ఇకపై మెసేంజర్‌లోనూ గేమ్స్ ఆడుకోవచ్చు !

Written By:

మెసెంజర్‌ను వాడుతున్న యూజర్లకు ఫేస్‌బుక్ శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు ఈ యాప్‌లో యూజర్లు చాటింగ్, కాలింగ్ వంటి సదుపాయాలను మాత్రమే పొందారు. అయితే ఇకపై ఈ యాప్‌లో యూజర్లు ఎంచక్కా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు.

130 మంది డెడ్, ఆ వీడియో గేమ్ ఆడితే చావే !

ఇకపై మెసేంజర్‌లోనూ గేమ్స్ ఆడుకోవచ్చు !

త్వరలో ఈ యాప్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఫేస్‌బుక్ విడుదల చేయనుండగా అందులో యూజర్లు గేమ్స్ ఆడుకునేలా ఫీచర్లను తీర్చిదిద్దనున్నారు. ఫోన్లలో ఉండే స్నేక్ గేమ్స్, పజిల్ గేమ్స్, వర్డ్ గేమ్స్, స్నూకర్, సాకర్, క్రికెట్ వంటి గేమ్స్‌తోపాటు మొత్తం 50 వరకు చిన్న సైజ్ ఉండే గేమ్స్‌ను మెసెంజర్‌లో అందించనున్నారు.

రూ. 12 వేలకే ల్యాప్‌టాప్

ఇకపై మెసేంజర్‌లోనూ గేమ్స్ ఆడుకోవచ్చు !

ఒక యూజర్ తనకు తానే స్వయంగా ఆడుకోవడంతోపాటు తనతో చాటింగ్ చేసే యూజర్లతో కూడా గేమ్స్ ఆడేలా మల్టీ గేమింగ్ పద్ధతిని మెసెంజర్‌లో అందించనున్నారు. అప్‌డేటెడ్ యాప్‌ను విడుదల చేశాక వారానికోసారి కొత్త గేమ్స్‌ను కూడా మెసెంజర్‌లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలపై ఫేస్‌బుక్ మెసెంజర్ అప్‌డేట్ త్వరలో అందుబాటులోకి రానుంది.

English summary
Soon play games while you chat on Facebook Messenger read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot