మీ ఫోన్‌లో ‘IMEI’ నెంబర్ తెలుసుకోవాలంటే..?

ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను గుర్తించటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది. మీ ఫోన్‌లో ఐఎమ్ఈఐ నెంబర్‌ను గుర్తించేందుకు పలు ముఖ్యమైన ఆప్షన్స్‌ను ఇప్పుడు చూద్దాం...

మీ ఫోన్‌లో ‘IMEI’ నెంబర్ తెలుసుకోవాలంటే..?
ఫోన్ ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను తెలుసుకునేందుకు ఇదుకో సులువైన పద్ధతి. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు.

మీ ఫోన్‌లో ‘IMEI’ నెంబర్ తెలుసుకోవాలంటే..?
మీరు ఐఫోన్ 5 లేదా ఆఫై వర్షన్ ఐఫోన్‌ను వాడుతున్నట్లయితే డివైస్ బ్యాక్ ప్యానల్ పై ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను చూడొచ్చు. ఐఫోన్ 4ఎస్ లేదా పాత వర్షన్ ఐఫోన్‌లను వాడుతున్నట్లయితే సిమ్ ట్రే పై ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను చూడొచ్చు.

మీ ఫోన్‌లో ‘IMEI’ నెంబర్ తెలుసుకోవాలంటే..?
ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > About > IMEIలోకి వెళ్లటం ద్వారా ఐఎమ్ఈఐ నెంబర్‌ను తెలుసుకోవచ్చు.

మీ ఫోన్‌లో ‘IMEI’ నెంబర్ తెలుసుకోవాలంటే..?
ఐఫోన్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > General > Aboutలోకి వెళ్లి IMEI నెంబర్‌ను తెలుసుకోవచ్చు. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను ఫోన్ వెనుక భాగంలోని బ్యాటరీ క్రింద భాగంలో చూడొచ్చు.

మీ ఫోన్‌లో ‘IMEI’ నెంబర్ తెలుసుకోవాలంటే..?
దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకం. ఈ నెంబర్ సరిలేని నకిలీ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ మార్కెట్లో యథేచ్చగా విక్రయిస్తున్నారు.


Click it and Unblock the Notifications








