Home
Tablets

12000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్‌ప్లేతో ట్యాబ్లెట్‌ విడుదల.. పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..!

Redmi Pad 2 Pro 5G : షియోమీ సంస్థ భారత్‌ మార్కెట్‌ లో రెడ్‌మి నోట్‌ 15 5G స్మార్ట్‌ఫోన్‌తోపాటు రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G ట్యాబ్లెట్‌ లాంచ్‌ అయింది. ఈ ట్యాబ్లెట్‌ 12.1 అంగుళాల భారీ డిస్‌ప్లే, 12000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెడ్‌మి ప్యాడ్‌ వైఫై, 5G వేరియంట్స్‌ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్‌ తొలి సేల్‌ లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ ను అందిస్తుంది.

రెడ్‌మి ప్యాడ్‌ 2 ప్రో 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ట్యాబ్లెట్‌ 12.1 అంగుళాల 2.5k డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 249 ppi పిక్సల్‌ డెన్సిటీ, 360Hz టచ్ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ ను సపోర్టు చేస్తుంది.

Redmi Pad 2 Pro 5G Tablet

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ రెడ్‌మి ట్యాబ్లెట్‌ 4nm స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తుంది. 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని షియోమీ తెలిపింది.

12000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 60fps తో 1080p రిజల్యూషన్‌ తో వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 27W వైర్‌ రివర్స్ ఛార్జింగ్‌ సపోర్టుతో 12000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Redmi Pad 2 Pro 5G Tablet

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు యాక్సెలిరోమీటర్‌, గైరోస్కోప్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, కలర్ టెంపరేచర్‌ సెన్సర్‌, ఇ-కంపాస్‌, హాల్‌ సెన్సర్‌ ఉన్నాయి.

రెడ్‌మి ప్యాడ్‌ 2 ప్రో 5G ధర, సేల్‌ వివరాలు :
ఈ ట్యాబ్లెట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (Wi-Fi) వేరియంట్ ధర రూ.22999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (Wi-Fi + 5G) వేరియంట్ ధర రూ.25999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (Wi-Fi + 5G) వేరియంట్ ధర రూ.27999 గా ఉంది.

Redmi Pad 2 Pro 5G Tablet

భారత్‌ మార్కెట్లో రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G ట్యాబ్లెట్‌ సేల్‌ జనవరి 12 నుంచి ప్రారంభం కానుంది. షియోమీ రిటైల్‌ స్టోర్స్, Mi.com, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. SBI, ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. గ్రే, సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Pad 2 Pro 5G Tablet with 12000mAh Battery, 7 years security updates launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X