అంబాని మహిమ, కోట్ల సంపదను పోగేసిన జకర్‌బర్గ్

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని వల్ల ఫేస్‌బుక్ అధినేత జకర్‌బర్గ్ కోట్ల సంపదలో మునిగితేలుతున్నారు.

By Hazarath
|

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని వల్ల ఫేస్‌బుక్ అధినేత జకర్‌బర్గ్ కోట్ల సంపదలో మునిగితేలుతున్నారు. ముఖేష్ అంబాని చేసిన ఈ సాయానికి జకర్‌బర్గ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కూడా. ఇది ఎలా సాధ్యం అనుకునేవారికి జియో డేటానే సమాధానం. జియో రాకతో ఇంటర్నెట్ వాడకం అమాంతంగా పెరిగింది. దీంతో ఫేస్‌బుక్ వాడకం కూడా అదే రేంజ్‌లో జరిగింది. దీంతో ఫేస్‌బుక్ నికరలాభాలు అమాంతం ఎగిసాయి.

ఏప్రిల్ ఆఖరు నుంచి బెంగుళూరులో ఆపిల్ ఐఫోన్ల తయారీ !

రూ.23,567కోట్లకు పైగా

రూ.23,567కోట్లకు పైగా

జియో వాడకంతో ఫేస్‌బుక్ నికర లాభాలు ఏకంగా 128 శాతం ఎగిశాయి. 2016 డిసెంబర్ 31 నాటికి ముగిసిన త్రైమాసికానికి ఫేస్‌బుక్ లాభాలు 3.57 బిలియన్ డాలర్లు అంటే రూ.23,567కోట్లకు పైగా నమోదయ్యాయి.

గత ఆర్థికసంవత్సరం..

గత ఆర్థికసంవత్సరం..

గత ఆర్థికసంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు కేవలం 1.56 బిలియన్ డాలర్ల మాత్రమే. ఉచిత డేటా ఆఫర్లు నాలుగో క్వార్టర్లో ఫేస్‌బుక్ రిపోర్టు చేసిన బలమైన లాభాలకు ఎంతో సహకరించాయని మీడియా రిపోర్టులు పేర్కొన్నారు.

ఉచిత డేటా ఆఫర్లతో

ఉచిత డేటా ఆఫర్లతో

ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఫేస్‌బుక్ సీఎఫ్ఓ డేవిడ్ వెనర్ కూడా, ఆసియా నుంచి కంపెనీ గ్రోత్ అధికంగా ఉందని, ఇండియాలో ఆఫర్ చేసే ఉచిత డేటా ఆఫర్లతో ఆసియాలో కంపెనీ వృద్ధి ఎక్కువగా నమోదవుతుందన్నారు.

160 మిలియన్ యూజర్లు

160 మిలియన్ యూజర్లు

ఇండియాలో ఫేస్‌బుక్‌కు 160 మిలియన్ యూజర్లున్నారు. ఫేస్‌బుక్ హోమ్ గ్రౌండ్ తర్వాత భారతే రెండో అతిపెద్ద దేశం. మొబైల్ అడ్వర్‌టైజింగ్ రెవెన్యూలో యేటికేటికి 53 శాతం వృద్ధిని సాధిస్తోంది.

మోదీ తీసుకుంటున్న చర్యలు

మోదీ తీసుకుంటున్న చర్యలు

మరోవైపు డిజిటల్ ఎకానమీ ప్రోత్సహకంపై ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు కూడా డేటా వాడకాన్ని పెంచి, ఫేస్‌బుక్‌కు సాయపడుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Best Mobiles in India

English summary
Reliance Jios free data makes big contribution to Facebook revenue growth read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X