ఫేస్‌బుక్‌ను అత్యంత ప్రైవసీగా ఉంచుకునే మార్గాలు

Written By:

ఈ రోజుల్లో ఫేస్‌బుక్‌ను ప్రతి ఒక్కరూ వాడుతుంటారు..అయితే ఆ ఫేస్‌బుక్‌ను వాడుతున్నప్పుడు మనకు కొన్ని సంధర్భాల్లో అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలు ఒక్కోసారి ఎదుటివారిని అంటే మన స్నేహితులను బాగా ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ఇక మనకయితే వాటిని నలిపిపారేయాలనిపిస్తుంటుంది. సో అలాంటి సమస్యలు రాకుండా మీ ఫేస్‌బుక్‌ను అత్యంత ప్రైవసీగా ఎలా ఉంచుకోవాలనేదానిపై కొన్ని రకాల సూచనలు ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఫేస్‌బుక్‌లో మీకు తెలియని ఆప్సన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్యాగ్ నుంచి కాపాడుకోండిలా

ఇందుకోసం మీరు అకౌంట్ సెట్టింగ్స్ లో కెళ్లి టైమ్ లైన్ ట్యాగింగ్ సెలక్ట్ చేసుకోండి. అక్కడ మీకు హు కెన్‌ పోస్ట్‌ యువర్‌ టైమ్‌లైన్‌' అని ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై ట్యాప్‌ చేస్తే ఫ్రెండ్స్‌, ఓన్లీ మి అని రెండు ఆప్షన్లుంటాయి. ఓన్లీ మి ఎంచుకుంటే మీరు మాత్రమే టైమ్‌లైన్‌లో పోస్ట్‌ చేయగలుగుతారు.

బ్లాక్‌ చేయాలంటే :

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ అకౌంట్‌ని బ్లాక్‌ చేయాలంటే చాలా సింపుల్‌. అకౌంట్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే బ్లాకింగ్‌ అని ఒక ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ఇంకో విండో ఒపెన్‌ అవుతుంది. అందులో ఎవరి అకౌంట్‌నైతే బ్లాక్‌ చేయాలనుకుంటున్నారో వారి పేరు లేక ఈమెయిల్‌ ఐడీని ఎంటర్‌ చేసి బ్లాక్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. ఫేస్‌బుక్‌లో మీ టైమ్‌లైన్‌లోని పోస్ట్‌లను తను చూడలేడు.

టూ స్టెప్‌ అథంటికేషన్‌

మీ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేస్తే అది మీకు తెలిసేలా కోడ్ జనరేట్ చేసుకోవచ్చు ఇందుకోసం మీరు అకౌంట్‌సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీ ఆప్షన్‌ని ఎంచుకోండి. అక్కడ లాగిన్ ఆప్సన్ దగ్గర క్లిక్ చేసి మీకు నచ్చినది సెట్ చేసుకోవచ్చు.

సేవ్‌ వీడియోస్/లింక్స్‌

రోజూ ఎన్నో వీడియోలు. చూద్దామంటే సమయం లేదు. అలాంటప్పుడు ఆ వీడియోను లేక లింక్‌ను బుక్‌మార్క్‌ చేయండి. ఈ కంటెంట్‌ సేవ్డ్‌ జాబితాలోకి చేరిపోతుంది. నావికాన్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే సేవ్డ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీరు బుక్‌మార్క్‌ చేసిన వీడియోలు ఉంటాయి. వాటిని తీరిగ్గా చూసుకోవచ్చు.

మీ పోస్ట్‌లు అందరూ చూడాలంటే

మీరు పోస్ట్ చేసిన ఫోటోలు, పోస్టులు మీ ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అందరికీ కనిపించాలంటే అకౌంట్ సెట్టింగ్స్ లో కెళ్లి పబ్లిక్ పోస్ట్ అనే అప్సన్ లోకెళ్లి అక్కడ పబ్లిక్ అని ఉంచితే చాలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What You Need to Know About Facebook Privacy read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot