Home
Tablets

Women's Day : మహిళా దినోత్సరం రోజున మంచి గిఫ్ట్‌ ఐడియా కోసం చూస్తున్నారా.. అయితే ఇవి చెక్‌ చేయండి!

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన మహిళలు ఉంటారు. వారికి ప్రత్యేక సందర్భాల్లో వివిధ రకాల బహుమతులతో మీరు సర్‌ప్రైజ్‌ చేసి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రేపు (మార్చి 8) అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని (international Women's Day) నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మీ జీవితంలోని ముఖ్యమైన మహిళామణుల కోసం ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలని భావిస్తున్నారా.. అయితే ఈ బెస్ట్‌ ట్యాబ్లెట్స్‌ పైన ఓ లుక్కేయండి.

ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇతర పనులు చేసుకొనేందుకు ట్యాబ్లెట్స్‌ అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2025 (Flipkart sale) జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌లతోపాటు HDFC బ్యాంకు కార్డుల కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వన్‌ప్లస్‌, లెనోవో, రియల్‌మి, ఇన్ఫినిక్స్‌ వంటి ట్యాబ్లెట్‌ను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

international womens day gifts

రియల్‌మి ప్యాడ్‌ 2 లైట్‌ :
ఈ రియల్‌మి (Realme Pad 2 Lite) ట్యాబ్లెట్‌ 10.5 అంగుళాల LCD 2k డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఐ కంఫర్ట్‌ డిస్‌ప్లే ఫీచర్‌లను కలిగి ఉంది. మీడియాటెక్‌ హీలియో G99 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

ఈ ప్యాడ్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది. ఈ రియల్‌మి ట్యాబ్లెట్‌ వెనుక వైపు 8MP కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రియల్‌మి ప్యాడ్‌ 2 లైట్ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 8300mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ ట్యాబ్లెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.14,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,499 కే సొంతం చేసుకోవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.16,999 కు విడుదల అయింది. ప్రస్తుతం రూ.15249 కే సొంతం చేసుకోవచ్చు.

international womens day gifts

వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో :
వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో (వైఫై వేరియంట్‌) (OnePlus Pad Go) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,499 గా ఉంది. HDFC క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.1250 తగ్గింపును పొందవచ్చు. ఈ ప్యాడ్‌ 11 అంగుళాల 2.4k LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హాని జరగకుండా ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ వన్‌ప్లస్ ప్యాడ్‌ మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుక వైపు 8MP కెమెరా, ముందువైపు 5MP కెమెరాను అమర్చి ఉంది. 33W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 8300mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మెరుగైన సౌండ్‌ ఎఫెక్ట్‌ కోసం క్వాడ్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్‌ X ప్యాడ్ :
ఈ ఇన్ఫినిక్స్ X ప్యాడ్‌ (Infinix X Pad) 11 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో G99, ఆండ్రాయిడ్ 14 OS తో పనిచేస్తోంది. ఈ ప్యాడ్ వెనుక వైపు 8MP, ముందువైపు 8MP కెమెరాలను కలిగి ఉంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ ప్యాడ్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. HDFC బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.1250 తగ్గింపును పొందవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14999 గా ఉంది. బ్యాంకు కార్డులతో తగ్గింపును పొందవచ్చు.

లెనోవో M11 ట్యాబ్లెట్ :
లెనోవో ట్యాబ్లెట్‌ (Lenovo M11 Tablet) 11.0 అంగుళాల FHD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13, మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్‌ పైన పనిచేస్తోంది. 15W ఛార్జింగ్ సపోర్టుతో 7040mAh బ్యాటరీ ని కలిగి ఉంది. వెనుక వైపు 13MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ధర రూ.13999 గా ఉంది. బ్యాంకు కార్డులతో రూ.1250 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
international womens day Flipkart offers best deals on tablets to gift to the women
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X