బెండ్ టెస్టులో వంగిపోని ఐఫోన్ 16e.. పూర్తిగా విప్పదీస్తే చూస్తే దిమ్మతిరిగే నిజాలు!
iPhone 16e Bend Test: ఆపిల్ కంపెనీ ఐఫోన్ SE సిరీస్‌ను ఆపేసి, కొత్తగా ఐఫోన్ 16eని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. SE మోడల్స్‌తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ ధరకే వస్తుంది కానీ, ఐఫోన్ 16 కంటే మాత్రం కొంచెం తక్కువే. అయితే, ధర తగ్గింది కదా అని కొన్ని ఫీచర్లు తగ్గించేశారు. ఈ 16e మొబైల్‌లో వెనుకవైపు రెండు కెమెరాలు ఉండాల్సిన చోట ఒకే 48MP కెమెరా ఇచ్చారు.
పర్ఫార్మెన్స్ కూడా కొంచెం తక్కువే ఉంటుందట, ఇది A18 చిప్‌తో వస్తుంది. రంగులు కూడా రెండే, అవి నలుపు, తెలుపు మాత్రమే. అయితే తాజాగా దీనిపై ఒక బండి టెస్ట్ చేశారు అంతేకాకుండా దాన్ని మొత్తం విప్పి బాగాలను కూడా పరిశీలించారు.మరి ఈ పరీక్షలలో ఏం తేలిందో తెలుసుకుందాం పదండి.

ఐఫోన్ 16e చాలా దృఢంగా ఉంది. ఇది బెల్ట్ క్వాలిటీలో అది ఏ మాత్రం తగ్గలేదు. జెర్రీరిగ్ఎవెరిథింగ్ (JerryRigEverything) యూట్యూబ్ ఛానెల్ ఓనర్ జాక్, ఈ ఫోన్‌కు తన స్టైల్లో మన్నిక టెస్టులు పెట్టాడు. ఫోన్ స్క్రీన్‌కి సిరామిక్ షీల్డ్ గ్లాస్ వేశారు. ఇది గీతలు పడకుండా చాలా గట్టిగా ఉంటుందట.
ఐఫోన్ 16e స్క్రీన్ విషయానికి వస్తే మోహ్స్ హార్డ్‌నెస్ స్కేల్‌పై లెవెల్ 6 వరకు గీతలు పడవు, లెవెల్ 7 దగ్గర కొంచెం గీతలు కనపడతాయి. ఇది మామూలుగా చాలా స్మార్ట్‌ఫోన్లలో ఉండే స్టాండర్డ్ గ్లాసే. ఫోన్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ అల్యూమినియంతో చేశారు, బటన్స్ కూడా లోహంతో చేసినవి.
మొత్తానికి ఫోన్ చాలా గట్టిగా, దృఢంగా ఉంది. స్పీకర్ దగ్గర నీళ్లు పోకుండా మెష్ కూడా పెట్టారు. ఫ్లేమ్ టెస్టులో, అంటే మంట పెట్టి చూస్తే, OLED డిస్‌ప్లే (6.1 అంగుళాల, 1170 x 2532 పిక్సెల్స్, ~457 PPI) 20 సెకన్ల వరకు వేడిని తట్టుకుంది. ఆ తర్వాత పిక్సెల్స్ తెల్లగా అయిపోయాయి.
కానీ ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తే మళ్లీ అంతా నార్మల్‌గా అయిపోయింది, పెద్దగా డ్యామేజ్ ఏమీ కనిపించలేదు. ఇక అసలు సిసలైన బెండ్ టెస్టులో ఐఫోన్ 16e తన సత్తా చాటింది. ఎంత బలం పెట్టి వంచినా అస్సలు వంగలేదు. ఏ డైరెక్షన్‌లో వంచినా అంతే, దీన్ని బట్టి ఆపిల్ ఐఫోన్స్ ఎంత బలంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
* లోపల ఏముందో చూస్తే షాక్..
జాక్ ఫోన్‌ను విప్పదీసి లోపల ఏముందో చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మామూలుగా ఖరీదైన ఐఫోన్లలో ఉండే మ్యాగ్‌సేఫ్ మాగ్నెట్స్ ఈ 16eలో లేవు. ఇంకో విషయం ఏంటంటే, బ్యాటరీ తీసే పద్ధతిని ఆపిల్ మార్చేసింది. ఇంతకుముందు బ్యాటరీ తీయాలంటే పుల్ ట్యాబ్స్ ఉండేవి, వాటిని లాగితే బ్యాటరీ వచ్చేసేది.
కానీ ఇప్పుడు అలా కాదు, 9V బ్యాటరీ, అలిగేటర్ క్లిప్స్ ఉంటేనే బ్యాటరీ తీయగలుగుతాం. అంటే బ్యాటరీ మార్చడం కాస్త కష్టమైన పనే. కెమెరా విషయానికొస్తే, వెనుకవైపు ఉన్న 48MP కెమెరాలో మామూలు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉంది. ఖరీదైన మోడల్స్‌లో ఉండే అడ్వాన్స్‌డ్ సెన్సార్-షిఫ్ట్ స్టెబిలైజేషన్ ఇందులో లేదు.
* ఫీచర్లు, ధర ఎంతంటే..
ఐఫోన్ 16e iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దీనిలో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఉంది. కొత్త A18 చిప్‌తో పాటు 6-కోర్ CPU ఉంటుంది. రోజువారీ పనుల కోసం పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12MP కెమెరా ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఈ ఫోన్ రూ.57,900కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.59,900.


Click it and Unblock the Notifications








