Realme TV: అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే స్మార్ట్ టీవీ....


రియల్‌మి సంస్థ తన లీప్ టు నెక్స్ట్ వర్చువల్ లాంచ్ ఈవెంట్‌ ద్వారా మరొక నాలుగు కొత్త ప్రోడక్ట్ లను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా సంస్థ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్మార్ట్ టీవీను కూడా విడుదల చేసారు.

Advertisement

రూ.12,999 ధర వద్ద రియల్‌మి తన కొత్త స్మార్ట్ టీవీలను పరిచయం చేసింది. ఈ ఈవెంట్ లో సంస్థ విడుదల చేసిన మొట్టమొదటి రియల్‌మి టీవీలు మార్కెట్‌లోకి విడుదల కావడం మరొక గొప్ప విషయం. డిస్ప్లే, ఆడియో, కంటెంట్ మరియు స్మార్ట్ ఫీచర్ల వంటి నాలుగు ప్రధాన అంశాలపై అధిక దృష్టిని సారించి ఇండియాలో విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. రియల్‌మి టీవీలు రెండు వేరియంట్‌లలో విడుదల అయ్యాయి.

Rs.10,000 ధర లోపు ఆన్‌లైన్ సేల్స్ లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

 

Advertisement
టీవీ వేరియంట్‌

ఇందులో 32 అంగుళాల బేస్ వేరియంట్‌ మరియు 43 అంగుళాల డిస్‌ప్లే గల టాప్ వేరియంట్ ఉన్నాయి. రియల్‌మి టీవీలో దాని స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో గల క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ టెక్నాలజీను కలిగి ఉంటుంది. ఈ టీవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Amazon India లో ఉద్యోగ అవకాశం!!! 50,000 జాబ్స్...

రియల్‌మి టీవీల ధర

రియల్‌మి స్మార్ట్ టీవీలను రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 32 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌ యొక్క ధర రూ.12,999 ధర కాగా 43 అంగుళాల డిస్‌ప్లే గల టాప్ టైర్డ్ వేరియంట్ యొక్క ధర రూ.21,999. ఈ టీవీలను కొన్నవారికి సంస్థ యూట్యూబ్ ప్రీమియం ఆరు నెలల ట్రయల్‌ను ఉచితంగా అందిస్తున్నది. దీనితో పాటుగా దీనిని EMI ఆప్షన్ ద్వారా కూడా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అవకాశం కల్పిస్తోంది. అలాగే ఒక సంవత్సరం ప్రామాణిక వారంటీతో పాటు ప్యానెల్స్‌కు ఒక సంవత్సరం అదనపు వారంటీని కూడా సంస్థ అందిస్తుంది.

రియల్‌మి టీవీల లభ్యత

రియల్‌మి టీవీలను రియల్‌మి వెబ్‌సైట్‌లో మరియు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా జూన్ 2 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తోంది.

రియల్‌మి వర్చువల్ లాంచ్ కార్యక్రమం

సోమవారం జరిగిన వర్చువల్ లాంచ్ కార్యక్రమంలో 10,000 mAh సామర్థ్యం గల రియల్‌మిబడ్స్ ఎయిర్ నియో, రియల్‌మి వాచ్ మరియు రియల్‌మి పవర్ బ్యాంక్ 2 తో సహా ఇతర పరికరాలను కంపెనీ విడుదల చేసింది. రియల్‌మి బడ్స్ ఎయిర్ నియో ధర 2999 రూపాయలు. దీని యొక్క అమ్మకాలు మే 25 మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రియల్‌మి వాచ్ యొక్క ధర రూ.3999 కాగా దీని యొక్క అమ్మకాలు జూన్ 5 నుంచి ప్రారంభించనున్నాయి.

రియల్‌మి స్మార్ట్ టీవీ డిస్‌ప్లే

రియల్‌మి టీవీలో క్రోమా బూస్ట్ టెక్నాలజీ గల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 400 నిట్స్ డిస్ప్లే గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ ను ఉపయోగించినందున దీని యొక్క డిస్‌ప్లేలో ప్రకాశం, రంగు, స్పష్టత, కాంట్రాస్ట్ మరియు గ్రాఫిక్ స్వచ్ఛతతో మీకు ఇష్టమైన సినిమాలను సుప్రీం స్పష్టతతో చూడవచ్చు.

స్పెసిఫికేషన్స్

రియల్‌మి టీవీల్లో స్టాండర్డ్, Vivid, గేమ్, స్పోర్ట్, మూవీ, యూజర్, ఎనర్జీ సేవింగ్ తో సహా ఏడు రకాల డిస్ప్లే మోడ్‌లు కూడా ఉన్నాయి. రియల్‌మి టీవీలు 178 డిగ్రీల "సూపర్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్" ఫీచర్ ను కలిగివున్నాయి. అలాగే ఇది మీడియాటెక్ చిప్‌సెట్ ద్వారా 64 బిట్ క్వాడ్ కోర్ CPU మరియు మాలి -470 MP3 GPUలతో పనిచేస్తాయి. అలాగే ఇది 8GB ROM మరియు 1GB ర్యామ్ తో కూడా జతచేయబడి ఉన్నాయి.

డిజైన్

రియల్‌మి టీవీలలో రూ .50 వేలకు పైగా ధర గల టీవీలలో గల డిజైన్ "శక్తివంతమైన చిప్‌సెట్"లను కలిగి ఉండి ఇవి HDR10 మరియు HLG వీడియోలకు మద్దతును అందిస్తుంది. రియల్‌మి టీవీలు డాల్బీ ఆడియో మద్దతుతో 24W క్వాడ్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండడంతో పాటుగా రెండు ట్వీటర్లను ప్రతి వైపు ఒకరు "పూర్తి ఆడియో అనుభవాన్ని వినియోగించడానికి వీలుగా ఉన్నాయి.

ఫీచర్స్

రియల్‌మి స్మార్ట్ టీవీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్‌ వంటి ప్రముఖ వీడియో యాప్ ల మద్దతుతో పాటుగా ఇవి ఆండ్రాయిడ్ మద్దతుతో రన్ అవుతాయి. ఇంకా గూగుల్ ప్లే స్టోర్ నుండి 5000 కి పైగా అనువర్తనాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ మద్దతుతో ప్రారంభించబడినందున ఇది వినియోగదారులను వారి వాయిస్ ఉపయోగించి కంటెంట్‌ను కనుగొనటానికి మరియు శోధించడానికి అనుమతిస్తుంది. అదనంగా Chromecast కూడా అంతర్నిర్మితంగా ఉంది మరియు ఇది వినియోగదారులు తమ పరికరాల్లోని కంటెంట్‌ను స్మార్ట్ టీవీకి ప్రతిబింబించేలా చేస్తుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఎంపికల విషయానికొస్తే రియల్‌మి టీవీ బ్లూటూత్ 5.0 మరియు 2.4 GHz వైఫైకి మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. అలాగే ఇందులో మూడు హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి, ఒక AV మరియు ఒక డిజిటల్ ఆడియో అవుట్ పోర్ట్‌తో పాటు లాన్ పోర్టు కూడా ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ స్మార్ట్ రిమోట్‌లో గూగుల్ అసిస్టెంట్‌కు శీఘ్ర యాక్సిస్ తో పాటు నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలకు ప్రత్యక్ష యాక్సిస్ కూడా ఉంది.

Best Mobiles in India

English Summary

Realme Smart TV Launched India: Price, Specs, Availability and More