మళ్లీ ఉద్యోగులపై ట్విట్టర్ వేటు

Written By:

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ త్వరలో ఉద్యోగులపై వేటు వేయనుంది. మార్కెట్లో ట్విట్టర్ ను కొనేవారు కరువవడంతో తానే ఎలాగైనా మార్కెట్లో నిలదొక్కుకోవాలని ఆ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించింది. నష్టాల నుంచి లాభాల బాటలోకి రావడానికి కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులను తీసివేయాలని నిర్ణయించింది.

ప్రపంచంలోనే అతి చిన్న టచ్‌స్క్రీన్‌ ఫోన్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

9 శాతం ఉద్యోగాలపై కోత

ట్విట్టర్ తన కంపెనీలోని 9 శాతం ఉద్యోగాలపై కోత విధించనున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. ఈ కోత ప్రభావంతో దాదాపు 350 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.

ట్విట్టర్‌కు 3,860 మంది ఉద్యోగులు

ఉద్యోగాల కోత ఎక్కువగా సేల్స్, పార్టనర్ షిప్ డిపార్ట్‌మెంట్స్, మార్కెటింగ్‌లలో ఉండనుందని కంపెనీ సీఈవో జాక్ డోర్సే తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌కు 3,860 మంది ఉద్యోగులున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లాభాలను ఆర్జించడంలో

గతేడాది కంటే యాక్టివ్ యూజర్లను 3 శాతం పెంచుకుని నెలకు 317 మిలియన్ యూజర్లను కలిగి ఉన్నప్పటికీ లాభాలను ఆర్జించడంలో మాత్రం కంపెనీ విఫలమైంది.

688 కోట్లకు పైగా నష్టాలు

గత క్వార్టర్లో ట్విట్టర్ 103 మిలియన్ డాలర్లు(688 కోట్లకు పైగా) నికర నష్టాలను మూటకట్టుకున్నట్టు ప్రకటించింది.

గతేడాది కూడా 336 ఉద్యోగులను

గతేడాది కూడా 336 ఉద్యోగులను ట్విట్టర్ తొలగించింది. గత నెలలోనే బెంగళూరులోని ఇంజనీరింగ్ ఉద్యోగులు 20 మందికి కూడా ట్విట్టర్ గుడ్‌బై చెప్పింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Twitter to lay off 9 percent of staff, pledges to increase growth read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting