Home
Apps

గూగుల్ మ్యాప్స్‌లో ఈ సీక్రెట్ ట్రిక్ తెలుసా? ఆ ఆప్షన్ ఆన్ చేస్తే చాలు.. క్షణాల్లో డైరెక్షన్స్ అదిరిపోతాయి..

Google Maps: చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్స్‌ పైనే ఆధారపడతారు. ముఖ్యంగా నడుచుకుంటూ వెళ్లేటప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. వాయిస్ నావిగేషన్ ఫీచర్ ఉండటంతో ఫోన్ చూడకుండానే దారి తెలుసుకోవచ్చు. కానీ ఒక్కోసారి ఇది సరిపోదు. రద్దీగా ఉండే సిటీల్లో ఫోన్ దొంగతనాలు ఎక్కువ. అందుకే ఫోన్‌ను జేబులో పెట్టుకుని నడవడం సేఫ్.

గూగుల్ మ్యాప్స్ వాయిస్ గైడెన్స్ ఇస్తుంది కానీ, కొన్నిసార్లు చాలాసేపు సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడు దారి తప్పామా అనే భయం వేస్తుంది. ఈ సమస్యకు ఒక చిన్న సెట్టింగ్ ఉంది. దాని పేరు "డీటైల్డ్ వాయిస్ గైడెన్స్". దీన్ని ఆన్ చేసుకుంటే చాలు, ఎలాంటి టెన్షన్ లేకుండా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటూ ముందుకు సాగొచ్చు.

This Hidden Google Maps Feature Makes Walking Directions Better Instantly

* నడకకు వాయిస్ నావిగేషన్ ఎందుకు వాడాలి..

గూగుల్ మ్యాప్స్ నడకను చాలా ఈజీ చేస్తుంది. క్లియర్ డైరెక్షన్స్ ఇస్తుంది. \"గ్లాన్సబుల్ డైరెక్షన్స్\" అనే ఫీచర్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయకుండానే అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. కానీ రద్దీ ప్రదేశాల్లో ఫోన్ తీయడం రిస్క్. వాయిస్ నావిగేషన్ సేఫ్ ఆప్షన్. ఇది టర్న్-బై-టర్న్ గైడెన్స్ ఇస్తుంది. మీరు దారిపై దృష్టి పెట్టొచ్చు, ఫోన్‌పై కాదు.

* సాధారణ వాయిస్ నావిగేషన్‌లో ఉన్న చిక్కు

డిఫాల్ట్‌గా గూగుల్ మ్యాప్స్ వాయిస్ నావిగేషన్ ముఖ్యమైన డైరెక్షన్స్‌ను మాత్రమే ఇస్తుంది. టర్న్స్ వచ్చినప్పుడు, రూట్ మారినప్పుడు చెబుతుంది. కానీ స్ట్రెయిట్ రోడ్లపై నడుస్తున్నప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. దీంతో మనం సరైన దారిలోనే వెళ్తున్నామా లేదా అని డౌట్ వస్తుంది. ఏమైనా డైరెక్షన్ మిస్ అయ్యామా అని కంగారు పడతాం.

* డీటైల్డ్ వాయిస్ గైడెన్స్ అంటే..

గూగుల్ కళ్లు సరిగ్గా కనిపించని వాళ్ల కోసం ఈ ఫీచర్‌ను 2019లో తీసుకొచ్చింది. కానీ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కంటిన్యూస్‌గా అప్‌డేట్స్ ఇస్తుంది. సరైన దారిలోనే వెళ్తున్నారనే నమ్మకాన్ని ఇస్తుంది. నెక్స్ట్ టర్న్ ఎంత దూరంలో ఉందో చెబుతుంది.

ఏ దిశలో వెళ్లాలో కూడా చెబుతుంది. ఒకవేళ దారి తప్పితే వెంటనే రూట్ మారుస్తుంది. దీంతో తెలియని ప్రదేశాల్లో కూడా టెన్షన్ లేకుండా నడవొచ్చు. మరి డీటైల్డ్ వాయిస్ గైడెన్స్ ఎలా ఆన్ చేసుకోవాలో చాలా సింపుల్‌గా తెలుసుకుందాం. నిజానికి దీన్ని ఆన్ చేసుకోవడం చాలా సింపుల్.

* డీటైల్డ్ వాయిస్ గైడెన్స్ ఆన్ చేయండిలా..

గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి, టాప్ రైట్ కార్నర్‌లో మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి> నావిగేషన్ అని ఉంటుంది. అక్కడ \"వాకింగ్ ఆప్షన్స్\" కింద \"డీటైల్డ్ వాయిస్ గైడెన్స్\" ఉంటుంది. దాన్ని టర్న్ ఆన్ చేయాలి. వద్దు అనుకుంటే మళ్లీ అదే స్టెప్స్ ఫాలో అయ్యి టర్న్ ఆఫ్ చేయొచ్చు.

క్లియర్ డైరెక్షన్స్ కావాలనుకునేవారు ఈ సెట్టింగ్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. తెలియని ప్రదేశాలకు ఎక్కువగా వెళ్లే మీ ఫ్రెండ్స్‌తో ఈ సీక్రెట్ ట్రిక్‌ని షేర్ చేయండి. ఇలాంటి సూపర్ ట్రిక్స్ కోసం తెలుగు గిజ్ బాట్ వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Detailed Voice Guidance in Google Maps enhances walking navigation with continuous audio updates, improving route information and safety, especially in unfamiliar areas, for stress-free walks.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X