టెల్కోల లవ్ మెసేజ్‌లు చూశారా..?

Written By:

ప్రేమికుల రోజు సంధర్భంగా అందరూ తమ లవర్స్ కి గ్రీటింగ్స్ పంపడంలో తెగ బిజీగా గడిపారు కదా. అయితే ఈ విషయంలో కొత్తగా టెల్కోలు తమ ప్రేమను ట్విట్టర్ లో పంచుకున్నాయి. అన్నిటికంటే ముందు 4జీ వార్ కి తెర లేపిన జియో ప్రేమతో అంటూ మిగతా టెల్కోలకు పంపింది. అయితే దీనికి మిగతా టెల్కోలు కూడా అదే స్థాయిలో రిప్లయి ఇచ్చాయి.

మీ ఫోన్‌లో ఫ్లాష్ లైట్ వాడుతున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో పంపిన మెసేజ్

ప్రియమైన @ఎయిర్‌టెల్‌ఇండియా, @వొడాఫోన్‌ఇన్,@ఐడియాసెల్యులార్, హ్యాపీ వాలెంటైన్స్ డే. #ప్రేమతో జియో అని ట్వీట్ చేసింది. జియో ట్వీట్‌ను ఆరు గంటల్లో 3వేల సార్లు రీట్వీట్ చేశారు. 4వేల లైక్స్ వచ్చాయి.

ఎయిర్‌టెల్ పంపిన మెసేజ్

జియో లవ్ సిగ్నల్స్‌కు ఎయిర్‌టెల్ కూడా త్వరగానే స్పందించింది. నాదీ అదే అనుభూతి @రిలయన్స్ జియో! మొత్తానికి #ప్రతీ స్నేహితుడు అవసరమేకదా?? @వొడాఫోన్‌ఇన్, @ఐడియా సెల్యులార్ ట్విట్టర్‌లోనే తిరిగి సమాధానమిచ్చింది.

ఐడియా పంపిన మెసేజ్

ఐడియా కూడా తన ఫీలింగ్‌ను పంచుకుంది. నీక్కూడా శుభాకాంక్షలు @రిలయన్స్ జియో! ఇవాళ నెట్‌వర్క్‌లో ప్రేమ తరంగాలు ప్రసరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. @ఎయిర్‌టెల్‌ఇండియా, @వొడాఫోన్‌ఇన్ అంటూ ట్వీట్ చేసింది.

ఎయిర్‌సెల్ పంపిన మెసేజ్

ట్రయాంగిల్ లవ్ నెట్‌వర్క్‌లోకి దూరిన ఎయిర్‌సెల్.. ఐడియాకు ప్రత్యేక ప్రేమాభిమానాలతో సిగ్నల్స్ పంపింది. సర్‌జీ ఎలాగోఅలాగైతేనేమి కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలిగాం. #కలిసికట్టుగా హృదయాలను జోడిస్తున్నాం @ఐడియా సెల్యులార్ అని ఎయిర్‌సెల్ ట్వీట్ పంపింది.

ఐడియా రిప్లయి

అందుకు ఐడియా స్పందిస్తూ.. @ ఎయిర్‌సెల్ అందరం కలిసి దేశంలోని వంద కోట్లకు పైగా ప్రజలకు కొంత ఎక్కువ సేవ చేయగలిగాం అని బదులిచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Reliance Jio initiates Twitter trend on V-Day, gets all the telcos to tweet each other read more at gibot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot