ఏప్రిల్ ఆఖరు నుంచి బెంగుళూరులో ఆపిల్ ఐఫోన్ల తయారీ !

Written By:

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో దూసుకుపోతున్న ప్రఖ్యాత అమెరికా దిగ్గజం ఆపిల్ కంపెనీ భారత్‌లో తన ఐపోన్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు ఆపిల్ కంపెనీ నుంచి తొలిసారి అధికారిక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ నెలాఖరు నుంచి ఆపిల్ కంపెనీ బెంగళూరులో ఐఫోన్ల తయారీని ప్రారంభించనున్నట్టు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది.

చేతికి చిక్కని రెడ్‌మి నోట్ 4, ఎప్పుడూ అవుట్ ఆఫ్ స్టాకే !

ఏప్రిల్ ఆఖరు నుంచి బెంగుళూరులో ఆపిల్ ఐఫోన్ల తయారీ !

తైవాన్‌కి చెందిన విస్ట్రన్ కార్పొరేషన్‌ మరో రెండు నెలల్లో ఈ ఫోన్ల తయారీ ప్రారంభిస్తుందని కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే వెల్లడించారు. ఆపిల్ ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్)గా ఉన్న విస్ట్రన్ కార్పొరేషన్ ఐఫోన్ల తయారీ వ్యవహారాలను చూస్తుంది.

జియోకి మళ్లీ క్లీన్ చిట్, ఖంగుతిన్న దిగ్గజాలు

ఏప్రిల్ ఆఖరు నుంచి బెంగుళూరులో ఆపిల్ ఐఫోన్ల తయారీ !

ఆపిల్ ఐఫోన్ ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు ప్రియా బాలసుబ్రహ్మణ్యం, ఐఫోన్ ఆపరేషన్స్ డైరెక్టర్ ధీరజ్ చుగ్, ప్రభుత్వ వ్యవహారాల సీనియర్ మేనేజర్ అలీ ఖనాఫర్ తదితరులతో కర్నాటక మంత్రులు, అధికారులు సమావేశమైనట్టు ఐటీ మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్లు తయారు చేస్తున్న కేవలం మూడు దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందన్నారు.

జియో ఉచితానికి ముప్పు..

ఏప్రిల్ ఆఖరు నుంచి బెంగుళూరులో ఆపిల్ ఐఫోన్ల తయారీ !

రాష్ట్రంలో ఐఫోన్ల తయారీ కోసం ఆపిల్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు ప్రియాంక ఖర్గే ప్రకటించినప్పటికీ ఆపిల్ ఎక్కడ, ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందనేదానిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. గతేడాది ఆపిల్ కంపెనీ మన దేశానికి 25 లక్షల ఐఫోన్‌లను ఎగుమతి చేసింది.

English summary
Apple Set to Begin Making iPhones in India by April-End read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot