మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చటం ఏలా..?
వై-ఫై.. ఇంటర్నెట్‌ను వినియోగిస్తోన్న దాదాపు చాలామందికి ఈ పదం సుపరిచితం. వై-ఫై (వైర్ లెస్ ఫెడిలిటీ), ఈ సాంకేతిక ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్‌ను సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లకు వైర్ల సహాయం లేకుండా విస్తరించుకోవచ్చు.

ఈ వ్యవస్థకు చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. వై-ఫై పద్థతిలో పరికరాల మధ్య సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.
ఇన్ఫోసిస్ అతిపెద్ద క్యాంపస్, హైదరాబాద్‌లో
మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చి మీ మిత్రులందరికి ఇంటర్నెట్‌ను షేర్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...

మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చటం ఏలా..?
థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హబ్‌గా మార్చే ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చటం ఏలా..?
వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చాలనుకుంటున్న మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో తప్పనిసరిగా వైర్‌లెస్ అడాప్టర్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా ఉన్నా పర్వాలేదు.

మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చటం ఏలా..?
మీ ల్యాప్‌టాప్‌లో వై-ఫై హాట్ స్పాట్‌ను క్రియేట్ చేసేందుకు అనేక థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు Virtual Wifi Hotspot. ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్ దాదాపుగా అన్ని విండోస్ వర్షన్‌లను సపోర్ట్ చేస్తు్ంది.

మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చటం ఏలా..?
సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకుని మీ ల్యాపీలో లాంచ్ చేయండి.

మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చటం ఏలా..?
హాట్ స్పాట్‌ను సెక్యూరిటీ కనెక్టెడ్ మోడ్‌లో లాంచ్ చేయండి.
రెండు కంప్యూటర్ల మధ్య వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను సృష్టించటాన్నే కంప్యూటర్ పరిభాషలో ad hoc అని పిలుస్తారు. మీ ల్యాప్‌టాప్‌లో వై-ఫై హాట్ స్పాట్‌ను సెటప్ చేసే క్రమంలో AdHoc-OPEN ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ హాట్ స్పాట్‌కు ఇతర డివైస్‌లు ఏ విధమైన పాస్‌వర్డ్ సహాయం లేకుండా కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది. మరో ఆప్షన్ AdHoc-WEPను సెలక్ట్ చేసుకున్నట్లయితే హాట్ స్పాట్ కు కనెక్ట్ అయ్యే ప్రతి కనెక్షన్ కు పాస్ వర్డ్ అవసరమవుతుంది. సాధ్యమైనంత వరకు మీ హాట్ స్పాట్ ను సెక్యూరిటీ కనెక్టెడ్ మోడ్ లో లాంచ్ చేయండి.

మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చటం ఏలా..?
సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా సెటప్ చేసిన తరువాత "Start Hotspot" ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ల్యాప్‌టాప్‌లో వర్చువల్ వై-ఫై హాట్ స్పాట్ సృష్టించబడుతుంది.

మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చటం ఏలా..?
మీ వై-ఫై హాట్ స్పాట్‌కు కనెక్ట్ అయ్యే అన్ని డివైస్‌ల్లోనూ ఇదే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఇప్పుడు మీ వై-ఫై హాట్ స్పాట్ ద్వారా వెలువడే వై-ఫై ఇంటర్నెట్‌ను ఉచిత మీ మిత్రులకు షేర్ చేయండి.


Click it and Unblock the Notifications








