Home
Tablets

Realme Tablet : రియల్‌మి నుంచి కొత్త ట్యాబ్లెట్‌.. తాజాగా కీలక వివరాలు లీక్‌..!

రియల్‌మి నుంచి నవంబర్‌ 28 వ తేదీన C85 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. డిసెంబర్ 4 వ తేదీన రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌, రియల్‌మి వాచ్‌ 5 స్మార్ట్‌వాచ్‌ కూడా విడుదల కానుంది. వీటికి సంబంధించిన అనేక వివరాలు ఇటీవల విడుదల అయ్యాయి. అయితే రియల్‌మి నుంచి త్వరలో ట్యాబ్లెట్‌ కూడా విడుదల కానుంది. తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి.

రియల్‌మి ప్యాడ్‌ 2 ట్యాబ్లెట్‌ 2023 సంవత్సరంలో భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. త్వరలో రియల్‌మి ప్యాడ్‌ 3 (Realme Pad 3 Launch Timeline) లాంచ్‌ కానుంది. అయితే రియల్‌మి ఇప్పటి వరకు ఎటువంటి అధికారం సమాచారం వెల్లడించలేదు. తాజాగా టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ ఈ వివరాలను లీక్‌ చేశారు.

Realme Pad 3 Tablet launch timeline leaked here are the expected specs and features

ఎప్పుడు విడుదల కానుంది? :
భారత్‌ మార్కెట్‌లో రియల్‌మి ప్యాడ్‌ 3 ట్యా్బ్లెట్‌ ఈ సంవత్సరం డిసెంబర్‌, 2026 జనవరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్‌ 5G, వైఫై వేరియంట్స్‌ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ప్యాడ్‌ స్పేస్‌ గ్రే, ఛాంపెయిన్‌ గోల్డ్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభించే అవకాశం ఉంది.

రియల్‌మి ప్యాడ్‌ 3 ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై రియల్‌మి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

బడ్జెట్‌ ధరలో భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే ఫోన్‌ :
భారత్‌లో నవంబర్‌ 28 వ తేదీన రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ వెనుక వైపు 50MP సోనీ IMX852 కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ, వీడియో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 5300 Sq mm తో కూడిన వేపర్‌ ఛాంబర్‌ ను కలిగి ఉంది.

7000mAh బ్యాటరీ :
ఈ ఫోన్‌ 45W SuperVOOC వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP69 ప్రో రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని రియల్‌మి తెలిపింది. ఫలితంగా 6 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల వరకు ఉన్నా డ్యామేజీ కాదని సంస్థ చెబుతోంది.

రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్ ను బ్యాంకు ఆఫర్లతో రూ.14999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్‌ 1 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. రియల్‌మి వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Pad 3 Tablet launch timeline leaked here are the expected specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X