Netflix వినియోగదారులకు మరొక ఉచిత ఆఫర్!!!!


ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రస్తుతం వీడియోలను చూడడానికి అధికంగా OTT ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్నారు. ఇందులో నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వంటి వాటిని అధిక మంది వినియోగిస్తూ ఉంటారు. OTT ప్లాట్‌ఫాంలలో అధిక మంది సబ్ స్క్రైబర్స్ కలిగి వారిలో కూడా నెట్‌ఫ్లిక్స్ ముందు వరుసలో ఉంది.

Advertisement

నెట్‌ఫ్లిక్స్ OTT యాప్

ప్రపంచంలోనే వీడియో ప్లాట్‌ఫాంలో అత్యంత ప్రజాదరణ పొందిన OTT యాప్ లలో నెట్‌ఫ్లిక్స్ కూడా ఒకటి. OTT ప్లాట్‌ఫాం దిగ్గజం 2020 మొదటి త్రైమాసికంలో 15.8 మిలియన్ల మంది సభ్యులను చేర్చుకొని ప్రస్తుతం మొత్తంగా 182 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉంది.

Realme TV: అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే స్మార్ట్ టీవీ....

Advertisement
నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్

ఇటీవల నెట్‌ఫ్లిక్స్ దాని చందాదారులను మరింతగా ఆకట్టుకోవడానికి మరియు అద్భుతమైన స్ట్రీమింగ్ అనుభవాన్ని అందించడానికి వివిధ రకాల అద్భుతమైన ప్రయోజనాలను మరియు వాటి యొక్క సేవలను అదనంగా జోడించింది. ఇందులో భాగంగా ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఒక నెల ఖరీదైన వన్-టైర్ అప్ డేట్ లను ఉచితంగా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ తన చందాదారులకు అందుబాటులో ఉంచిన మరికొన్ని ఆఫర్లు మరియు వాటి యొక్క ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నెట్‌ఫ్లిక్స్ కొత్త ఆఫర్ ఏమిటి?

నెట్‌ఫ్లిక్స్ చందాదారుడి యొక్క ప్రస్తుత ప్లాన్ ను ఒక నెల ఖరీదైన ప్లాన్ కు అప్‌గ్రేడ్ చేస్తుంది. అంటే స్టాండర్డ్ (SD) మరియు సింగిల్-స్క్రీన్ స్ట్రీమింగ్‌ను అందించే స్టాండర్డ్ ప్లాన్ బేసిక్ ప్లాన్ కు అప్‌గ్రేడ్ చేయబడుతుంది. ఇది హై డెఫినిషన్ (HD) ను అందించడంతో పాటుగా రెండు-స్క్రీన్ లలో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. అదేవిధంగా స్టాండర్డ్ ప్లాన్ ను ప్రీమియం ప్లాన్‌లోకి అప్‌గ్రేడ్ చేస్తుంది. ఇది చందాదారులకు అత్యధిక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రీమియం ప్లాన్ కింద చందాదారులు అల్ట్రా-హై డెఫినిషన్ (UHD) నాణ్యతను పొందుతారు. ఇది మాత్రమే కాదు చందాదారులు నెట్‌ఫ్లిక్స్ యొక్క ప్రీమియం కంటెంట్ లైబ్రరీని ఒకేసారి నాలుగు స్క్రీన్‌లలో చూడగలుగుతారు.

30 రోజుల తరువాత ?

నెట్‌ఫ్లిక్స్ కొత్త ఆఫర్ కింద అప్‌గ్రేడ్ ను కేవలం 30 రోజుల వరకు మాత్రమే అందిస్తుంది. ప్రచార కాలం ముగిసిన తరువాత చందాదారులు తమ ప్లాన్ యొక్క సాధారణ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. చందాదారులు ప్రీమియం ప్లాన్‌తో వెళితే వారు రూ.799 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చందాదారులు స్టాండర్డ్ ప్లాన్ ను ఎంచుకుంటే కనుక వారు రూ.649 చెల్లించవలసి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ మార్కెటింగ్ అవకాశాలు

ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ తన వినియోగదారుల స్థావరాన్ని మరింతగా విస్తరించడానికి మరియు వారికి అద్భుతమైన స్ట్రీమింగ్ అనుభవాన్ని అందించడానికి విభిన్న మార్కెటింగ్ అవకాశాలను పొందుతోంది. ఇటీవల మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ గత ఒక సంవత్సరం నుండి నిష్క్రియాత్మకంగా ఉన్న చందాదారుల యొక్క అన్ని సభ్యత్వాలను రద్దు చేస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ స్వయంచాలకంగా మొత్తాన్ని తీసివేస్తుంది కాబట్టి ఇది నిష్క్రియాత్మక చందాదారులను కష్టమైన స్థితిలో ఉంచుతుంది. వారికి సహాయపడటానికి మరియు చందాదారులలో నమ్మకాన్ని పెంచడానికి నెట్‌ఫ్లిక్స్ చందాలను రద్దు చేస్తుంది. ఇది మాత్రమే కాదు కొంతకాలం తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో భాగం కావాలనుకుంటే రద్దు చేసిన సభ్యత్వాల డేటాను వచ్చే 10 నెలల పాటు నెట్‌ఫ్లిక్స్ నిల్వ చేస్తుంది.

Best Mobiles in India

English Summary

Netflix India Subscribers Gets Free Upgrade to Standard and Premium Plans