వచ్చేస్తున్న శామ్‌సంగ్ S25 ఎడ్జ్.. ధరకు తగ్గటే అదిరిపోయే ఫీచర్స్!
Samsung Galaxy S25 Edge: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ టెక్ దిగ్గజం గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. సౌత్ కొరియా నుంచి వస్తున్న వార్తల ప్రకారం, ఈ ఫోన్ 2025, ఏప్రిల్ 16న ఆన్‌లైన్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. టైమ్ జోన్ల గొడవ వల్ల కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 15నే ఈ ఈవెంట్ కనువిందు చేయనుంది. మరి ఈ మొబైల్ ధర, ఫీచర్లు గురించి తెలుసుకుందాం.
* అత్యంత స్లిమ్ ఫోన్ ఇదే..
ఈ S25 Edge గురించి జనవరిలో జరిగిన శామ్‌సంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కాస్త హింట్ ఇచ్చారు కానీ పూర్తి డీటెయిల్స్ అప్పుడు లీక్ చేయలేదు. కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే, ఇది శామ్‌సంగ్ ఇప్పటివరకు తయారుచేసిన ఫోన్లలోనే సన్నటి ఫోన్ అంట. కేవలం 5.84mm మందం, 162 గ్రాముల కంటే తక్కువ బరువుతో రానుందట.

దీంతో ఇది యాపిల్ కంపెనీ రాబోయే ఐఫోన్ 17 ఎయిర్‌కి పోటీ ఇవ్వనుంది. సెప్టెంబర్‌లో లాంచ్ కానున్న ఐఫోన్ 17 ఎయిర్ కూడా చాలా సన్నగా ఉంటుందని టాక్. అయితే యాపిల్ ఒకే కెమెరాతో వస్తుంటే, S25 ఎడ్జ్ మాత్రం డ్యూయల్ కెమెరా సెటప్‌తో దుమ్ము రేపనుంది.
* ధరెంత.. లాంచ్ ఎప్పుడు..
గెలాక్సీ S25 ఎడ్జ్ 2025, ఏప్రిల్ లేదంటే కచ్చితంగా మేలో మార్కెట్‌లోకి రానుందని సమాచారం. లైట్ బ్లూ, బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో ఇది లభ్యం కానుంది. కానీ ఈ ఫోన్లు కేవలం 40,000 యూనిట్లు మాత్రమే ప్రొడక్షన్ చేస్తున్నారట. శామ్‌సంగ్ లాంటి పెద్ద కంపెనీకి ఇది చాలా తక్కువ సంఖ్య అనే చెప్పాలి.
ధర విషయానికొస్తే, ఇండియాలో దాదాపు రూ.1,10,000, USAలో 1,109 డాలర్లు, దుబాయ్‌లో 4,100 దిర్హామ్‌లు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ధర చాలా ఎక్కువే. మధ్యతరగతి ప్రజలకు దీని కొనడం కష్టమే. స్లిమ్ ఫోన్ కావాలనుకునే ధనవంతుల కోసమే దీన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.
* డిజైన్ & బిల్డ్ క్వాలిటీ
ఈ ఫోన్ డిజైన్ గురించి వింటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. శామ్‌సంగ్ గ్లాస్ లేదా ప్లాస్టిక్ కాకుండా, తేలికైన అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు సిరామిక్ బ్యాక్ ప్యానెల్‌ను వాడబోతోందట. సిరామిక్ గీతలు పడకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది కానీ ఒక్కోసారి పెళుసుగా కూడా మారొచ్చు.
అందుకే బరువు, స్ట్రాంగ్‌నెస్ రెండూ బ్యాలెన్స్ చేయడానికి, శామ్‌సంగ్ కొత్తగా హైబ్రిడ్ మెటీరియల్‌ని వాడొచ్చు. బహుశా సిరామిక్ కలిపిన గ్లాస్‌ని ఉపయోగించే ఛాన్స్ ఉంది. శామ్‌సంగ్ కంపెనీ దీన్ని S15 సిరీస్ ఫోన్ల విడుదల సమయంలోనే చూపించింది. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.
* స్పెసిఫికేషన్లు & పర్ఫార్మెన్స్
గెలాక్సీ S25 ఎడ్జ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. దానితో పాటు 12GB RAM ఉండనే ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో, శామ్‌సంగ్ One UI 7తో ఇది పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ S25 అల్ట్రా మొబైల్‌లో కూడా ఇచ్చారు. అంటే ఆ రేంజ్ పర్ఫామెన్స్ దీనిలో కూడా ఆశించవచ్చు.
కెమెరా సెటప్ చూస్తే ఇందులో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఆఫర్ చేశారు. సెల్ఫీ కెమెరా గురించిన వివరాలు ఇప్పటివరకు బయటకి రాలేదు. బ్యాక్‌సైడ్ కెమెరాల గురించి చెబుతున్నా, ఆ వివరాలు కూడా ఇంకా కన్ఫామ్ కాలేదు. కెమెరాల విషయంలో శామ్‌సంగ్ రాజీ పడే అవకాశం లేదని చెప్పుకోవచ్చు.
* బ్యాటరీ, సమస్యలు
ఈ ఫోన్‌లో 3,900mAh బ్యాటరీ ఉండొచ్చని అంచనా. ఫోన్ మరీ సన్నగా ఉండటం వల్ల, బ్యాటరీ లైఫ్ కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. అంతేకాదు, ఫోన్ సన్నగా ఉండటం వల్ల వేడిని కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుందేమో చూడాలి.
మొత్తానికి గెలాక్సీ S25 ఎడ్జ్ అదిరిపోయే ఫీచర్లతో, స్లిమ్ డిజైన్‌తో, తక్కువ యూనిట్లలో రిలీజ్ అవుతుండటంతో ఇది ఒక ఎక్స్‌క్లూజివ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. అయితే దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్, హీట్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ ఫోన్ గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం గిజ్‌బాట్ వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి.


Click it and Unblock the Notifications








