Home
Apps

వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. 'మెసేజ్ థ్రెడ్స్, కెమెరా ఆఫ్' ఫీచర్లు వచ్చేస్తున్నాయ్.. వీటితో ఉపయోగాలు ఇవే.

WhatsApp Message Threads: గ్రూప్ చాట్స్‌లో మెసేజ్‌లు గందరగోళంగా ఉంటున్నాయా? ఎవరి రిప్లై ఎక్కడ ఉందో వెతుక్కోవడానికి విసిగిపోయారా? అయితే ఇకపై ఆ సమస్యే ఉండదు. వాట్సాప్ కొత్తగా \"మెసేజ్ థ్రెడ్స్\" అనే ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా, మీరు ఒక ప్రత్యేక మెసేజ్‌కు రిప్లై ఇచ్చినప్పుడు, ఆ రిప్లైలన్నీ ఒక చోటనే కనిపిస్తాయి. ఒక మెసేజ్‌కు సంబంధించిన రిప్లైలన్నీ ఒక గ్రూప్‌గా ఏర్పడతాయి.

చాట్‌ మొత్తం వెతుక్కునే పని లేకుండా, ఆ థ్రెడ్‌ను ఓపెన్ చేస్తే చాలు, ఆ మెసేజ్‌కు వచ్చిన రిప్లైలన్నీ ఒకేసారి కనిపిస్తాయి. దీంతో చాటింగ్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్ చాట్స్‌లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గ్రూప్ చాటింగ్‌కి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

WhatsApp to Introduce Message Threads for Clearer Chats

* స్క్రీన్‌షాట్‌తో ఫీచర్ వస్తున్నట్లు చెప్పేశారుగా..

ప్రముఖ వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో ప్రకారం, ఈ ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.7.7లో కనిపించింది. కానీ ఇది ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. పబ్లిక్ టెస్టింగ్ కోసం ఇంకా రిలీజ్ కాలేదు. ఈ ఫీచర్ ఇండివిడ్యువల్ చాట్స్, గ్రూప్స్, కమ్యూనిటీస్, ఛానల్స్‌లో కూడా పనిచేస్తుంది.

అయితే, ఛానల్స్‌లో రిప్లై ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉందని వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ వెబ్‌సైట్ షేర్ చేసిన ప్రివ్యూ ప్రకారం, రిప్లైలు ఒక పాప్-అప్ విండోలో కనిపిస్తాయి. మీరు ఏదైనా కోట్ చేసిన మెసేజ్‌పై టాప్ చేస్తే, ఆ థ్రెడ్‌లో ఉన్న రిప్లైలన్నీ కనిపిస్తాయి.

అయితే, థ్రెడ్‌ను స్టార్ట్ చేసిన ఒరిజినల్ మెసేజ్ థ్రెడ్ వ్యూలో కనిపించకపోవచ్చు. ఈ ఫీచర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా తెలియదు. వాట్సాప్ దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. ఈ అప్‌డేట్ ముఖ్యంగా పెద్ద గ్రూపులతో ప్లాన్స్ చేసుకునే వారికి, పాత రిప్లైలు వెతుక్కునే వారికి చాలా ఉపయోగపడుతుంది.

* వీడియో కాల్స్ కోసం ప్రైవసీ ఫీచర్

వాట్సాప్ వీడియో కాల్స్ కోసం కూడా ఒక కొత్త ప్రైవసీ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. వీడియో కాల్స్ చేసేవారికి ఇది రక్షణ అందిస్తుంది. ప్రస్తుతం మీరు వీడియో కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు, ఫ్రంట్ కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. కెమెరా లేకుండా కాల్ మాట్లాడే ఆప్షన్ లేదు. చాలామంది యూజర్లు ఇది ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు.

రెడీగా లేనప్పుడు వీడియో కాల్ వస్తే, వెంటనే కెమెరా ఆఫ్ చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు. కానీ ఇది మారబోతోంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.7.3లో \"టర్న్ ఆఫ్ యువర్ వీడియో\" అనే కొత్త ఆప్షన్ వచ్చింది. దీని ద్వారా వీడియో కాల్ వచ్చినప్పుడు, వీడియో లేకుండా వాయిస్ కాల్‌లోనే ఆన్సర్ చేయొచ్చు.

\"యాక్సెప్ట్ వితౌట్ వీడియో\" అనే ఆప్షన్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంటే, మీరు కెమెరా లేకుండానే కాల్ ఆన్సర్ చేస్తున్నారని క్లియర్‌గా తెలుస్తుంది. ఒకవేళ మీరు తర్వాత వీడియో మోడ్‌కు మారాలనుకుంటే, కాల్ మధ్యలో ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్ల ప్రైవసీకి మరింత ప్రాధాన్యతనిస్తుందని చెప్పొచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp is developing message threads for organized chats and a video call privacy feature. Threads group replies, improving clarity. A voice-only option enhances video call privacy upon answering.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X