Jio, Airtel, Vodafone: లాక్డౌన్ లో మీకు ఉపయోగపడే అధిక డేటా ప్లాన్‌లు


దేశంలో మార్చి 14 నుండి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ప్రజలు ప్రస్తుతం తన సగటు మొత్తం కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్నారు. దీనికి కారణం లాక్డౌన్ కారణంగా కార్యాలయానికి వెళ్ళేవారు వారి ఇళ్ల నుండి పని చేయాల్సి రావడం. కొన్ని గణాంకాల ప్రకారం ఎక్కువ శాతం మంది ప్రజలు తమ అవసరాల కోసం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లకు బదులుగా వారి యొక్క మొబైల్ ఇంటర్నెట్ వాడకం అధికం అయింది.

Advertisement

దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ ఎంతవరకు ఉంటుందో అని ఎవరికీ తెలియదు. అందువల్ల చాలామంది ప్రజలు అధికంగా వారి అవసరాల కోసం ప్రీపెయిడ్ ప్లాన్‌లను వినియోగిస్తున్నారు. వినియోగదారులు మళ్లీ మళ్లీ తమ పరికరాలను రీఛార్జ్ చేయనవసరం లేకుండా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ వంటి ప్రధాన టెల్కోలు దీర్ఘకాలిక డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ టెల్కోస్ అందించే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రణాళికలలో ఒకటి 1.5GB రోజువారీ డేటా ప్లాన్. ప్రతి టెల్కో ఈ ఆఫర్‌లతో అందిస్తున్న ప్లాన్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. టెల్కోలు రోజుకు 2GB డేటాను అందిస్తున్న లాంగ్ టర్మ్ ప్లాన్లు

Advertisement
రిలయన్స్ జియో 1.5GB డైలీ డేటా ప్లాన్స్

ప్రీపెయిడ్ విభాగంలోని డేటా ప్లాన్‌లలో రిలయన్స్ జియో ఇప్పటికీ అత్యంత సరసమైన ధరలలో అందిస్తున్నది. jio యొక్క 1.5GB రోజువారీ డేటా ప్లాన్ లు రూ.199 నుండి ప్రారంభమయి రూ.1,199 వరకు ఉన్నాయి. రూ.199 ధర గల ప్రీపెయిడ్ ప్లాన్‌ వినియోగదారులకు రోజుకు 1.5GB డేటా, జియో టు జియో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1,000 నిమిషాల నాన్-జియో ఎఫ్‌యుపి మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజులు చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. Jio Rs.999 Plan: 3GB రోజువారి డేటా, కాంప్లిమెంటరీ ఉచిత సర్వీస్...

1.5GB డైలీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్

జియో యొక్క రూ.399 ప్లాన్ 1.5GB డైలీ డేటా, 56 రోజుల వాలిడిటీ కాలానికి మొత్తంగా 84 జీబీ డేటాను అందిస్తుంది. ఇది మొత్తం చెల్లుబాటు కాలానికి అపరిమిత జియో టు జియో వాయిస్ కాలింగ్, 2,000 నాన్-జియో ఎఫ్‌యుపి నిమిషాలు మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను అందిస్తుంది.

తదుపరిది వరుసలో రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5GB డేటా , 3,000 నాన్-జియో ఎఫ్‌యుపి నిమిషాలు, అపరిమిత జియో టు జియో వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 84 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఈ జాబితాలో చివరిది రూ.1,199 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 336 రోజుల చెల్లుబాటు కాలంలో మొత్తంగా 504GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అపరిమిత ఆన్-నెట్ కాలింగ్, 12,000 నాన్-జియో నిమిషాలు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు ఉన్నాయి. Airtel,Jio,BSNL,Vodafon వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఇదే...

 

భారతి ఎయిర్‌టెల్ 1.5GB డైలీ డేటా ప్లాన్లు

ఎయిర్‌టెల్ యొక్క 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌ల విషయానికి వస్తే అవి 249 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. ఎయిర్‌టెల్ సంస్థ రూ .249, రూ .279, రూ. 399, రూ .598 మరియు రూ .2,398 ధరల వద్ద 1.5GB డైలీ డేటా ప్లాన్లను అందిస్తున్నది. రూ.249 మరియు రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకే ఒక్క మార్పు ఉన్నప్పటికీ అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్‌లు రోజుకు 1.5GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తాయి. అలాగే ఇవి ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తాయి. రూ.279 ప్లాన్ అదనంగా రూ.4 లక్షల జీవిత బీమా ప్రయోజనంతో వస్తుంది. రూ.399, రూ.598, రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్లు రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS ప్రయోజనాలను వరుసగా 56, 84, 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నాయి.

వొడాఫోన్ ఐడియా 1.5GB డైలీ డేటా ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా సంస్థ ప్రస్తుతం ఎంచుకున్న సర్కిల్‌లలో తన 1.5GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లలో డబుల్ డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. వోడాఫోన్ ఐడియా యొక్క 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు రూ.249, రూ .399 మరియు రూ.599 ధరలను కలిగి ఉండి వరుసగా 28, 56 మరియు 84 రోజుల చెల్లుబాటు కాలానికి డబుల్ డేటా ఆఫర్ లో భాగంగా రోజుకు 3GB డేటాను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ మూడు ప్లాన్‌ల యొక్క ఇతర ప్రయోజనాలలో ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు మొత్తం చెల్లుబాటు కాలానికి రోజుకు 100SMS ప్రయోజనాలు ఉన్నాయి.

వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా యొక్క వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2,399 ధరను కలిగి ఉండి ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అదనంగా టెల్కోలో ఎంపిక చేసిన సర్కిల్‌లలో రూ.499 మరియు రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఇవి వరుసగా 70 మరియు 77 రోజుల చెల్లుబాటు కాలంతో అన్ని రకాల ప్రయోజనాలతో అందించబడతాయి.

Best Mobiles in India

English Summary

Reliance Jio, Airtel, Vodafone offers 1.5GB Daily Data Plans