సంబరాలతో ఖుషీ ఖుషీగా ఫేస్‌బుక్

By Hazarath
|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మెసెంజర్ శరవేగంగా దూసుకుపోతోంది. మూడేళ్ల క్రితం లాంచ్ అయిన మెసెంజర్ యాప్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. నెలకు సగటున వందకోట్ల (ఒక బిలియన్) యూజర్లతో మరో అతిపెద్ద మైలురాయిని అధిగమించింది. లాంచింగ్ నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ఆదరణ అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా ఈ యాప్ లో చేరిన నెటిజన్ల సంఖ్య ఒక బిలియన్ దాటడంతో సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈస్టర్ ఎగ్, బెలూన్ ఎమోజీలను యూజర్లకు పంపిస్తోంది. దీంతో ఈ యాప్ యూజర్ల స్మార్ట్ ఫోన్ నిండా బెలూన్లతో నింపేసి యూజర్లను ఆకట్టుకుంటోంది. గత జనవరి నుంచి 200 మిలియన్ల యూజర్లు పెరిగినట్టు సంస్థ ప్రకటించింది.

మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా..?

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను వినియోగిస్తున్న ప్రతిఒక్కరు తెలుసుకోవల్సిన 10 విషయాలు

 సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

అవును మీరు వింటున్నది నిజమే.. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవచ్చు. డెస్క్‌టాప్ పై మెసెంజర్ ఇంటర్‌ఫేస్ అచ్చం మొబైల్ యాప్ మాదిరిగానే ఉంటుంది. ఏ విధమైన న్యూస్ ఫీడ్స్ మీకు విఘాతం కలిగించవు. మిత్రులతో హ్యాపీగా చాటింగ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ మెసెంజర్‌ను మీ డెస్క్‌టాప్ పై ట్రై చేసేందుకు క్లిక్ చేయండి.

 సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

మెసెంజర్ యాప్ వాడటానికి ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు. మెసెంజర్ యాప్‌లో "Not on Facebook?" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మొబైల్ నెంబరుతో యాప్‌‍లోకి లాగిన్ కావొచ్చు.

 సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్
 

సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

మెసెంజర్ యాప్ ద్వారా Uber car సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్‌లోని More iconను సెలక్ట్ చేసుకుని అందులోని Transportation ఆప్షన్ పై టాప్ చేయండి. ఇక్కడ మీకు Uber సర్వీసుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మీ అకౌంట్ లోకి లాగిన్ అవటం ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ పంపొచ్చు.

 సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

మీరు తరచూ ఒకే గ్రూప్‌తో చాట్ చేస్తుంటారా..? అయితే, మీరు ఆ గ్రూప్‌ను పిన్ చేసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మెసెజ్ వచ్చిన ప్రతిసారి ఆ మెసెజ్‌ను వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. మీ కళ్ల ముందే కనిపిస్తుంది. మెసెంజర్ యాప్‌లో మీకు నచ్చిన గ్రూప్ చాట్‌ను పిన్ చేయదలిచినట్లయితే యాప్ బాటమ్‌లో కనిపించే గ్రూప్ బటన్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు యాప్ ఎడమ వైపు టాప్ కార్నర్‌లో Pin button కనిపిస్తుంది.

 సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

మెసెంజర్ యాప్‌లో ఏదైనా conversationను మ్యూట్ చేయదలిచినట్లయితే ఆ మెసెజ్ హెడర్ పై టాప్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కనిపిస్తాయి, వాటిలో మీరు conversation ఎంత సేపటి వరకు మ్యూట్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవచ్చు

 సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

మెసెంజర్ యాప్ ద్వారా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం భారత్‌లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు.

 సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ మిత్రులకు ఫోటోలను చాలా సులువుగా సెండ్ చేసుకోవచ్చు. యాప్‌లో పొందుపరిచిన ఫోటో మ్యాజిక్ ఫీచర్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీకు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

 సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

మెసెంజర్ యాప్ చాటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని అది పొరపాటు, ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో ఉచిత వాయిస్ ఇంకా వీడియో కాల్స్‌ను చేసుకోవచ్చు.

 సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ లోకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

 సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

సంబరాలతో ఖుషీ ఖషీగా ఫేస్‌బుక్

ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టఫ్‌ను అందించే Giphy, GIF keyboard వంటి యాప్స్ మెసెంజర్‌‍లో అందుబాటులో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన జిఫ్ ఫైల్స్ ను షేర్ మీరు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Here Write Facebook sneaks an Easter egg into Messenger to celebrate 1 billion monthly users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X