ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 విడుదల.. రెండు వేరియంట్‌లు, ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టు, భారీ బ్యాటరీ!
ఆపిల్ నుంచి ఇటీవల ఐఫోన్ 16e భారత్ మార్కెట్ లో లాంచ్ అయింది. గత నెలలోనే సేల్ కూడా ప్రారంభం అయింది. దీంతోపాటు రెండు ఐప్యాడ్‌లను లాంచ్ చేసింది. M3 చిప్‌సెట్‌తో ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ 11 జెన్‌ను (2025) కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు సరికొత్తగా M4 చిప్‌సెట్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్‌ను కూడా విడుదల చేసింది. ఈ దీనిపై ఇటీవలే ఆపిల్ సీఈవో టిమ్ కుక్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ వారంలో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్లు చెప్పారు.
టిమ్ కుక్ చెప్పిన విధంగానే M4 చిప్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్‌ను (Macbook Air M4) లాంచ్ చేశారు. ఈ రెండు డిస్‌ప్లే వేరియంట్స్‌లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆపిల్ ల్యాప్‌టాప్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్టు చేస్తుంది. నాలుగు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మ్యాక్‌బుక్ ఎయిర్ (2025) ల్యాప్‌టాప్ స్పెఫికేషన్‌లు, ఫీచర్‌లు :
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 చిప్‌సెట్ రెండు డిస్‌ప్లే వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. 13 అంగుళాల (2560*1664 పిక్సల్స్) సూపర్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్ గరిష్ఠ డిస్‌ప్లే, 224 ppi పిక్సల్ డిన్సిటీని కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 15 అంగుళాల (2880*1864 పిక్సల్స్) సూపర్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. 224 ppi పిక్సల్ డెన్సిటీ, 500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్ M4 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మరియు 10 కోర్ CPU ను కలిగి ఉంది. మరియు 16 కోర్ Neural ఇంజిన్, 8 కోర్ GPU ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ గరిష్ఠంగా 24GB ర్యామ్ మరియు 2TB SSD స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
ఆపిల్ ల్యాప్‌టాప్ 13 అంగుళాల మోడల్ 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 53.8Wh లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. అయితే 30W అడాప్టర్‌ను మాత్రమే అందిస్తుందని తెలుస్తోంది. అదే 15 అంగుళాల వేరియంట్ 66.5Wh బ్యాటరీని సపోర్టు చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 15 గంటల వరకు వెబ్ బ్రౌజింగ్ కోసం వినియోగించుకోవచ్చు. మరియు ఆపిల్ టీవీ యాప్‌లో 18 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైం ను పొందవచ్చు.
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, వైఫై 6E ఫీచర్‌లను కలిగి ఉంది. థండర్ బోల్డ్ 4, USB 4 పోర్టులు, మెగ్‌సెఫ్ 3 ఛార్జింగ్ పోర్టులు, 3.5mm ఆడియో జాక్‌తో అందుబాటులో ఉంది. మరియు స్పేషియల్ ఆడియో సపోర్టుతో క్వాడ్ స్పీకర్‌లు, మూడు మైక్‌లను కలిగి ఉంది.
ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్‌లో 1080p ఫేస్‌టైం కెమెరాను ఏర్పాటు చేశారు. వీడియో కాల్స్, మీటింగ్స్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ ల్యాప్ ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్, మల్టీ టచ్ గెశ్చర్స్‌ను కలిగి ఉంది. భద్రత కోసం ఈ ల్యాప్‌టాప్ టచ్ ID బటన్‌ను అమర్చి ఉంటుంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర, సేల్ వివరాలు :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 13 అంగుళాల 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.99,900 గా ఉంది. అదే 15 అంగుళాల 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,24,900 గా ఉంది. మిడ్‌నైట్, సిల్వర్, స్కైబ్లూ, స్టార్‌లైట్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. మార్చి 12 నుంచి సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications