యాప్స్ డౌన్‌లోడ్‌లో అమెరికాను వెనక్కినెట్టిన ఇండియా

Written By:

గూగుల్ ప్లే స్టోర్ నుంచి గత ఏడాది యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసిన దేశాల్లో ఇండియాకు మొదటి స్థానం లభించింది. 600 కోట్ల డౌన్‌లోడ్‌లతో భారత్‌ అమెరికాను వెనక్కి నెట్టినట్లు అనలిటిక్స్‌ సంస్థ 'యాప్‌ అన్నే' వెల్లడించింది. 2015లో భారత్‌లో డౌన్‌లోడ్లు దాదాపు 350 కోట్లు కాగా.. గత ఏడాది బాగా పెరిగినట్లు యాప్‌ అన్నే నివేదికలో పేర్కొంది.

జియో దెబ్బ, డేటా ప్యాక్‌లపై వొడాఫోన్ బంఫరాఫర్

యాప్స్ డౌన్‌లోడ్‌లో అమెరికాను వెనక్కినెట్టిన ఇండియా

భారత్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఓఎస్‌ల నుంచి ఎక్కువ డౌన్‌లోడ్‌ అయిన యాప్‌లుగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌, యూసీ బ్రౌజర్‌లు నిలిచాయి. అత్యధిక డౌన్‌లోడ్‌లు పొందిన మొదటి మూడు గేముల్లో క్యాండీ క్రష్‌, సబ్‌వే సర్ఫర్స్‌, టెంపుల్‌ రన్‌- 2లు ఉన్నాయి.ఇక ఐఓఎస్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌లలో యాప్‌ల డౌన్‌లోడ్‌లు 15 శాతం వృద్ధి చెందగా యాప్‌లపై వెచ్చిస్తున్న మొత్తం సమయం 25 శాతం పెరిగినట్లు వివరించింది.

ఊహించని ధరలో రెడ్‌మి నోట్ 4

యాప్స్ డౌన్‌లోడ్‌లో అమెరికాను వెనక్కినెట్టిన ఇండియా

2016లో ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌ ఆదాయంలో 35 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 2.3 లక్షల కోట్లు)ను యాప్‌ తయారీదార్లు (పబ్లిషర్స్‌)కు చెల్లించారు. ఇన్‌-యాప్‌ ప్రకటనలు, యాప్‌ స్టోర్‌ ఆదాయం, థర్డ్‌ పార్టీ ఆండ్రాయిడ్‌ స్టోర్‌లతో కలిపితే ఈ మొత్తం 89 బిలియన్‌ డాలర్లను దాటిందని రిపోర్ట్ తెలిపింది.

English summary
India Beats US in Google Play Downloads; Facebook, WhatsApp Most Popular Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot