12200mAh భారీ బ్యాటరీ, 11.61 అంగుళాల డిస్‌ప్లేతో రియల్‌మి ప్యాడ్ 3 విడుదల..!
Realme Pad 3 Tablet : రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్ లో ఇవాళ అనేక ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ జాబితాలో రియల్‌మి 16 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్, రియల్‌మి బడ్స్ ఎయిర్ 8 ఇయర్‌బడ్స్ విడుదల అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 200MP కెమెరాతోపాటు 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఈ రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్ (Realme Pad 3 Tablet) ఏకంగా 12,200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
రియల్‌మి ప్యాడ్ 3 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ ట్యాబ్లెట్ 11.61 అంగుళాల 2.8K డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 6.6mm థిక్‌నెస్ తో 578 గ్రాముల బరువును కలిగి ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 OS :
ఈ ట్యాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ చిప్‌సెట్ ను కలిగి ఉంది. Arm Mali G615 GPU ను కూడా అమర్చి ఉంది. మైక్రో SD కార్డుతో గరిష్ఠంగా 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది.
12200mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ ట్యాబ్లెట్ వెనుక, ముందు వైపు 8MP కెమెరాలు ఉన్నాయి. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 6.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 12200mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయింది. ఈ రియల్‌మి ప్యాడ్ డాల్బీ ఆడియో సపోర్టు క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ ట్యా్బ్లెట్ బ్లూటూత్ 5.4, వైఫై 5, డ్యూయల్ బ్యాండ్ WLAN, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ఇ-కంపాస్, హాల్ సెన్సర్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్ లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది.
రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్ ధర, సేల్ వివరాలు :
ఈ ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ (Wi-Fi) ధర రూ.26,999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (Wi-Fi + 5G) ధర రూ.29,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ (Wi-Fi + 5G) ధర రూ.31,999 గా ఉంది.
Designed for smart learning and everyday productivity, the #realmePad3 starts at ₹24,999*
— realme (@realmeIndia) January 6, 2026
First Sale on 16th Jan, 12 PM
*T&C Apply pic.twitter.com/vMBdIorg6v
సేల్ ఎప్పటినుంచి ప్రారంభం కానుంది :
ఈ ట్యాబ్లెట్ స్పేస్ గ్రే, ఛాంపియన్ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ట్యాబ్లెట్ సేల్ జనవరి 16 వ తేదీ మధ్యాహ్నం గంటల నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








