ఫేస్‌బుక్ ఆ యాప్‌ను మూసేస్తోంది
ఫేస్‌బుక్ తమ యూజర్ల ఎప్పటికప్పుడు న్యూస్ అప్‌డేట్ తెలుసుకునేందుకు 2014లో తీసుకొచ్చిన పేపర్ యాప్‌ను మూజేయాలని నిర్ణయించుకుంది. రాజకీయాలు,టెక్నాలజీ,ఆహారం ఇలాంటి వివిధ రంగాలకు చెందిన సమాచారాన్ని యూజర్లు చేసేందుకు ఈ యాప్ ఇప్పటిదాకా ఉపయోగపడుతుండేది. ఇక నుంచి ఈ యాప్ పనిచేయదంటూ ఫేస్‌బుక్ సెలవిచ్చింది. జూలై 29 తర్వాత ఇక ఈ యాప్ పనిచేయదంటూ ఇప్పటికే దాన్ని వినియోగిస్తున్నవాళ్లకు సందేశం వెళ్తోంది.
ఫేస్‌బుక్ ఇప్పటికిప్పుడు మాయమైపోతే: స్టీఫెన్ హాకింగ్

అయితే 2014 జనవరిలో లాంచ్ చేసిన ఈ యాప్ టాప్ 1500 డౌన్‌లోడ్స్‌లో కనిపించలేదని యాప్ యానీ అనే పరిశోధక సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్‌లో ఇది అసలు కనిపించలేదని, ఐఓఎస్ వెర్షన్‌ను కూడా చిట్టచివరిసారిగా 2015 మార్చిలో అప్‌డేట్ చేశారని చెప్పింది. వీక్షకుల నుంచి ఆదరణ పెద్దగా లభించకపోవడంతో ఇక దీన్ని మూసేయడమే నయమని భావించి, అందుకు అనుగుణంగా ఫేస్‌బుక్ నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్ నుంచి వచ్చిన ఫీచర్లు ఏంటో చూద్దాం.
ఒక్క బగ్‌తో ఫేస్‌బుక్ నుంచి 10 లక్షలు..

Donate to Nonprofit Organizations
డొనేట్ (Donate) పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఫేస్‌బుక్ 2013లో ప్రారంభించింది. ఈ పేజీలో భాగంగా 19 స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్ పొందుపరించింది. మీ స్తోమతను బట్టి ఈ సంస్థలకు మీ సహాయాన్ని అందించవచ్చు.

ఫేస్‌బుక్ ఫీచర్లు
అనుకోకుండా డిలీట్ చేసేసిన మీ ఫేస్‌బుక్ డేటాను తిరిగి పొందాలంటే ఫేస్‌బుక్ సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లి Download a copy ఆప్షన్ పై క్లిక్ చేయండి. Download Your Information పేరుతో ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్సులో గ్రీన్ బటన్‌లో కనిపించే Start My Archive ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌తో ఎంటర్ అవ్వండి.

ఫేస్‌బుక్ ఫీచర్లు
సేవ్ పేరుతో సరికొత్త బుక్‌మార్కింగ్ ఫీచర్‍ను ఫేస్‌బుక్ పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో మొబైల్ ఫోన్‌లలో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తోన్న యూజర్లు తమ తమ ఫేస్‌బుక్ పేజీలలో ప్రచురితమయ్యే ముఖ్యమైన డాటాకు సంబంధించిన లింక్‌లను బుక్‌మార్క్ చేసుకుని తమకు వీలుచిక్కినప్పుడు వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ సేవ్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది.ఫేస్‌బుక్ సేవ్ ఆప్షన్‌లో బుక్‌మార్క్ చేయబడిన లింక్‌లు రహస్యంగా ఉంటాయి, వీటిని అవసరమనుకుంటే మిత్రులకు కూడా షేర్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ ఫీచర్లు
ప్రకటనకర్తల కోసం ఫేస్‌బుక్ ‘పబ్లిషింగ్ టూల్' సరికొత్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టూల్ ప్రకటనకర్తలను తమ ఉత్పత్తులున ప్రమోట్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ ఫీచర్లు
ఫేస్‌బుక్ రీడింగ్ ప్రోగ్రామ్ ‘ఏ ఇయర్ ఆఫ్ బుక్స్' పేరుతో ఓ సరికొత్త పేజీని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ క్రియేట్ చేసారు. ఈ ప్రాజెక్టులో ఎవరైనా జాయిన్ కావచ్చు.

ఫేస్‌బుక్ ఫీచర్లు
ఫేస్‌బుక్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ గ్రాఫిక్ వీడియోలను గుర్తించి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. అంటే విశ్వసనీయమై న్యూస్ ఫీడ్‌లను మాత్రమే ఎంపిక చేసుకునేలా చేస్తుంది.


Click it and Unblock the Notifications








