Mi పే యాప్: మొదటి సారి గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యత!!!!
ప్రముఖ చైనా సంస్థ షియోమి ఇప్పుడు పేమెంట్ రంగంలోకి కూడా ప్రవేశించింది. షియోమి సంస్థ ప్రవేశించిన అన్ని రంగాలలో విజయం సాదిస్తున్నది. మొదటిగా ఇది మొబైల్ రంగంతో అందరి దృష్టిని ఆకర్శించింది. తరువాత టీవీ రంగంలోకి కూడా ప్రవేశించి తక్కువ ధరకు పెద్ద పెద్ద స్క్రీన్ గల టీవీలను విడుదల చేసింది.ఇప్పుడు పేమెంట్ రంగంలోకి కూడా తన గ్రాండ్ ఎంట్రీ మొదలైంది.

షియోమి ఫోన్‌లలో మొదటిగా ముందే లోడ్ చేయబడి ఉన్న Mi పే యాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఈ Mi యాప్ గూగుల్ ప్లే ద్వారా ఆండ్రాయిడ్ పరికరాల్లో ఉచితంగా లభిస్తుంది. Mi యాప్ ను ఉపయోగించి UPI ఆధారంగా డబ్బును బదిలీ చేయడానికి, మొబైల్ రీఛార్జీలు మరియు అన్ని రకాల బిల్ చెల్లింపులు చేయడానికి ఇంటిగ్రేటెడ్ పేమెంట్ పరిష్కారాన్ని అందించే విధంగా రూపొందించబడింది.

Mi యాప్ యొక్క ముఖ్య ఉద్దేసం గూగుల్ యాజమాన్యం యొక్క గూగుల్ పే మరియు పేటిఎమ్ మరియు భీమ్ వంటి ఇతర యాప్ లకు పోటీ ఇవ్వడం. ఇప్పటికే ఉన్న మొబైల్ పెమెంట్స్ యాప్ ల మాదిరిగా కాకుండా Mi పే యాప్ కి సైన్ ఇన్ చేయడానికి Mi అకౌంట్ అవసరం. ఐసిఐసిఐ బ్యాంక్ సహకారంతో షియోమి ఈ యాప్ ను రూపొందించింది.

మీరు ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు మొబైల్ పేమెంట్ లను ప్రారంభించడానికి Mi పే యాప్ ను UPI ద్వారా మీ ప్రస్తుత బ్యాంక్ ఖాతాతో లింక్ చేయవచ్చు. గూగుల్ పే మాదిరిగానే షియోమి Mi యాప్ UPI ఐడి లేదా మీ కాంటాక్ట్ అకౌంట్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా డబ్బు పంపించడానికి లేదా స్వీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మొబైల్ అకౌంట్ లను రీఛార్జ్ చేయడానికి మరియు పోస్ట్‌పెయిడ్ మొబైల్, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ మరియు డిటిహెచ్ బిల్లులను చెల్లించే ఫీచర్స్ కూడా ఉన్నాయి.

UPI పెమెంట్స్ అంగీకరించబడిన ఆఫ్‌లైన్ స్టోర్లలో యుటిలిటీ బిల్లులు చెల్లించడానికి లేదా లావాదేవీలు చేయడానికి షియోమి మద్దతునిస్తుంది. ఇంకా ఒక నెలలో జరిపిన లావాదేవీల చరిత్రను చూడటానికి Mi పే యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇతర UPI వినియోగదారుల నుండి చెల్లింపులను స్వీకరించడానికి మీరు మీ వ్యక్తిగత స్టాటిక్ లేదా డైనమిక్ QR కోడ్‌ను కూడా రూపొందించవచ్చు.

షియోమి సంస్థ ఇండియాలో తన వినియోగదారుల కోసం Mi పే యాప్‌ను ఈ ఏడాది మార్చిలో విడుదల చేసింది. ఈ యాప్ మొదట షియోమి ఫోన్లలో MIUI 10 లలో మాత్రమే అందుబాటులో ఉంది. తరువాత MIUI- ఆధారిత హ్యాండ్‌సెట్‌ల కోసం Mi App స్టోర్‌లలో అందించడం ప్రారంభించింది. షియోమి ఫోన్లలో Mi పే యాప్ ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లలో మీకు లభించే దానికంటే లోతైన అనుసంధానంతో వస్తుంది.

మొత్తానికి షియోమి సంస్థ చివరకు Mi పే యాప్ ను గూగుల్ ప్లేలోకి తీసుకువచ్చింది. Android 4.2 మరియు దాని తరువాత ఆండ్రాయిడ్ వెర్షన్ OSలతో నడుస్తున్న పరికరాల్లో డౌన్‌లోడ్ చేయడానికి ఈ యాప్ అందుబాటులో ఉంది. దీని యొక్క పరిమాణం కేవలం 5.1MB మాత్రమే.


Click it and Unblock the Notifications








