Reliance Jio: లాక్ డౌన్ లో జియోలో ఉపయోగకరమైన ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే...


ఇండియాలోని టెలికామ్ రంగంలో అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ అయిన రిలయన్స్ జియో మొదట ప్రవేశపెట్టిన రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసింది. కానీ 2019 డిసెంబర్‌లో టారిఫ్ పెంపు తర్వాత దీనిని తిరిగి 28 రోజుల వాలిడిటీతో అత్యంత సరసమైన మరియు అతి తక్కువ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్‌గా మరొక ప్లాన్ ను ప్రవేశపెట్టబడింది.

Advertisement

జియో ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అధికారిక వెబ్‌సైట్ మరియు జియో యొక్క మొబైల్ యాప్ మరియు మూడవ పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించబడింది. బడ్జెట్‌లో ప్రత్యేక SMS ప్రయోజనాలు మరియు హై-స్పీడ్ డేటాను అందించడానికి రిలయన్స్ జియో ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. రిలయన్స్ జియో సంస్థ ఈ ప్లాన్ తో ఉచిత జియో-టు-జియో కాల్స్‌, 2GB హై-స్పీడ్ డేటాతో పాటు 300 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల చెల్లుబాటుతో అందించింది. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులు ల్యాండ్‌లైన్ కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందుతున్నారు. కాని ఈ ప్లాన్ జియోయేతర FUP నిమిషాలను అందించలేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Advertisement
రిలయన్స్ జియో రూ 129 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రిలయన్స్ జియో పూర్తిగా నిలిపివేసినందున దానికి బదులుగా వినియోగదారులకు చౌకైన ధరలు రూ.129 వద్ద ప్రీపెయిడ్ ప్లాన్ ను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. రిలయన్స్ జియో యొక్క రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్ 2GB 4జి డేటాతో పాటు రూ.98 ప్యాక్ అందిస్తున్న ఉచిత జియో-టు-జియో కాల్స్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులకు 1,000 నిమిషాల నాన్-జియో కాల్స్ ప్రయోజనాలను అదనంగా కూడా అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్ యొక్క మొత్తం చెల్లుబాటు కాలంలో వినియోగదారులకు జియో యొక్క అన్ని యాప్ లకు ఉచిత కాంప్లిమెంటరీ చందాను అందిస్తుంది.  Airtel, Vodafone, Jio: 3GB డేటాతో పాటు అధిక ప్రయోజాలను ఇస్తున్న టెల్కో ఇదే...

రిలయన్స్ జియో రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో యొక్క రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందించే ప్లాన్ లలో ఒకటి. ఈ ఆఫర్ కింద వినియోగదారులు రోజుకు 3GB హై-స్పీడ్ డేటా మరియు అపరిమిత Jio-to-Jio కాల్స్ ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ జియో యొక్క అన్ని రకాల యాప్ లకు కాంప్లిమెంటరీ చందాలను ఉచితంగా అందించడమే కాకుండా రోజుకు 100 SMS లను మరియు 1,000 నిమిషాల నాన్-జియో కాల్‌ల ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తుంది. Motorola Moto G8 Power Lite: Rs.8,999 ధరకే మోటరోలా కొత్త ఫోన్!!! ఫీచర్స్ అదుర్స్...

రిలయన్స్ జియో రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రూ.999 ధర వద్ద కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది రోజుకు 3GB హై-స్పీడ్ డేటాను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. FUP డేటా పరిమితి ముగిసిన తర్వాత 64 kbps వేగంతో వినియోగదారులకు అపరిమిత ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. కాలింగ్ ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత జియో-టు-జియో కాలింగ్ మరియు జియోయేతర కాల్స్ కోసం 3,000 నిమిషాల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే అదనపు ప్రయోజనాలలో వినియోగదారులు JioCinema మరియు JioTV వంటి Jio యాప్ల యొక్క కాంప్లిమెంటరీ చందాను ఉచితంగా పొందుతారు. రిలయన్స్ జియో 84 రోజుల చెల్లుబాటు కాలానికి రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌తో పాటు రూ.555, రూ.599 అనే రెండు వేర్వేరు ప్లాన్‌లను కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో వర్క్ @ హోమ్ ప్లాన్ లు

రిలయన్స్ జియో సంస్థ ‘జియో డేటా ప్యాక్' ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో అదే ప్యాక్ వినియోగదారుల అకౌంటులకు జమ చేసింది. రిలయన్స్ జియో చందాదారులకు ఉచిత డేటాను అందించడానికి కారణం ఇంటి వద్ద నుండి పని చేస్తున్న వారిని ప్రోత్సహించడం మరియు ఈ కఠినమైన కాలంలో వినియోగదారులను కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేయడం. ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండవచ్చు మే 3 వరకు భారతదేశం పూర్తి లాక్డౌన్లో ఉంది. దేశంలో కరోనావైరస్ సానుకూల కేసులు ఇప్పటికి వేగంగా పెరుగుతూనే ఉన్నాయి.కావున ఇండియాలో లాక్ డౌన్ మళ్ళి పెరిగే అవకాశాలు ఉన్నాయి. టెల్కో ఇప్పటికే జియోఫోన్ వినియోగదారులకు ఉచిత ప్రయోజనాలను అందిస్తోంది. ఇది అన్ని JioFiber ప్లాన్‌లపై డబుల్ డేటాను షిప్పింగ్ చేయడంతో పాటు అదనపు ఖర్చు లేకుండా 10 Mbps JioFiber ప్లాన్‌ను అందించడం ప్రారంభించింది.

రిలయన్స్ జియో డేటా యాడ్-ఆన్ ప్లాన్స్

కరోనావైరస్ ను ఎదురుకోవడానికి భారతదేశం మొత్తం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో తన 4G డేటా వోచర్లలో డబుల్ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. జియో సంస్థ అందిస్తున్న రూ.251 డేటా వోచర్ రోజుకు 2GB డేటా ప్రయోజనంను 51 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అదనపు డేటాతో పాటు అదనపు నాన్-జియో వాయిస్ కాలింగ్ నిమిషాల అవసరం ఉన్నవారికి జియో యొక్క రూ.11 బేస్ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది 800MB డేటా మరియు 75 నిమిషాల నాన్ జియో కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది.

Best Mobiles in India

English Summary

Reliance Jio Minimum Prepaid Recharge Plans Details in Telugu