2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

|

టెక్నాలజీ పుణ్యమా అంటూ శాస్త్ర సాంకేతిక విభాగంలో నిత్యం ఏదో ఒక ఆవిష్కరణ చోటుచేసుకుంటోంది. వాక్ మెన్.. మొబైల్ ఫోన్... కంప్యూటర్ ఇలా అనేక ఆవిష్కరణలు ప్రపంచ స్థతిగతులను మార్చేసాయి. టెక్నాలజీ ప్రపంచంలో 2014కు ప్రత్యేకమైన హోదా ఉంది. ఈ ఏడాది పలు విప్లవాత్మక ఆవిష్కరణలను ఆధునిక మనిషి సాకరం చేసాడు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ ఏడాది ప్రపంచానికి పరిచయమై సాంకేతిక ప్రపంచంలో చారిత్రాత్మక స్థానాలను సొంతం చేసుకున్న పలు అత్యుత్తమ ఆవిష్కరణల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

 2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

 సెల్ఫీ సంస్కృతి 2013లో పరిచయమైంది. కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త ఒరవడికి నాంది పలికిన సెల్ఫీ సంస్కృతి చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన హోదాను  సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది సెల్ఫీ స్టిక్. దీని ద్వారా సెల్ఫీ కావల్సిన కోణంలో చిత్రీకరించుకోవచ్చు.

 2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంగారక గ్రహం పైకి ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఆ గ్రహకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించి విశ్వ రహస్యాల చేదనలో నిమగ్నమైంది.

 

 

 2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

యాపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన యాపిల్ వాచ్ అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో నవశకానికి నాంది పలుకుతోంది. 2015లో వీటిని యాపిల్ వాచ్ మార్కెట్లో లభ్యమవుతుంది. ధర అంచనా $349 పై చిలుకు డాలర్లు

 2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

ప్రైవసీకి ప్రత్యేకమైన ప్రాధాన్యతను కల్పిస్తూ అమెరికా చెందిన ప్రముఖ కంపెనీ బ్లాక్ ఫోన్ పేరుతో సరికొత్త హ్యాండ్‌సెట్‌ను డిజైన్ చేసింది. ఈ ఫోన్ లో డేటా పూర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్ కాబడి ఉంటుంది.

 2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

మైక్రోసాఫ్ట్  కంపెనీ డిజైన్ చేసిన ఈ హైబ్రీడ్ కంప్యూటింగ్ డివైజ్‌ను టాబ్లెట్ అలానే ల్యాప్‌టాప్‌లో ఉపయోగించుకోవచ్చు. అత్యాధునిక కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని మైక్రోసాఫ్ట్ ఈ డివైజ్‌లో పొందుపరిచింది.

 2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

హిమోప్యూరిఫయర్

ప్రపంచానే వణికిస్తోన్న ఎబోలా వైరస్‌ పై పోరాడేందుకు Aethlon మెడికల్ అనే సంస్థ ఈ ఫిల్టర్‌ను రూపొందించింది.  ఈ క్యాట్రిడ్జ్ లో ఏర్పాటు చేసిన లిక్టిన్ ఫిల్టర్ రక్తంలో వైరస్‌లను శుద్ధి చేస్తుంది.

 2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

The Real-Life Hoverboard (ద రియల్ లైఫ్ హోవర్‌బోర్డ్)

స్కేట్ బోర్డ్ తరహాలో కనిపిస్తున్న ఈ హోవర్‌బోర్డ్ భూమికి  ఒక అంగుళం ఎత్తులో ప్రయాణిస్తుంది. ఈ బోర్డ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బ్యాటరీ వ్యవస్థ 15 నిమిషాల పాటు బ్యాకప్ నిస్తుంది.

 2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

3జీ సిస్టమ్స్ అనే సంస్థ ప్రత్యేకమైన 3-డీ పరికరాన్ని డిజైన్ చేసింది. ఈ 3-డీ డివైస్ ఏ వస్తువునైనా తయారు చేయగలవు. టెక్నాలజీనికి నిజంగా హ్యాట్సాఫ్ కదండీ..

 2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

పార్టీలు మొదులుకుని సెమినార్లు వరకు కూలర్లు విరివిగా ఉపయోగించటాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఈ అంశాన్ని పరిగణలోకి ఓ స్టార్టప్ బహుళ ఉపయోగకర కూలర్‌ను డిజైన్ చేసింది. ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ కూలర్ ద్వారా ఆహారపదార్థాలు, పానీయాలను చల్లబర్చటమే కాదు యూఎస్బీ చార్జర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

 2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

2014 బెస్ట్ సాంకేతిక ఆవిష్కరణలు!

ఈ ఫోటోలో మీరు చూస్తున్నది వజ్రం పొదిగి ఉన్న ఉంగరమనుకుంటే పొరబడినట్లే. మీ స్మార్ట్‌ఫోన్‌కు ఏ విధమైన నోటిఫికేషన్ అందినా ఈ ఉంగరం  తళుక్కున మెరుస్తుంది. టెక్నాలజీ నిజంగా అద్భతం కదండీ....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
The Best Inventions of 2014. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X