Airtel Xstream Premium: లైవ్ ఛానెల్‌లు మరింత పెరిగాయి.. అలాగే మరొక గొప్ప ఫీచర్!!!


డిటిహెచ్ రంగంలో ఇకటైన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ OTT కంటెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉత్తేజకరమైన టీవీ కార్యక్రమాలు మరియు చలనచిత్రాలను ప్రసారం చేయడానికి ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రీమియం కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సభ్యులై ఉండాలి.

Advertisement

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం

ఇది టీవీ కార్యక్రమాలు మరియు చలనచిత్రాలు మాత్రమే కాకుండా లైవ్ టీవీ ఛానల్ లను కూడా ప్రసారం చేస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సభ్యత్వంతో ప్రస్తుతానికి 350+ లైవ్ ఛానెల్‌లను మాత్రమే అందిస్తున్నది. కానీ ఆ పరిమితిని త్వరలోనే 400+ లైవ్ టీవీ ఛానెల్‌లకు పెంచబోతున్నట్లు ఎయిర్‌టెల్ సంస్థ తెలిపింది. సాధారణంగా లైవ్ టీవీ ఛానెల్స్ లను మనం OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లతో పొందలేము కానీ ఇకపై ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో లైవ్ ఛానల్లను పొందవచ్చు. అంటే మీరు అదనపు మొత్తాన్ని చెల్లించకుండా మీకు ఇష్టమైన టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయగలుగుతారు.

Advertisement
ఎయిర్టెల్ STB

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సెట్-టాప్ బాక్స్ (STB) ను పొందడం లేదా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంను దాని చందా పొందడానికి అందిస్తున్న ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు చేయడం ద్వారా దీనిని యాక్సిస్ చేయవచ్చు. అలాగే ప్రీమియం చందాను ఉచితంగా పొందడానికి మీరు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లో కొత్త లైవ్ టీవీ ఛానెల్‌లు

గూగుల్ ప్లే స్టోర్‌లోని లిస్టింగ్ ప్రకారం ఎయిర్‌టెల్ తన OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం 73 కొత్త ఛానెల్‌లను జోడించబోతోంది. ఇప్పుడు మీరు HBO, కలర్స్, ETV, WB, CNBC, News18, CNN, Pogo, Cartoon Network వంటి మరెన్నో ఛానెల్‌లను యాక్సెస్ చేయగలరు. మీకు ఇష్టమైన అన్ని టీవీ ఛానెల్‌లను ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సహాయంతో విడిగా చెల్లించడం కంటే యాక్సెస్ చేయటం కంటే గొప్పది ఏదీ లేదు.

OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ + హాట్‌స్టార్ వంటి OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం చెల్లించడం అనేది ఖర్చుతో కూడుకున్న విషయం ఆపై టీవీ ఛానెల్‌ల కోసం విడిగా చెల్లించాలి అంటే మరింత భారం పడినట్లే. కానీ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో మీరు అన్నింటినీ ఒకే చోట తక్కువ ఖర్చుతో పొందవచ్చు.

బహుళ భాషలలో ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కంటెంట్‌

ఎయిర్టెల్ దేశంలోని ప్రతి ప్రాంతం నుండి తన ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం కస్టమర్లు సంతృప్తికరంగా ఉండేలా చూసుకుంది. అందుకోసం ఎక్స్‌స్ట్రీమ్ కంటెంట్‌లలో అన్ని రకాల భాషలకు చెందిన ఛానెల్‌లు ఉన్నాయి. ఇందులో మీరు మీకు నచ్చిన ఛానెల్‌లను ఎంచుకొనే అవకాశం కూడా ఉంది.

పాజ్ ఫీచర్

అలాగే మీరు ఎప్పుడైనా భాషా సెట్టింగులను మార్చవచ్చు. అంతే కాదు మీ సాధారణ టీవీ సెట్-టాప్ బాక్స్‌లతో మీకు లభించని లైవ్ టీవీ కోసం ఒక ప్రత్యేక ఫీచర్ కూడా ఉంది. అంటే లైవ్ టీవీని పాజ్ చేయడం. అవును మీరు నిజంగా మీ లైవ్ టీవీలో ఉన్న కంటెంట్‌ను పాజ్ చేసి ఆపై మీ సౌలభ్యం మేరకు తిరిగి ప్లే చేయవచ్చు. మీ కోసం లైవ్ టీవీ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఎయిర్‌టెల్ బృందం చాలా కష్టపడింది. మీకు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కనుక ఇప్పుడు మీరు బఫరింగ్ సమస్యలను ఎదుర్కోరు.

Best Mobiles in India

English Summary

Airtel Xstream Premium Live TV Channels Count Increased