రూ. 12 వేలకే ల్యాప్‌టాప్

Written By:

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విద్యార్థుల కోసం తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన స్పెషల్ ఎడిషన్‌ను తాజాగా విడుదల చేసింది. 'విండోస్ 10 ఎస్' పేరిట విడుదలైన ఈ ల్యాపీలోని ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా విద్యార్థుల కోసం తీర్చిదిద్దారు. వారికి అవసరమైన పలు పాఠ్యాంశాలను సులువుగా నేర్చుకునేందుకు వీలుగా ఈ ఓఎస్‌ను మైక్రోసాఫ్ట్ తీర్చిదిద్దింది.

ఈ ఫోన్ ధర రూ.5,999, సంవత్సరంలోపు రిపేర్ వస్తే కొత్తది ఇచ్చేస్తారు

రూ. 12 వేలకే ల్యాప్‌టాప్

అయితే విండోస్ 10 ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో డిఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్‌గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంటుంది. దాన్ని యూజర్లు మార్చలేరు. అదేవిధంగా ఈ ఓఎస్ ఉన్న పీసీలో సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే అది మైక్రోసాఫ్ట్ వెరిఫైడ్ సెక్యూరిటీ అండ్ ఇంటెగ్రిటీ ద్వారానే వీలవుతుంది. దీంతో పీసీకి పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. వైరస్‌లు, మాల్‌వేర్‌లు అంత సులభంగా వ్యాపించేందుకు వీలుండదు.

జియో నుంచి ఈ ఏడాది రానున్న మెరుపులు ఇవే !

రూ. 12 వేలకే ల్యాప్‌టాప్

హ్యాకర్ల నుంచి కూడా రక్షణ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెచ్చిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 ప్రొఫెషనల్ ఓఎస్‌లా పనిచేయదు. కొంత ఫంక్షనాలిటీ తగ్గుతుంది. అలాగే అన్ని డివైస్‌లకు సపోర్ట్ చేయదు. అయితే ఈ ఓఎస్ ఉన్న పీసీలను వాడే వారికి మాత్రం మైక్రోసాఫ్ట్ ఓ ఆఫర్‌ను అందజేయనుంది.

మొబైల్ టవర్స్ సమాచారం ఇక మీ చేతిలో..

రూ. 12 వేలకే ల్యాప్‌టాప్

విండోస్ 10 ఎస్ ను విండోస్ 10 ప్రొఫెషనల్‌కి అప్‌గ్రేడ్ చేసుకునేందుకు కేవలం రూ.3140 చెల్లిస్తే చాలు, సాఫ్ట్‌వేర్ కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవుతుంది.అప్పుడు ఏకంగా విండోస్ 10 ప్రొఫెషనల్ ఎడిషన్‌నే స్టూడెంట్లు వాడుకోవచ్చు. విండోస్ 10 ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన పీసీలో త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి. ఇవి రూ.12వేల ప్రారంభ ధరకు భారత్‌లో లభ్యం కానున్నాయి.

English summary
Microsoft launches Windows 10S; how is it different from Windows 10 operating system read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting