దీపావళి సేల్స్ లో షియోమి వస్తువులకు ఎక్కడ అధిక డిస్కౌంట్ లభిస్తున్నది

|

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సోమవారం మూడో రౌండ్ దీపావళి ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నిర్వహిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ లను నిర్వహిస్తోంది. రెండు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు పెద్ద డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. వీటితో పాటు భాగస్వామి బ్యాంకుల ద్వారా తక్షణ డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి. వివిధ రకాల ఉత్పత్తులపై నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటితో పాటు Mi.com లో కూడా Mi దీపావళి సేల్స్ మొదలైనాయి.

రెడ్‌మి నోట్
 

రెడ్‌మి నోట్ 7 ప్రో, పోకో F1, రెడ్‌మి K20 ప్రో, రెడ్‌మి K20 , రెడ్‌మి Y3, మరియు రెడ్‌మి నోట్ 7S వంటివి అక్టోబర్ 25, శుక్రవారం వరకు గొప్ప ఆఫర్లతో అమ్మకానికి మూడు ప్లాట్‌ఫాంలలో సిద్ధంగా ఉన్నాయి. మూడింటిలో దీపావళి సేల్స్ సందర్భంగా రాయితీ ధరలకు అందిస్తున్నాయి. షియోమి యొక్క వివిధ పరికరాలు గొప్ప డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి ఏ ప్లాట్ ఫామ్ ఉత్తమంగా ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి

షియోమి ఈ నెలలో ప్రారంభించిన రెడ్‌మి నోట్ 8 రెండు వెర్షన్లను కూడా దేశంలో మొదటిసారిగా అమ్మకానికి ఉంచింది. తాజా సేల్ రౌండ్ లో వివిధ Mi టివి మోడళ్లను కూడా డిస్కౌంట్ ఆఫర్లకు అందిస్తున్నది. అదనంగా Mi హోమ్ సెక్యూరిటీ కెమెరా 360 మరియు Mi ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్ లపై గొప్ప డిస్కౌంట్ లు ఉన్నాయి. వినియోగదారులు Mi మెన్స్ స్పోర్ట్స్ షూస్, Mi ఇయర్ ఫోన్స్ బేసిక్, మరియు Mi ఎల్ఇడి వై-ఫై స్మార్ట్ బల్బ్ లపై కూడా గొప్ప డిస్కౌంట్ పొందవచ్చు.

రెడ్‌మి K 20 ప్రో

షియోమి రెడ్‌మి K 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ దీపావళి సేల్స్ లో మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో భాగంగా 4,000 రూపాయల తగ్గింపుతో జాబితా చేయబడింది. ఈ ఆఫర్ షియోమి రెడ్‌మి కె 20 ప్రో యొక్క 6 జిబి, 128 జిబి మోడల్‌ మీద లభిస్తుంది. డిస్కౌంట్‌తో మీరు ఫ్లాగ్‌షిప్ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను రూ .24,999 కు పొందవచ్చు. అసలు ధర రూ .28,999లు.

బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు
 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ యొక్క తాజా ఎడిషన్ లో ఆన్ లైన్ కొనుగోలులో యాక్సిస్ మరియు సిటీ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల యొక్క అన్ని రూపే కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ దీపావళి సేల్స్ లో మీరు SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద 10,800 రూపాయల వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌

షియోమి ప్రోడక్ట్ ఒరిజినల్ ధర ఆఫర్ ధర
రెడ్‌మి K 20 ప్రో 27,999 24,999
రెడ్‌మి K 20 21,999 19,999
రెడ్‌మి నోట్ 7 ప్రో 13,999 11,999
పోకో F 1 17,999 15,999
రెడ్‌మి Y 3 9,999 7,999

Mi టీవీలు

Mi టీవీలు

స్మార్ట్‌ఫోన్‌ల విషయం పక్కన పెడితే షియోమి యొక్క Mi టివి మోడళ్ల మీద అన్ని ప్లాట్ ఫార్మ్ లలో అద్భుతమైన డిస్కౌంట్లు మరియు ఆఫర్లను అందిస్తున్నాయి. దీపావళి సేల్స్ లో భాగంగా Mi టివి 4 ఎ ప్రో యొక్క 43-అంగుళాల టీవీను రూ.20,999ల డిస్కౌంట్ ధరకు పొందవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో ఇది రూ.22,999 ధర వద్ద రిలీజ్ అయింది. అదేవిధంగా Mi టివి 4 సి ప్రో 32-అంగుళాల టీవీను ఇప్పుడు కేవలం రూ.11,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ మోడల్ సాధారణ ధర రూ.13,999.

దీపావళి సేల్‌

దీపావళి సేల్‌లో భాగంగా Mi యొక్క వివిధ ఉపకరణాలు మరియు గాడ్జెట్‌లపై గొప్ప డిస్కౌంట్లు మరియు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐదు రోజుల అమ్మకంలో భాగంగా Mi సూపర్ బాస్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ రూ.2000ల తక్కువ డిస్కౌంట్ ధరతో ఇప్పుడు కేవలం రూ.1,599 లకు పొందవచ్చు. Mi హోమ్ సెక్యూరిటీ కెమెరాను బేసిక్ రూ. 1,499 ధరకు, Mi హోమ్ సెక్యూరిటీ కెమెరా 360ని రూ. 2,499 ఆఫర్ ధరకు, ఇంకా Mi ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్ ను రూ.7,999 డిస్కౌంట్ ధరకు పొందవచ్చు.

షియోమి

షియోమి తన ఆన్లైన్ లో నిర్వహిస్తున్న దీపావళి సేల్స్ లో భాగంగా Mi ఇయర్ ఫోన్స్ బేసిక్‌ను కూడా కేవలం రూ.399లకు అందిస్తోంది. అదేవిధంగా Mi మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2ను రూ.2,499 ఆఫర్ ధర వద్ద లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఉపకరణాలు ఛార్జర్లు మరియు డేటా కేబుల్‌లపై కూడా గొప్ప తగ్గింపును అందిస్తోంది. అదనంగా దీపావళి విత్ Mi సేల్స్ లో ఎంచుకున్న ఉత్పత్తులపై నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Products Available At Bigger Discounts This Diwali Via Amazon, Flipkart and Mi.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X