Airtel,Jio,BSNL,Vodafon వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఇదే...

|

ఇండియాలోని టెలికామ్ సంస్థలలో ప్రధానంగా ఉన్న జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థలు తన వినియోగదారులకు వివిధ రకాల ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. చాలా మంది వినియోగదారులు ప్రతి నెల రీఛార్జ్ చేయడాన్ని ఇష్టపడరు.

 

ప్రీపెయిడ్ ప్లాన్

అటువంటి వారు అధికంగా దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్ లను అధికంగా ఎంచుకుంటూ ఉంటారు. ఇటువంటి ప్లాన్ లను ఎంచుకోవడానికి గల కారణం ప్లాన్ యొక్క అధిక ప్రయోజనాలు మరియు ప్లాన్ యొక్క గడువు ముగియడం గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోవడం. అందుకే వార్షిక ప్లాన్ లను ఎంచుకోవడం ఉత్తమమైనది. అలాగే ఇవి నెల వారి ప్లాన్ లతో పోలిస్తే దీర్ఘకాలిక ప్లాన్ చౌకగా ఉంటాయి.

టెల్కోలు

టెల్కోలు

ఎయిర్‌టెల్, జియో, బిఎస్‌ఎన్‌ఎల్ మరియు వొడాఫోన్ టెల్కోలు తమ చందాదారులకు ఏడాది పొడవునా ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. టెల్కోలు అందిస్తున్న ఈ ఆఫర్‌ యొక్క ప్రయోజనాలలో ఏది ఉత్తమంగా ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్
 

ఎయిర్‌టెల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ వారి వెబ్‌సైట్‌లో పేర్కొన్న ధర అన్ని పన్నులను కలిపి రూ.2,398 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసిన తేదీ నుండి 365 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఏడాది పొడవునా అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు రోజువారీ 1.5GB డేటా ప్రయోజనం లభిస్తుంది. ఇది ప్రతి రోజు అర్ధరాత్రి రీసెట్ అవుతుంది. అలాగే రోజుకు 100 SMS లను ఉచితంగా పంపడానికి కూడా అనుమతించబడతారు.

ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాలు

ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాలు

ఈ ప్లాన్ అందిస్తున్న ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇందులో ZEE5, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం మరియు వింక్ మ్యూజిక్ యొక్క ఉచిత సబ్స్క్రిప్షన్ ఉన్నాయి. వీటితో పాటుగా మీరు మీ ఫోన్ కోసం ఉచిత యాంటీ-వైరస్ను కూడా పొందుతారు. వీటితో పాటుగా మీరు హలోటూన్‌లను కూడా ఉచితంగా పొందుతారు. తద్వారా మీకు కావలసినప్పుడు మీ కాలర్ ట్యూన్‌ను మార్చవచ్చు. షా అకాడమీ నుండి ఉచిత ఆన్‌లైన్ క్లాసులు ఉన్నాయి మరియు ఫాస్ట్‌ట్యాగ్‌లో 150 రూపాయల క్యాష్-బ్యాక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

బీఎస్‌ఎన్‌ఎల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్ సంస్థ తన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.1,999 ధర వద్ద పొందుతారు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసిన రోజు నుండి 365 రోజుల వరకు చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజాలను అందిస్తుంది. కానీ ఈ అపరిమిత కాలింగ్ ప్రయోజనం రోజుకు 250 నిమిషాల పరిమితితో మాత్రమే వస్తుంది.

ప్లాన్‌

ఈ ప్లాన్‌తో లభించే డేటా విషయానికి వస్తే ఇది 3GB రోజువారీ డేటా ప్రయోజనంను అందిస్తుంది. దానితో పాటు మీకు రోజుకు 100SMS ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలలో 365 రోజుల బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ మరియు లోక్ధన్ ఆన్‌లైన్ వీడియోలకు ఉచిత యాక్సిస్. అలాగే మీకు 60 రోజుల వరకు EROS NOW ఎంటర్టైన్మెంట్ సేవను ఉచితంగా అందిస్తుంది.

వోడాఫోన్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ నుండి లభించే ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2,399 ధర వద్ద లభిస్తుంది. ఇది రీఛార్జ్ చేసిన తేదీ నుండి 365 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దానితో పాటు మీరు ప్రతిరోజూ 1.5GB డేటా ప్రయోజనంను కూడా పొందుతారు. ఇది అర్ధరాత్రి రీసెట్ అవుతుంది. ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది మీకు 499 రూపాయల విలువ గల వోడాఫోన్ ప్లే మరియు 999 రూపాయల విలువైన ZEE5 చందాను ఉచితంగా అందిస్తుంది.

జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

జియో సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన తన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ధర రూ.2,399. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసిన తేదీ నుండి మొత్తంగా 365 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఈ ప్లాన్ తన మొత్తం చెల్లుబాటు కాలంలో మొత్తంగా 730GB డేటాను అందిస్తుంది. అంటే ఇది ప్రతి రోజు మీకు 2GB డేటాను అధిక వేగంతో అందిస్తుంది. దానితో పాటు మీరు జియో-టు-జియో లకు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు జియో-టు-నాన్ జియో కోసం 12,000 నిమిషాల వాయిస్ కాల్స్ ప్రయోజనం లభిస్తాయి. ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అన్ని జియో యాప్ లకు ఉచిత సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి.

తీర్పు

తీర్పు

టెల్కోలు అందిస్తున్న వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకదానితో మరొక దానిని పోలిస్తే ఎయిర్‌టెల్ గరిష్ట ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనంను అందిస్తుంది. కానీ అదే సమయంలో జియో ఎయిర్‌టెల్ నుండి రూపాయి తేడాతో ఎక్కువ డేటాను అందిస్తుంది. వొడాఫోన్ మరియు ఎయిర్‌టెల్ యొక్క ప్రణాళికలు దాదాపు సమానంగా ఉంటాయి తప్ప వొడాఫోన్‌లో తక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చౌకైన ప్లాన్ బిఎస్ఎన్ఎల్ నుండి వచ్చింది మరియు ఇది రోజువారీ 3GB డేటాను ఎక్కువ మొత్తంలో అందిస్తుంది. అయితే ఇది ఒక రోజులో 250 నిమిషాల పరిమితితో అపరిమిత కాలింగ్ ప్రయోజాలను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Vs Jio Vs BSNL Vs Vodafon Annual PrepaidPlans: Who is The Best

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X