Home
Apps

టీ తాగే సమయంలో యాపిల్ ప్రొడక్ట్స్ మీ ఇంటికి.. జెప్టో డెలివరీ అదరగొట్టిసిందిగా!

Zepto Apple Delivery: క్విక్-కామర్స్ స్టార్టప్ జెప్టో ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ ఇక నుంచి ఆపిల్ ప్రొడక్ట్స్ కూడా డెలివరీ చేయబోతోంది. అంతేకాదు.. కేవలం 10 నిమిషాల్లోనే డోర్ డెలివరీ ఇస్తారంట. ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో ఉన్న కస్టమర్లు జెప్టో యాప్ ద్వారా ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్‌లు ఇంకా రకరకాల యాక్సెసరీలు ఆర్డర్ పెట్టుకుంటే చాలు.. క్షణాల్లో మీ చేతుల్లో వాలిపోతాయి.

* జెప్టోలో యాపిల్ ప్రొడక్ట్స్

ఆపిల్ ప్రొడక్ట్స్ కోసం జనం వెతుకుతున్నారని గమనించిన జెప్టో.. వెంటనే ఈ ఆఫర్‌తో ముందుకొచ్చింది. జెప్టో కో-ఫౌండర్, సీఈఓ అదిత్ పలిచా స్వయంగా లింక్డ్‌ఇన్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. కొత్త యాపిల్ డివైజ్‌లు అయిన ఐఫోన్ 16e, ఎయిర్‌పాడ్స్, మ్యాగ్‌సేఫ్ ఛార్జర్లు.. ఇలా చాలానే డెలివరీ చేస్తున్నామన్నారు.

Zepto Now Delivers iPhones  AirPods and Apple Watches in Just 10 Mins

అంతేకాదు కొనుగోలుదారులను ఆకర్షించడానికి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, స్పెషల్ లాంచ్ ఆఫర్లు కూడా పెడుతున్నారంట. కాకపోతే ఉత్పత్తులు మాత్రం మీ ప్రాంతంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ ఉత్పత్తులు మీకే చేరే సదుపాయం ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే మీకు నచ్చిన ప్రొడక్ట్ మీ చేతికి వస్తుంది.

* ఏ ఆపిల్ ప్రొడక్ట్స్ కొనొచ్చు..

ఐఫోన్లు, ఎయిర్‌పాడ్సే కాదు.. ఐప్యాడ్లు, యాపిల్ పెన్సిళ్లు, మ్యాక్‌బుక్ ఛార్జర్లు.. ఇంకా చాలా యాపిల్ యాక్సెసరీలు కూడా జెప్టోలో దొరుకుతాయ్. ఇంకో విషయం ఏంటంటే.. కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ కూడా లిస్టులో పెట్టారు కానీ.. ప్రస్తుతానికి "ఔట్ ఆఫ్ స్టాక్" అని చూపిస్తోంది. అంటే భవిష్యత్తులో యాపిల్ ప్రొడక్ట్స్ పెంచవచ్చని అర్థమవుతోంది..

* ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయి

జెప్టోలో ఐఫోన్ 16e బేస్ మోడల్ (128GB) ధర రూ.55,975 నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా ఐప్యాడ్ 10th జెన్ రూ.33,074కి సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కావాలనుకునేవారి కోసం ఎయిర్‌పాడ్స్ 2nd జెన్ కూడా ఉన్నాయి. వీటి ధర వచ్చేసి రూ.21,999.

ఏఎన్‌సీతో వచ్చే ఎయిర్‌పాడ్స్ 4 రూ.16,499కి లభిస్తోంది. యాపిల్ వాచ్ SE 44mm రూ.25,975కి అమ్ముతున్నారు. యాపిల్ ఇయర్‌పాడ్స్, యాపిల్ పెన్సిల్ 2nd జెన్, 35W డ్యూయల్ USB-C ఛార్జర్ కూడా ఉన్నాయి. వీటి ధరలు జెప్టో యాప్‌లో పరిశీలించవచ్చు. తక్కువగా ఉంటే ఇక్కడే కొనుగోలు చేయొచ్చు.

* ఏయే సిటీల్లో ఈ డెలివరీ ఉంది..

జెప్టో ఇంకా సిటీల జాబితా గురించి పూర్తి వివరాలు ఇంకా చెప్పలేదు కానీ మెయిన్ మెట్రోపాలిటన్ సిటీల్లో కచ్చితంగా ఉంటుందని అంచనా. బ్లింకిట్ కూడా యాపిల్ ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తోంది. వాళ్లయితే ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, పూణే, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు, కోల్‌కతా సిటీల్లో డెలివరీ చేస్తున్నారు. జెప్టో కూడా దాదాపుగా అవే నగరాల్లో సేవలందించే అవకాశముంది.

* యాపిల్ రేసులో జెప్టో vs బ్లింకిట్..

జెప్టో యాపిల్ డెలివరీలోకి ఎంటర్ అవ్వడం.. బ్లింకిట్‌కి గట్టి పోటీ ఇవ్వడమే. ఇదివరకు బ్లింకిట్ కూడా మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్స్, ఐఫోన్లు లాంటి యాపిల్ ప్రొడక్ట్స్ డెలివరీ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ రెండు ప్లాట్‌ఫామ్స్‌ కూడా యాపిల్ డివైజ్‌లను చాలా తక్కువ సమయంలో టైమ్‌లో డెలివరీ చేయడానికి పోటీ పడుతుండటంతో.. కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Zepto now delivers Apple iPhones, AirPods, and Watches in just ten minutes, challenging Blinkit. This quick service offers fast access to Apple gadgets and accessories in select Indian cities.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X