Netflix వీడియో స్ట్రీమింగ్ సర్వీసులోని కొత్త ఫీచర్స్ ఇవే...

|

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులలో అధికంగా పాపులర్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ యొక్క కొత్త ఫీచర్లలో భాగంగా ఇది ఎంపిక చేసిన ఫామిలీలకు మరింత నియంత్రణను అందిస్తుంది. కొత్త ఫీచర్లు వారి కుటుంబాలకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నియంత్రణలను తల్లిదండ్రులకు ఇస్తుంది.

నెట్‌ఫ్లిక్స్

వినియోగదారుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ ఈ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. పిల్లలకు అవసరం లేని కంటెంట్ ను యాక్సిస్ చేయకుండా నిరోధించడానికి వ్యక్తిగత ప్రొఫైల్‌లను ఇప్పుడు పిన్ చేయవచ్చు. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ తల్లిదండ్రులను వయస్సు ఆధారంగా శీర్షికలను ఫిల్టర్ చేయడానికి అనుమతిస్తుంది మరియు వినియోగదారులు పేరుతో వ్యక్తిగత శీర్షికలు లేదా సిరీస్‌లను కూడా తొలగించవచ్చు. ఈ కొత్త ఫీచర్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్‌ పిన్ సెట్ ఫీచర్

నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్‌ పిన్ సెట్ ఫీచర్

నెట్‌ఫ్లిక్స్ యొక్క వీడియో స్ట్రీమింగ్ యాప్ ఒకేసారి ఐదు ప్రొఫైల్‌లను సృష్టించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. తాజా అప్ డేట్ తో నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు ఇప్పుడు వారి ప్రొఫైల్‌ను నాలుగు అంకెల పిన్‌తో ప్రొటెక్ట్ చేయవచ్చు. పిన్ ప్రొటెక్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం పిల్లలు వాటిని యాక్సెస్ చేయకుండా నిరోధించడం. ప్రొఫైల్ కోసం పిన్ ను సెటప్ చేయడానికి వినియోగదారుల యొక్క ప్రొఫైల్ సెట్టింగులలోని ‘అకౌంట్' ఆప్షన్ లోకి వెళ్లి ‘ప్రొఫైల్ & పేరెంటల్ కంట్రోల్స్' కి వెళ్లి సెట్ చేయవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఫిల్టరింగ్ ఫీచర్‌

నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఫిల్టరింగ్ ఫీచర్‌

నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొత్తగా కంటెంట్ ఫిల్టరింగ్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు వయస్సు ఆధారంగా కంటెంట్‌ను ఫిల్టర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వినియోగదారుల వయస్సుకి తగిన టైటిల్స్ ఫిల్టర్ చేయడం ద్వారా వారి పిల్లలు నెట్‌ఫ్లిక్స్ వీక్షణను కంట్రోల్ చేయవచ్చు.

నెట్‌ఫ్లిక్స్

జనాదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో వినియోగదారులను వ్యక్తిగత సిరీస్ లేదా ఫిల్మ్‌లను టైటిల్ ద్వారా తొలగించడానికి అనుమతిస్తుంది. ఈ ఫిల్టర్ ఉపయోగించినప్పుడు బ్లాక్ చేయబడిన శీర్షిక (లు) ఆ ప్రొఫైల్‌లో ఎక్కడా కనిపించవు అని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. చివరగా అకౌంట్ సెట్టింగులలో కొత్తగా "ప్రొఫైల్ మరియు తల్లిదండ్రుల నియంత్రణలు" అనే కొత్త హబ్ చేరింది. అదనంగా తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సృష్టించిన ప్రొఫైల్‌లో వారు ఏమి చూస్తున్నారో ఇప్పుడు చూడవచ్చు. అంతేకాకుండా పిల్లల ప్రొఫైల్‌లలో ఎపిసోడ్‌ల ఆటోప్లేని కూడా ఆపివేయవచ్చు.

Best Mobiles in India

English summary
Netflix Introduced new feature 'PIN Protection' for Individual Profiles

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X