శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... ఫీచర్స్ ఇవే!!!


ఇండియాలో ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న జాబితాలో శామ్సంగ్ కంపెనీ మొదటి వరుసలో ఉంది. శామ్సంగ్ కంపెనీ విడుదల చేసే ప్రతి మోడల్ ప్రపంచం మొత్తం మీద గొప్ప ఆదరణను పొందుతున్నాయి. 2020 సంవత్సరంలో మొదటి సారిగా శామ్సంగ్ తన కొత్త శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో ఈ రోజు లాంచ్ చేసింది.

Advertisement

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్ 10 యొక్క టోన్ డౌన్ వెర్షన్ గా భారతదేశంలో ఈ రోజు గొప్పగా లాంచ్ చేయబడింది. ఇది గత సంవత్సరం చివర్లో ప్రారంభించబడింది. ఈ ఫోన్ సంస్థ యొక్క సొంత ఎక్సినోస్ 9810 SoC తో రన్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

సెల్ఫీలతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన ప్రబుద్దుడు

Advertisement
ధరల వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో కేవలం రెండు వేరియంట్ లలో మాత్రమే విడుదల అయింది. ఇందులో 6GB ర్యామ్ +128 GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.38,999 కాగా 8 GB ర్యామ్ +128 GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 40,999 రూపాయలు. ఇది ఆరా గ్లో, ఆరా బ్లాక్ మరియు ఆరా రెడ్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రీ-బుకింగ్స్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి తెరవబడ్డాయి. దీనిని ఫిబ్రవరి 3 నుండి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

 

 

ఫాస్ట్‌ట్యాగ్‌ యాక్టివేషన్ పేరుతో రెచ్చిపోతున్న మోసగాళ్ళు

స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉంటుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్ HD + ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 1080 x 2400 పిక్సెల్స్ రెజల్యూషన్,394ppi పిక్సెల్ సాంద్రత మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఇది 2.7GHz ఎక్సినోస్ 9810 ఆక్టా-కోర్ SoC తో రన్ అవుతుంది. ఇది 6GB మరియు 8GB RAM ఎంపికలతో మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో జత చేయబడి ఉంటుంది. మెమొరీని 1TB వరకు విస్తరించడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

 

 

సున్నితమైన పోర్న్ నెట్‌వర్క్ డేటా ఆన్‌లైన్‌లో బహిర్గతం

కెమెరా

ఇందులో గల కెమెరాల విషయానికొస్తే గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ మరియు ఓఐఎస్ లతో ఎఫ్ / 1.7 లెన్స్ ను కలిగి ఉన్నాయి. అలాగే ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ మూడవ కెమెరా ఉన్నాయి. ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

 

 

Rs.2,000 డిస్కౌంట్ ఆఫర్ తో ఫ్లిప్‌కార్ట్‌లో హానర్ 9X సేల్స్

ఫీచర్స్

గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉండడంతో పాటుగా ఇది స్టయిలిష్ S పెన్ మద్దతుతో వస్తుంది. స్టైలస్ బ్లూటూత్ లో-ఎనర్జీ (BLE స్టాండర్డ్) కు మద్దతు ఇస్తుంది. ఇందులో మల్టీమీడియా కంట్రోల్, పిక్చర్ క్లిక్ చేయడం మరియు ఎయిర్ కమాండ్స్ వంటి సాధారణ లక్షణాలను అందిస్తుంది. ఈ ఫోన్ 76.1 x 163.7 x 8.7mm కొలతలను కలిగి ఉండి 199 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English Summary

Samsung Galaxy Note 10 Lite Launched In India: Price And Specifications