12.1 అంగుళాల భారీ డిస్‌ప్లే, 10,050mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 OS తో వన్‌ప్లస్ ట్యాబ్లెట్ విడుదల..!
Oneplus Pad Go 2 Tablet : వన్‌ప్లస్ ఇవాళ భారత్ మార్కెట్ లో వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్ పైన పనిచేస్తుంది. భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్ వైఫై, 5G కనెక్టివిటీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ వివరాలు.
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్లెట్ 12.1 అంగుళాల 2.8k LCD డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 88.5 స్క్రీన్ టూ బాడీ రేషియో, 284 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది.

మీడియాటెక్ చిప్, ఆండ్రాయిడ్ 16 OS :
ఈ ట్యాబ్లెట్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుంది. ఏఐ రైటర్, ఏఐ రికార్డర్, AI రిఫ్లక్షన్ ఎరేజర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
భారీ బ్యాటరీతో లాంచ్ :
వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్లెట్ 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10,050mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 6.5W వైర్ రివర్స్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ను 129 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చని వన్‌ప్లస్ తెలిపింది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా, ముందువైపు 8MP కెమెరాను అమర్చారు. ఈ ట్యాబ్లెట్ స్టైలస్, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 స్టైలో ను సపోర్టు చేస్తుంది. అయితే ఈ వేర్వేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని వన్‌ప్లస్ తెలిపింది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.4, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం 4 స్పీకర్‌లను కలిగి ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ట్యాబ్లెట్ వైఫై, 5G కనెక్టివిటీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. మొత్తంగా మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది.
* 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi) ధర రూ.25999
* 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (WiFi) ధర రూ.28999
* 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (WiFi + 5G కనెక్టివిటీ) ధర రూ.31999
ఈ ట్యాబ్లెట్ సేల్ డిసెంబర్ 18 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా బ్యాంకు కార్డులపై రూ.2000, లిమిటెడ్ టైమ్ డిస్కౌంట్లో భాగంగా రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తుంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








