ఊహించని ధరలో రెడ్‌మి నోట్ 4

Written By:

చైనా ఆపిల్‌గా పేరుగాంచిన షియోమి ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రెడ్‌మి నోట్ 3 ఇండియా మార్కెట్లో దుమ్మురేపడంతో దానికి అప్ గేగ్రేడ్ వర్సన్‌లో రెడ్‌మి నోట్ 4ను రేపు మార్కెట్లోకి తీసుకొస్తోంది. రెడ్‌మి నోట్ 3 ధరలోనే ఈ ఫోన్ ను మరింత ఆధునీకరించి ముందుకు తీసుకొస్తోంది. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ రానుంది. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో దెబ్బ, డేటా ప్యాక్‌లపై వొడాఫోన్ బంఫరాఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే , ప్రాసెసర్

5.5 అంగుళాల డిస్‌ప్లే తో పాటు 2.5 డ్రాగన్ గ్లాస్తో ఈ ఫోన్ రానుంది. షియోమి రెడ్మి నోట్ 4 క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది. దీని బరువు 160-165 గ్రాముల మధ్య ఉండొచ్చు. మెటల్ బాడీ, వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయని రూమర్లను బట్టి తెలుస్తోంది.

మూడు వేరియంట్లు

మూడు రకాల వేరియంట్లలో రానుంది. ప్రధానంగా 2 జీబీ, 3 జీబీ, 4 జీబీ ర్యామ్లు ఉండనున్నాయి. వీటి ఇంటర్నల్ మెమరీ 32, 64 జీబీలుగా ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్టుతో పాటు 4 జి ఎల్టీఈ కనెక్టివిటీ, హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంటాయి. 128 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరాలు

షియోమి రెడ్మి నోట్ 4 లో 13 మెగాపిక్సెళ్ల వెనక కెమెరాతో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 5 మెగా పిక్సెళ్ల ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ రానుంది.

బ్యాటరీ

బ్యాటరీ సామర్థ్యం రెడ్‌మి నోట్ 3తో పోలిస్తే కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. 4100 ఎంఏహెచ్ లి-పాలీమర్ బ్యాటరీతో రానుంది. ఇది త్వరగా చార్జి అయ్యేలా ఉంటుంది. అయితే ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

ఆపరేటింగ్ సిస్టమ్

ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అత్యాధునికమైన ఆండ్రాయిడ్ మార్ష్మాలో 6.0 ఉంటుందని, దాంతోపాటు షియోమి ఎంఐయూఐ 8 వెర్షన్ ఉంటుందని చెబుతున్నారు.

ధర

ధర విషయానికొస్తే రెడ్‌మి నోట్ 3కి కొంచెం అటుఇటుగానే ఉండొచ్చని తెలుస్తోంది. గడ ఏడాది ఆగస్టులో చైనాలో దీన్ని లాంచ్ చేశారు. అక్కడ 2జిబి ర్యామ్ ఫోన్ ధర CNY 899గా ఉంది. మన కరెన్సీలో దాదాపు రూ.9 వేలు. 3జిబి ర్యామ్ అలాగే 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర CNY 1,199. మన కరెన్సీలో రూ. 11,999. ఈ ధరల్లోనే ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mark the date! Xiaomi Redmi Note 4 Indian launch confirmed for January 19th read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot