Airtel, Vodafone, Jio: 3GB డేటాతో పాటు అధిక ప్రయోజాలను ఇస్తున్న టెల్కో ఇదే...
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తాన్ని లాక్డౌన్ గా ప్రకటించడంతో ప్రజలు అందరు వారి వారి ఇళ్లకు పరిమితమై ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారు. అన్ని రకాల సంస్థలు కొద్దిగా నష్టాలను చవిచూసినప్పటికీ ఒక్క టెలికామ్ సంస్థలు మాత్రం కొద్దిగా మెరుగుపడ్డాయి. దీనికి గల కారణం ఇంటి వద్ద నుండి పనిచేసే వారు తాను ఇంతుకుముందు వాడుతున్న డేటా కంటే ప్రస్తుతం అధిక డేటాను వాడటమే.

ఇంతుకుముందు రోజుకు 1GB మొబైల్ డేటాను వినియోగించే వ్యక్తి ఇప్పుడు తన ఆఫీసు వర్క్ చేయడానికి 3GB మొబైల్ డేటాను వినియోగిస్తున్నారు. గణాంకాల ప్రకారం ఇంటి నుండి పనిచేసే చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ మరియు సెల్యులార్ డేటాతో ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రజలు తమ ఉద్యోగాల పనిని పూర్తి చేయడానికే కాకుండా తమ రోజువారీ అవసరాలకు అధిక డేటా అవసరం ఎంతగానో ఉంది.

ఇందులో ముఖ్యంగా స్ట్రీమింగ్ మరియు డౌన్‌లోడ్ అభ్యర్థనలకు అధిక డేటా అవసరం ఉంటుంది. డేటా కోసం డిమాండ్ పెరగడంతో వివిధ టెల్కోలు ఒకరికి పోటీగా మరొకరు ప్రతిరోజూ 3GB డేటాను తమ డేటా ప్లాన్‌లతో అందిస్తున్నారు. 3GB రోజువారీ డేటా ప్లాన్‌లతో టెల్కోలు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తున్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో 3 జిబి డైలీ డేటా ప్లాన్స్
రిలయన్స్ జియో ప్రస్తుతం 3GB రోజువారీ డేటాను రెండు ప్లాన్‌లతో అందిస్తోంది. అంతకుముందు టెల్కో 3GB రోజువారీ డేటాను 28 రోజుల చెల్లుబాటుతో గల ఒకే ఒక ప్లాన్ తో రూ.349 ధర వద్ద ప్రవేశపెట్టింది. ఇది జియో-టు-జియో అపరిమిత కాల్స్ మరియు జియో-టు-నాన్ జియో కాల్స్ కోసం 1,000 ఐయుసి నిమిషాలతో పాటుగా రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే దీనితో అన్ని జియో యాప్ లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తాయి.

జియో రూ.999 ప్లాన్
ఇప్పుడు టెల్కో 3GB రోజువారీ డేటాను మరొక కొత్త ప్లాన్‌తో కూడా అందిస్తోంది. అయితే ఇది ఎక్కువ వాలిడిటీ కాలంతో సుమారు 84 రోజుల చెల్లుబాటు కాలంతో రూ.999 ధర వద్ద ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది జియో-టు-జియో అపరిమిత కాలింగ్ మరియు జియో-టు-నాన్ జియో కాల్స్ కోసం 3,000 ఐయుసి నిమిషాలు మరియు రోజుకు 100SMS ప్రయోజనాలు కూడా అందిస్తాయి. మీరు ప్లాన్‌తో మొత్తం చెల్లుబాటు కాలంలో మొత్తంగా 252GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్ని రకాల జియో యాప్ లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.

వొడాఫోన్ ఐడియా 3GB డైలీ డేటా ప్లాన్స్
వోడాఫోన్ 3GB రోజువారీ డేటా ప్లాన్‌లను వివిధ రకాల ఆఫర్ల వద్ద అందిస్తోంది. టెల్కో ప్రస్తుతం అందిస్తున్న డబుల్ డేటా ఆఫర్ కింద కూడా 3GB రోజువారీ డేటాను అందిస్తున్నాయి. రూ.599 ధర గల ప్లాన్ 1.5GB రోజువారీ డేటాను మాత్రమే ముందు అందించేది. కానీ డబుల్ డేటా ఆఫర్లో భాగంగా ఇది ఇప్పుడు రెట్టింపు డేటాను 84 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తున్నది. ఈ ప్లాన్ వోడాఫోన్ ప్లే మరియు ZEE5 లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. డబుల్ డేటాను అందిస్తున్న మరొక ప్లాన్ యొక్క ధర రూ.399. ఇది 3GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇది కూడా వోడాఫోన్ ప్లే మరియు ZEE5 లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఈ రెండు ఆఫర్లు ఎంచుకున్న టెలికాం సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

భారతదేశం అంతటా అందుబాటులో గల ప్రణాళికలు
భారతదేశం అంతటా అందుబాటులో గల రోజువారీ 3GB డేటాను అందించే మరో రెండు ప్రణాళికలు ఉన్నాయి. ఇందులో ఒక ప్లాన్ రూ.588 ధరను కలిగి ఉండి ఇది రోజుకు 100SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజుకు 3GB డేటాను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది వోడాఫోన్ ప్లే మరియు ZEE5 ప్రీమియం ప్రయోజనాలను అదనంగా కూడా అందిస్తుంది. ఇందులో మరో ప్లాన్ 398 రూపాయల ధరను కలిగి ఉండి కేవలం 28 రోజుల వాలిడిటీ కాలానికి మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 3GB రోజువారీ డేటా, రోజుకు 100SMS ప్రయోజాలతో పాటుగా వోడాఫోన్ ప్లే మరియు Zee5 లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

భారతి ఎయిర్‌టెల్ 3GB డైలీ డేటా ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ రోజువారీ 3 జిబి ఇంటర్నెట్‌ను రెండు ప్లాన్‌లతో అందిస్తోంది. ఇందులో 28 రోజుల చెల్లుబాటుతో 401 రూపాయల ధర వద్ద ప్లాన్ అన్నిటికంటే ఉత్తమమైంది. దీనికి తక్కువ వాలిడిటీ ఉన్నప్పటికీ మీరు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాను కూడా అదనపు ప్రయోజనాలలో పొందుతారు. ఇది అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100SMS సౌకర్యం కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.558 ప్లాన్
టెల్కో రూ.558 ధర గల ఇతర ప్లాన్ కూడా రోజువారీ 3GB ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ విఐపిని అందించనప్పటికీ ZEE5 ప్రీమియం మరియు ఉచిత యాంటీ-వైరస్ వంటి ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 56 రోజులు.


Click it and Unblock the Notifications








