షాకింగ్ న్యూస్: అమ్మకానికి ట్విట్టర్, కొనేది ఎవరంటే..

Written By:

ఒకప్పుడు సోషల్ మీడియాని ఓ ఊపు ఊపిన ట్విట్టర్ ఇప్పుడు ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇతర సోషల్ మీడియా దిగ్గజాలతో పోటీపడలేక భారీ నష్టాలను చవిచూస్తుండటంతో కంపెనీని అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా అనేక కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎవరు కొనేందుకు ఆసక్తి కనపరుస్తున్నారనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

చరిత్రలో తొలిసారి..ఫ్లిప్‌కార్ట్‌తో జత కట్టిన ఆపిల్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పలుమార్లు వార్తలు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ దిగ్గజం ట్విట్టర్‌ను అమ్మేస్తున్నారని కొందరు, అమ్మడం లేదని మరి కొందరు..ఇలా ఇప్పటికే పలుమార్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.

ట్విట్టర్ వందల మిలియన్ డాలర్ల నష్టాలను

మందగిస్తున్న యూజర్ వృద్ధి, తక్కువగా నమోదవుతున్న వ్యాపార ప్రకటనల ఆదాయాలతో గత కొంతకాలంగా ట్విట్టర్ వందల మిలియన్ డాలర్ల నష్టాలను మూటకట్టుకుంటోంది.

టెక్నాలజీ కంపెనీలతో ట్విట్టర్ సంప్రదింపులు

పదేళ్ల నుంచి సర్వీసులను అందిస్తున్న ఈ సంస్థ కంపెనీ బిజినెస్‌ల పరంగా తీవ్రంగా నష్టపోతోంది. దీంతో ఈ కంపెనీ విక్రయించడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ టెక్నాలజీ కంపెనీలతో ట్విట్టర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు కంపెనీకి చెందిన ఒకరు చెప్పారు.

ట్విట్టర్‌కు తిరుగులేని ఆధిపత్యం

అంతర్జాతీయంగా జరుగుతున్న న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, సోషల్ కమెంటరీ వంటి వార్తలను అందించడంలో ఇప్పటికీ ట్విట్టర్‌కు తిరుగులేని ఆధిపత్యం ఉంది.

గూగుల్

ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ కథనం ప్రకారం ట్విట్టర్‌ ఇప్పటికే గూగుల్ వంటి పలు టెక్నాలజీ కంపెనీలతో చర్చలు ప్రారంభించింది.త్వరలోనే గూగుల్ నుంచి బిడ్ దాఖలు కానున్నట్టు తెలుస్తోంది.

స్పందించడానికి

దీనిపై ట్విట్టర్‌గానీ, గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ అల్ఫాబెట్‌ ఐఎన్‌సీ గానీ స్పందించడానికి తిరస్కరించాయి.. యాహూను కోర్ ఇంటర్నెట్ వ్యాపారాలను సొంతం చేసుకున్న వెరిజోన్ సైతం ఈ బిడ్ చేయనున్నట్టు సమాచారం.

ట్విట్టర్ అమ్మకం వార్తతో

ట్విట్టర్ అమ్మకం వార్తతో శుక్రవారం కంపెనీ షేర్లు అంతర్జాతీయంగా 19 శాతం మేర జంప్ అయ్యాయి. 2013 తర్వాత ఒక్కరోజులో ఈమేర పెరగడం ఇదే మొదటిసారి.

కంపెనీని గూగుల్ సొంతం చేసుకుంటే

దీంతో ట్విట్టర్ మార్కెట్ విలువ16 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఒకవేళ ఈ కంపెనీని గూగుల్ సొంతం చేసుకుంటే మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఒమిడ్ కోర్డెస్టనీ ట్విట్టర్‌కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Twitter initiates talks with tech companies over sale: source read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting