Home
Apps

WhatsApp మూడు రెడ్ టిక్ మార్కుల గురించి మీకు తెలియని ఖచ్చితమైన విషయం

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల అన్ని రకాల యాప్ ల మాదిరిగానే వాట్సాప్ కూడా ముఖ్యమైన వార్తలు మరియు ఇతర సమాచారాన్ని ఎక్కువ మందికి చేరవేసే మూలంగా మారింది. కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే ఇందులో కూడా తప్పుడు సమాచారం మరియు నకిలీ వార్తలు అధికంగా ఒకరికి ఒకరు పంపుతూ ఉంటారు.

వాట్సాప్‌

ఇటీవల వాట్సాప్‌లోని మెసేజ్ లపై ‘టిక్' నెంబర్ మరియు కలర్ మీద ఒక మెసేజ్ వైరల్ గా మారింది. వైరల్ అయిన సమాచారం ప్రకారం మీ యొక్క మెసేజులను ప్రభుత్వం గమనిస్తున్నట్లు కూడా సూచిస్తుంది. ఈ సమాచారాన్ని ఇప్పుడు ట్విట్టర్‌లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పూర్తిగా అవాస్తవం అని కండించింది. PIB అనేది ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలు మరియు మరెన్నో విషయాలపై మీడియాకు సమాచారాన్ని ప్రసారం చేసే ప్రభుత్వ సంస్థ.

PIB ట్వీట్

PIB ట్వీట్

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ట్విట్టర్‌లో ఇలా సమాచారం ఇచ్చింది. "# ఫేక్ న్యూస్ అలర్ట్! సోషల్ మీడియాలో '√ టిక్ మార్కులకు' వాట్సాప్ సమాచారం చదివే మెసేజ్ లు #FAKE. #PIBFactCheck: లేదు! ప్రభుత్వం అలాంటి పని చేయడం లేదు. మెసేజ్ #FAKE. పుకార్లు జాగ్రత్త! "అని పిఐబి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

వాట్సాప్ వైరల్ న్యూస్

వాట్సాప్ వైరల్ న్యూస్

వాట్సాప్ మెసేజ్ ల గురించి వైరల్ అయిన సమాచారం విషయానికి వస్తే వాట్సాప్ ఒక కొత్త వ్యవస్థను అమలు చేసింది. దీనితో వినియోగదారులు వారు పంపుతున్న మెసేజ్ లను ప్రభుత్వం గమనిస్తుందా లేదా ప్రభుత్వం చర్య తీసుకోగలదా అని తెలుసుకోవచ్చు. పంపినవారికి మెసేజ్ యొక్క చివరిన టిక్ మార్క్ నెంబర్ మరియు కలర్ కలయికలు వాటి అర్ధాలను తెలియజేస్తుంది.


*** మూడు నీలిరంగు టిక్ మార్క్ లు - ప్రభుత్వం గమనించింది.

*** రెండు నీలం మరియు ఒక రెడ్ కలర్ టిక్ మార్క్ - పంపినవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు.

*** ఒక నీలం మరియు రెండు ఎరుపు కలర్ టిక్ మార్కులు - పంపినవారి డేటాను ప్రభుత్వం పరీక్షిస్తోంది.

*** మూడు ఎర్రటి టిక్ మార్కులు - ప్రభుత్వం చర్యను ప్రారంభించింది మరియు పంపినవారు కోర్టు నుండి సమన్లు స్వీకరిస్తారు.

 

వాట్సాప్ ఎండ్-టు-ఎండ్

వాట్సాప్ ఎండ్-టు-ఎండ్

పిఐబి ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సమాచారం ప్రకారం ఇది నకిలీది అని తెలింది అలాగే ప్రభుత్వం పంపినవారి డేటాను పరీక్షిస్తున్నట్లు అలాంటిదేమీ చేయలేదు. ఇంకా వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ చేయబడింది. కాబట్టి వాట్సాప్ మెసేజింగ్ యాప్ లో పంపే మెసేజ్ లను ప్రభుత్వం చదవలేదు. కుటుంబం మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి చాలా మంది వాట్సాప్ ను వినియోగిస్తూ ఉంటారు. వార్తలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని పొందడానికి ఇది ఎల్లప్పుడూ ఉత్తమమైన ప్రదేశం కాదు. వార్తల కోసం విశ్వసనీయ ప్రచురణలు మరియు మీడియా హౌస్‌లను ఎల్లప్పుడూ ఇష్టపడాలి.

వాట్సాప్‌లో పాపప్

వాట్సాప్‌లో పాపప్

ఇటువంటి మెసేజ్ లు వాట్సాప్‌లో పాపప్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. ట్విట్టర్లో వినియోగదారుడు సూచించినట్లుగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఇలాంటి మెసేజ్ లను కనుగొనవచ్చు. వాట్సాప్ తప్పుడు సమాచారం యొక్క వ్యాప్తిని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కరోనావైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కదిలించిన ఈ కీలకమైన సమయంలో మెసేజింగ్ సర్వీస్ ఇటీవల ఫార్వార్డ్ మెసేజ్ల పరిమితిని కూడా తగ్గించింది. ఇంతకుముందు ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ ఫార్వార్డ్ చేసిన మెసేజ్ లకు ఇది వర్తిస్తుంది.

Best Mobiles in India

English summary
WhatsApp Three Red Ticks News is Fake: PIB Conformed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X