శాస్త్రవేత్తలు 20 రోజుల పాటు సుదీర్ఘ శాటిలైట్ పరీక్షలు జరిపినట్లు తెలిపారు.

ప్రపంచంలోనే తొలి హ్యాక్ ఫ్రూప్ శాటిలైట్.. చైనా చేతిలో

అమెరికా శాటిలైట్లను ఆకాశంలోనే పేల్చేందుకు రష్యా, చైనా కుట్ర

నడిసముద్రంలో విమానాలు దించుతాం: బరితెగించిన చైనా

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write World's first quantum communication satellite launched by China
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot