Home
Apps

Samsung గెలాక్సీ ఫోన్‌లో Always On డిస్‌ప్లేను నచ్చినట్టు మార్చుకోవాలా.. సులభమైన పద్ధతులు మీకోసం..

Samsung Galaxy Always-On Display: శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలోని ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (AOD) ఫీచర్ చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది. ఫోన్ లాక్ చేసి ఉన్నా సరే, సమయం, నోటిఫికేషన్లు వంటి ముఖ్యమైన సమాచారాన్ని స్క్రీన్‌పై ఎప్పుడూ చూస్తూ ఉండొచ్చు. అయితే, శాంసంగ్ కొత్తగా తీసుకొచ్చిన One UI అప్‌డేట్‌లతో AOD కస్టమైజేషన్ ఆప్షన్లు మారిపోయాయి.

చాలా మంది యూజర్లకు ఈ సెట్టింగ్స్‌ ఎక్కడ ఉన్నాయో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. మీరూ అలాంటి వారిలో ఒకరైతే, కంగారు పడకండి. AOD సెట్టింగ్స్‌ను ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను చెప్పబోయే పద్ధతులు చాలా సులువుగా ఉంటాయి కాబట్టి, కచ్చితంగా వాటిల్లో కనీసం ఒక్కటైనా ప్రయత్నించండి.

Customize Your Samsung Galaxy Always-On Display  One UI 7 0 Guide

గతంలో శాంసంగ్ ఫోన్లలో, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేను లాక్ స్క్రీన్ నుండి విడిగా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉండేది. క్లాక్ స్టైల్ మార్చుకోవడం, నచ్చిన బొమ్మలు పెట్టుకోవడం, లేఅవుట్ సెట్ చేసుకోవడం వంటి ఎన్నో ఆప్షన్లు ఉండేవి. కానీ, One UI 6.1 అప్‌డేట్ తర్వాత సీన్ మారిపోయింది. AODని లాక్ స్క్రీన్‌తో కలిపేసింది శాంసంగ్. దీంతో చాలా కస్టమైజేషన్ ఆప్షన్లు మాయమయ్యాయి.

Customize Your Samsung Galaxy Always-On Display  One UI 7 0 Guide

ఇప్పుడు మీరు సెట్టింగ్స్ > లాక్ స్క్రీన్ అండ్ AOD > ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేకి వెళ్తే, క్లాక్ స్టైల్, ఇమేజ్ కస్టమైజేషన్ ఆప్షన్లు కనిపించవు. ఆపిల్‌ ఐఫోన్లలో ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఎలా ఉంటుందో, శాంసంగ్ కూడా ఇప్పుడు అలాగే చేసింది. లాక్ స్క్రీన్‌పై డిజైన్ చేసినట్టే AOD కూడా కనిపిస్తుంది.

మిగిలిన సెట్టింగ్స్‌లో "షో లాక్ స్క్రీన్ వాల్‌పేపర్" అనే ఆప్షన్ ఉంటుంది. ఇది AOD కోసం వాల్‌పేపర్‌ను కొంచెం మసకగా చేస్తుంది. ఇక "నౌ బార్" అనే ఫీచర్ ద్వారా ఇంటరాక్టివ్ విడ్జెట్లను AODకి యాడ్ చేసుకోవచ్చు. కొత్తగా "ఆటో" మోడ్ కూడా వచ్చింది. ఈ మోడ్ ఫోన్ బోర్లా పడినప్పుడు లేదా 5 నిమిషాల పాటు కదలకుండా ఉంటే AODని ఆటోమేటిక్‌గా ఆఫ్ చేస్తుంది.

* One UI 7.0లో AODని కస్టమైజ్ చేయడం ఎలా?

వన్ UI 7.0లో కూడా AOD కస్టమైజేషన్ ఆప్షన్లు చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ, సెట్టింగ్స్‌ మాత్రం లాక్ స్క్రీన్‌తో ముడిపడి ఉన్నాయి. వాటిని మార్చాలంటే, సెట్టింగ్స్ > లాక్ స్క్రీన్ అండ్ AODకి వెళ్లండి. అక్కడ "టచ్ అండ్ హోల్డ్ టు ఎడిట్ " అనే ఆప్షన్ ఆన్‌లో ఉందో లేదో చూసుకోండి. అది ఆన్‌లో ఉంటేనే కస్టమైజేషన్ సాధ్యమవుతుంది.

Customize Your Samsung Galaxy Always-On Display  One UI 7 0 Guide

* క్లాక్‌ని కస్టమైజ్ చేయాలంటే,

లాక్ స్క్రీన్‌పై వేలితో నొక్కి పట్టుకోవాలి. ఎడిట్ మోడ్ ఓపెన్ అవుతుంది. క్లాక్‌ని సెలెక్ట్ చేసుకుని, పాస్‌కోడ్ అడిగితే ఎంటర్ చేయండి. ఇప్పుడు క్లాక్‌ని స్క్రీన్‌పై ఎక్కడ కావాలంటే అక్కడకు డ్రాగ్ చేసుకోవచ్చు, సైజు మార్చొచ్చు, కింద కనిపించే మెనూ నుంచి ఫాంట్, కలర్, స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వాల్‌పేపర్ బ్రైట్‌నెస్‌ను బట్టి క్లాక్ కలర్ ఆటోమేటిక్‌గా మారుతుంది.

Take a Poll

డిజిటల్, అనలాగ్, క్యాలెండర్ స్టైల్స్‌తో కలిపి మొత్తం 10 రకాల క్లాక్ స్టైల్స్‌ని మీరు ఎంచుకోవచ్చు. డిజిటల్ క్లాక్ సెలెక్ట్ చేసుకుంటే, ఫాంట్ ఎంత లావుగా ఉండాలో కూడా మార్చుకోవచ్చు. "షో వెదర్ ఇన్ఫర్మేషన్", "షో డేట్ అబౌవ్‌ క్లాక్" అనే ఆప్షన్లు పెట్టుకుంటే, AOD డిస్‌ప్లేలో వెదర్, డేట్ కూడా కనిపిస్తాయి.

Customize Your Samsung Galaxy Always-On Display  One UI 7 0 Guide

ఇంకాస్త కిందకి వస్తే, విడ్జెట్లు పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. బ్యాటరీ స్టేటస్, "శాంసంగ్ హెల్త్ డేటా" వంటి విడ్జెట్లను క్లాక్ కింద పెట్టుకోవచ్చు. ఇవి AODలో కూడా కనిపిస్తాయి. వీటివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. చాలా సమయం ఆదా అవుతుంది.

* AOD బ్రైట్‌నెస్‌ని సర్దుబాటు చేయడమెలా

AOD బ్రైట్‌నెస్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. చుట్టుపక్కల వెలుతురు ఎక్కువగా ఉంటే బ్రైట్‌నెస్‌ పెరుగుతుంది, తక్కువగా ఉంటే తగ్గుతుంది. మీరు అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఆఫ్ చేసినా సరే, AOD బ్రైట్‌నెస్ మాత్రం ఆటోమేటిక్‌గానే మారుతుంది. వెలుతురు ఎలా ఉన్నా, AOD స్పష్టంగా కనిపించేలా శాంసంగ్ ఈ ఫీచర్‌ని రూపొందించింది.

వన్ UI 7.0లో AOD కస్టమైజేషన్ ఆప్షన్లు మునుపటిలా లేకపోయినా, కొన్ని మార్పులు చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ కస్టమైజేషన్ కావాలంటే, థర్డ్-పార్టీ యాప్స్ వాడాల్సిందే.

* మరిన్ని టిప్స్

- గెస్చర్ నావిగేషన్‌కు మారండి

ఆండ్రాయిడ్ ఫోన్లు కొన్ని ఏళ్ల క్రితమే "గెస్చర్ నావిగేషన్‌" అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చాయి. దీనితో స్క్రీన్‌పై వేలితో స్వైప్ చేస్తూ యాప్స్ మధ్య మారడం, వెనక్కి వెళ్లడం లాంటివి చేయొచ్చు. అయితే శాంసంగ్ ఫోన్లలో మాత్రం ఇప్పటికీ మూడు బటన్ల నావిగేషన్ పద్ధతే డిఫాల్ట్‌గా ఉంటుంది.

ఒకవేళ మీకు గెస్చర్ నావిగేషన్‌ కావాలంటే, దాన్ని ఎలా ఆన్ చేసుకోవాలో చూడండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లండి > డిస్‌ప్లే > నావిగేషన్ బార్‌లోకి వెళ్లి, 'స్వైప్ గెస్చర్స్‌’ ఎంచుకోండి. వెనక్కి వెళ్లడానికి వాడే జెస్చర్ సెన్సిటివిటీని మార్చుకోవడానికి 'మోర్ ఆప్షన్స్’లో చూడొచ్చు. కొన్ని శాంసంగ్ ఫోన్లలో గూగుల్ 'సర్కిల్ టు సెర్చ్’ ఫీచర్ కూడా ఉంటుంది.

దాన్ని కూడా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. సర్కిల్ టు సెర్చ్ కోసం హోమ్ బటన్ (లేదా గెస్చర్ నావిగేషన్ వాడుతుంటే కింద ఉండే గీత లాంటి బార్) నొక్కి పట్టుకుని, స్క్రీన్ మీద వృత్తం గీస్తే, గూగుల్ సెర్చ్ మొదలవుతుంది. ఫోన్ స్పీకర్లలో వినిపిస్తున్న పాటలు, మాటలు ఆధారంగా కూడా ఇది సెర్చ్ చేయగలదు.

* పవర్ బటన్ పనితీరు మార్చవచ్చు

పవర్ బటన్ నొక్కి పట్టుకుంటే ఫోన్ నేరుగా పవర్ మెనూకు వెళ్తే ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదా రీస్టార్ట్ చేయొచ్చు. కానీ మీ గెలాక్సీ ఫోన్‌ను బట్టి, అది డిఫాల్ట్‌గా శాంసంగ్ Bixby అసిస్టెంట్‌కు లేదా Google Gemini అసిస్టెంట్‌కు సెట్ అయి ఉండొచ్చు.

పాత పద్ధతిలో పవర్ సెట్టింగ్స్ కావాలంటే, సెట్టింగ్స్‌లోకి వెళ్లండి > అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ > సైడ్ బటన్‌కు వెళ్లండి. అక్కడ 'ప్రెస్ అండ్ హోల్డ్ ’ ఆప్షన్ కోసం 'పవర్ ఆఫ్ మెనూ ’ను ఎంచుకోండి. ఇక్కడే, డబుల్ ప్రెస్ చేస్తే కెమెరా ఓపెన్ అయ్యే ఆప్షన్‌ను కూడా మార్చుకోవచ్చు. అది డిఫాల్ట్‌గా కెమెరాకే ఉంటుంది.

ఒకవేళ Gemini లాంటి వాయిస్ అసిస్టెంట్ కోసం బటన్ యాక్సెస్ వదులుకోవద్దు అనుకుంటే, ఫోన్‌ను డిఫాల్ట్ పద్ధతిలో ఎలా పవర్ ఆఫ్ చేయాలో చూడండి. ఫోన్ పైభాగం కుడివైపు నుంచి కిందికి స్వైప్ చేస్తే క్విక్ సెట్టింగ్స్ మెనూ వస్తుంది. అక్కడ పవర్ బటన్ (కుడివైపు పైన మధ్యలో గుండ్రంగా ఉంటుంది) నొక్కండి. అది మిమ్మల్ని రీస్టార్ట్ లేదా పవర్ ఆఫ్ చేసే ఆప్షన్స్‌కు తీసుకెళ్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Learn how to customize the Always-on Display on Samsung Galaxy phones with One UI 7.0. Explore AOD settings, clock styles, widgets, brightness controls, and hidden features for better personalization.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X