WhatsApp కొత్తగా 'వీడియో మ్యూట్' ఫీచర్!! త్వరలోనే అందుబాటులోకి...
ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో వినియోగదారులు అధికంగా సోషల్ మీడియా యాప్ లను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో వాట్సాప్ అన్నిటి కంటే ముందు వరుసలో ఉంది. సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ కంటే ముందు ఫేస్‌బుక్ వంటివి వచ్చినప్పటికీ మార్కెటింగ్ విషయంలో కొద్దిగా బిన్నంగా ఉంది.

ప్రపంచం మొత్తం మీద వాట్సాప్ కు విపరీతమైన ఆదరణ కలిగి ఉంది. అయితే గత రెండు నెలల నుంచి వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గింది. దీనికి కారణం సర్వీస్ యొక్క నిబంధనలు మరియు గోప్యతా విధానంలోని మార్పుల గురించి వినియోగదారులకు తెలియజేయడానికి నోటిఫికేషన్లను పంపడంతో చాలా మంది ఇతర యాప్ లను వినియోగించడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు గోప్యతా విధానాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటుగా కొత్త అప్ డేట్ లను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల వాట్సాప్ వెబ్ వెర్షన్ లో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు మ్యూట్ వీడియో షేరింగ్ సపోర్ట్ వంటి మరొక ఫీచర్ ను పరీక్షిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ వీడియో మ్యూట్ ఫీచర్
వాట్సాప్ వీడియోలను తమ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయడానికి ముందు అందులో గల వాయిస్ ను మ్యూట్ చేయడానికి వాట్సాప్ మద్దతును ఇవ్వడం ప్రారంభించింది. WABetaInfo యొక్క కొత్త నివేదిక ప్రకారం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం రూపొందించబడింది. అలాగే త్వరలో బహిరంగంగా కూడా విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

వాట్సాప్ కొత్త అప్ డేట్ గురించి విడుదల అయిన కొత్త నివేదిక ప్రకారం బీటా వినియోగదారుల కోసం వెర్షన్ 2.21.3.13 కొత్త అప్ డేట్ విడుదల కానున్నది. ఇందులో వీడియోను మ్యూట్ చేయగల టోగుల్ ఉంటుంది. ఈ టోగుల్ ద్వారా వీడియోను ట్రిమ్ చేయడం, ఏదైనా టెక్స్ట్ ను జోడించడం, స్టిక్కర్లు వంటి మరిన్ని ఇతర ఎడిటింగ్ ఎంపికలను కూడా జోడించడానికి అనుమతిని ఇస్తుంది అని నివేదికలో అందించిన స్క్రీన్ షాట్ చూపిస్తుంది.

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ సోషల్ మీడియా యాప్ లో కొత్తగా రాబోయే ఈ ఫీచర్లు మరియు మార్పులను మొదటిసారిగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ లో మొదటి ప్రస్తావన 2020 నవంబర్‌లో ఫీచర్ అభివృద్ధిలో యాప్ యొక్క ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.20.207.2 తో రూపొందించబడింది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ గుర్తించబడినప్పటికీ ఇది iOS తో పాటు వెబ్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుంది అని గమనించాలి.


Click it and Unblock the Notifications








