ఇక టీవీ తెరపై ఫేస్‌బుక్ వీడియోలు
ఫేస్‌బుక్‌లో వచ్చే వీడియోలను మీరు బుల్లి తెరపై చూసే విధంగా యాప్ ను ఫేస్‌బుక్ తయారుచేయబోతోంది.

న్యూస్ ఫీడ్ ను డైరెక్ట్ గా టీవీ తెరపై
ఈ కొత్త ఫీచర్ ద్వారా డిఫాల్ట్గా న్యూస్ ఫీడ్ ను డైరెక్ట్ గా టీవీ తెరపై వీక్షించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే యూజర్ మొబైల్ లో సేవ్ చేసుకున్నవీడియోలను కూడా కావాలనుకున్నపుడు చూడొచ్చు.

టీవీ పూర్తి స్క్రీన్ పై యూజర్లకిష్టమైన వీడియోలను
మీ స్మార్ట్ ఫోన్ మ్యూట్ లో ఉంటే మ్యూట్ లో, సౌండ్ ఆప్షన్‌లో ఉండే సౌండ్ లోను ప్లే చేస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. స్నాప్ చాట్ మాదిరిగానే, టీవీ పూర్తి స్క్రీన్ పై యూజర్లకిష్టమైన వీడియోలను చూడొచ‍్చని వెల్లడించింది.

త్వరలో అందుబాటులోకి యాప్
అన్ని పరీక్షలు పూర్తయ్యాయనీ త్వరలో ఆపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, శాంసంగ్ స్మార్ట్ టీవీల ద్వారా ఈ యాప్ అందుబాటులోకి రానుందని తెలిపింది. అనంతరం మిగతా అన్ని డివైస్‌లకు ఈ అవకాశం కల్పించనున్నట్టు పేర్కొంది.

మరిన్ని వీడియోలను యూజర్లకు
దీంతోపాటు యూజర్ల ఆసక్తిని ఎనలైజ్ చేసి మరిన్ని వీడియోలను యూజర్లకు సజెస్ట్ చేస్తుందట.

యాప్ ప్రారంభంపై..
అయితే యాప్ ప్రారంభంపై కచ్చితమైన సమయాన్ని నిర్దిష్టంగా పేర్కొనకపోయినప్పటికీ త్వరలోనే అని ప్రకటించింది.


Click it and Unblock the Notifications








