Motorola Edge+ స్మార్ట్‌ఫోన్ లాంచ్... డిస్కౌంట్ ఆఫర్లతో ప్రీ-బుకింగ్


మోటరోలా యొక్క 2020 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ + ఈ రోజు ఇండియాలో అధికారికంగా విడుదల అయింది. లెనోవా యాజమాన్యంలోని మోటరోలా సంస్థ మోటరోలా ఎడ్జ్ మరియు ఎడ్జ్ + అనే ఈ రెండు సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను గత నెలలో విడుదల చేసింది.

Advertisement

ఇందులో మోటరోలా ఎడ్జ్ + ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్టాండర్డ్ ఫీచర్స్ అయిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865, 108-మెగాపిక్సెల్ కెమెరా, OLED డిస్ప్లే మరియు 5G లతో వస్తుంది. 2020 లో టాప్-ఆఫ్-ది-లైన్ ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇండియా ధర, లభ్యత మరియు ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Realme Smart TV ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్ వేయండి....

Advertisement
ధరల వివరాలు

మోటరోలా ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ తో మాత్రమే లభించే ఈ హ్యాండ్‌సెట్ యొక్క ధర రూ.74,999 గా ఉంది. ఇది ఈ రోజు అంటే మే 19 నుండి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రీ-ఆర్డర్స్ చేయడానికి కొనుగోలుదారులకు అవకాసం ఇస్తున్నది. వీటి మొదటి సేల్స్ మే 26 నుంచి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో మొదలుకానున్నాయి. Realme Narzo 10 Sale: గొప్ప తగ్గింపు ఆఫర్లతో నేడే ప్రారంభం..

లాంచ్ ఆఫర్స్

మోటరోలా ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ స్మోకీ సాంగ్రియా మరియు థండర్ గ్రే వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మొదలుకానున్న ముందస్తు బుకింగ్ ల మీద అద్భుతమైన లాంచ్ ఆఫర్లను అందిస్తున్నది. ఐసిఐసిఐ బ్యాంక్‌ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల వినియోగదారులకు రూ.7,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించడం కోసం ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు క్యాష్ బ్యాక్‌తో పాటు నో-కాస్ట్ ఇఎంఐ లావాదేవీలను కూడా అదనంగా అందిస్తున్నది.

మోటరోలా ఎడ్జ్ + స్పెసిఫికేషన్స్

మోటరోలా ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + కర్వేడ్ OLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, HDR10 + సపోర్ట్ మరియు పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్‌తో వస్తుంది. అంతర్గతంగా ఇది ఎడ్జ్ సిబ్లింగ్ నుండి భిన్నంగా ఉంటుంది. ఇది మోటరోలా క్వాల్‌కామ్ యొక్క మెయిన్ స్నాప్‌డ్రాగన్ 865 SoC ను కలిగి ఉండి 12GB RAM మరియు 256GB UFS 3.0 ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది.

కెమెరా సెటప్‌

మోటరోలా ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో హై-ఎండ్ ఎడ్జ్ + లో హై-రెస్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ ఎఫ్ / 1.8 ఎపర్చరు మరియు 0.8-మైక్రాన్ పిక్సెల్ సైజుతో ఉంటుంది. ట్రిపుల్-కెమెరా సెటప్‌లోని ఇతర రెండు లెన్స్‌లలో 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అన్స్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెటప్‌కు స్టాండర్డ్ వేరియంట్ ఎడ్జ్ వంటి టోఫ్ సెన్సార్ మద్దతు ఇస్తుంది. ఇది 2X కి బదులుగా 3X ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు f / 2.0 ఎపర్చరు మరియు 0.9-మైక్రాన్ పిక్సెల్ పరిమాణంతో 25 మెగాపిక్సెల్ కెమెరా అమర్చబడి ఉంది.

బ్యాటరీ

మోటరోలా ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో వస్తుంది. ఇది 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు మద్దతు ఇచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది వై-ఫై 6 తో పాటు mmWave మరియు 6Ghz ‌పై 5G సపోర్ట్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English Summary

Motorola Edge+ Launched in India: Price, Specs, Availability and Offers