Home
Tablets

ఇండియాలో యాపిల్ ఐప్యాడ్ (2025) లాంచ్.. ఫీచర్లు, ధర, ఇతర వివరాలు ఇవే..

Apple Launches iPad: యాపిల్ కంపెనీ తాజాగా 2025 మోడల్ ఐప్యాడ్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ కొత్త ఐప్యాడ్‌లో A16 చిప్ ఇచ్చారు. అలాగే స్టోరేజ్ కూడా పెంచారు. ఇంతకుముందు 64GB ఉండే బేస్ మోడల్ ఇప్పుడు ఏకంగా 128GBతో వస్తోంది. 10.9-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే అందించారు. పిక్చర్స్, వీడియోలు చాలా క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఫాస్ట్ ఉంటుంది, కానీ ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు మాత్రం లేవు.

* A16 ప్రాసెసర్‌తో మంచి పర్ఫార్మెన్స్

కొత్త ఐప్యాడ్‌లో వాడిన A16 చిప్ మామూలుగా లేదు. ఇది టాబ్లెట్ పనితీరును, పవర్ ఎఫిషియెన్సీని బాగా పెంచేస్తుంది. పాత మోడల్స్‌తో పోలిస్తే స్పీడ్ 30 శాతం పెరిగింది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ 50 శాతం పెరిగింది. అంతేకాదు, మార్కెట్లో ఉన్న టాప్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ల కంటే ఇది ఏకంగా ఆరు రెట్లు వేగవంతమైనదట.

Apple Launches iPad 2025 in India with A16 Chip and Liquid Retina Display  But There s a Catch

A16 చిప్‌లో 5-కోర్ CPU, 4-కోర్ GPU, ఇంకా 16-కోర్ న్యూరల్ ఇంజన్ ఉన్నాయి. గేమ్స్, వీడియోలు ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ వంటి పనులన్నీ ఈ ఐప్యాడ్ చాలా ఫాస్ట్‌గా చేసేస్తుంది. ఎంతసేపు వాడినా అసలు ల్యాగ్ అనే మాటే వినిపించదు. గేమర్స్, క్రియేటర్లకు ఇది బాగా సరిపోతుంది.

* డిస్‌ప్లే అదుర్స్.. డిజైన్ సూపర్..

ఈ ఐప్యాడ్‌లో 10.9-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే ఇచ్చారు. రిజల్యూషన్ వచ్చేసి 2360x1640 పిక్సెల్స్. 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్ చాలా ప్రకాశమంతంగా ఉంటుంది, ఇంకా ట్రూ టోన్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది ఏం చేస్తుందంటే, లైటింగ్ ఎలా ఉంటే దానికి తగ్గట్టు కలర్స్‌ను అడ్జస్ట్ చేస్తుంది.

దానివల్ల ఏ లైటింగ్‌లో చూసినా కళ్లకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డిజైన్ కూడా చాలా స్లిమ్‌గా, లైట్‌వెయిట్‌గా ఉంది. సైజులు చూస్తే 248.6×179.5×7mm. వై-ఫై మోడల్ బరువు 477 గ్రాములు, సెల్యులార్ మోడల్ కొంచెం బరువుంటుంది. కానీ సెల్యులర్ మోడల్ తీసుకుంటే ఫోన్ అవసరం ఉండదు.

* కెమెరా అదిరింది..

కెమెరా విషయానికొస్తే, వెనుకవైపు 12MP కెమెరా ఇచ్చారు. f/1.8 అపెర్చర్‌తో ఫోటోలు చాలా షార్ప్‌గా, క్లియర్‌గా వస్తాయి. ఫోకస్ పిక్సెల్స్‌తో ఆటోఫోకస్ కూడా ఉంది. ఇక ముందు కెమెరా కూడా 12MP, 122° వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తోంది. f/2.4 అపెర్చర్, రెటినా ఫ్లాష్ కూడా ఉన్నాయి.

ఫేస్‌టైమ్ వీడియో కాల్స్ చేసుకోవడానికి ఇది మంచి ఆప్షన్. సెంటర్ స్టేజ్ ఫీచర్ అనేది వీడియో కాల్‌లో మీరు కదులుతున్నా మిమ్మల్ని ఫోకస్‌లో ఉంచుతుంది. దీనితో బంధుమిత్రులతో వీడియో కాల్స్ చేయడమే కాదు, టీచర్లు, యజమానులతో కూడా వీడియో కాల్ మాట్లాడటం చాలా బాగుంటుంది.

* కనెక్టివిటీ, బ్యాటరీ లైఫ్

2025 ఐప్యాడ్‌లో వై-ఫై 6 సపోర్ట్ ఉంది, 5G కనెక్టివిటీకి సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.2 కూడా ఉంది, బ్యాటరీ లైఫ్ చూస్తే వై-ఫైలో వెబ్ బ్రౌజింగ్, వీడియోలు చూడటం చేస్తే 10 గంటల వరకు వస్తుంది. సెల్యులార్ మోడల్‌లో మొబైల్ డేటా వాడితే 9 గంటల వరకు బ్యాటరీ వస్తుంది.

* ధరలు

కొత్త 2025 ఐప్యాడ్ మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో దొరుకుతుంది. వై-ఫై మోడల్ ధరలు చూస్తే 128GB మోడల్ రూ.34,900, 256GB మోడల్ రూ.44,900, 512GB మోడల్ రూ.64,900. సెల్యులార్ మోడల్ 128GB స్టార్టింగ్ ధర రూ.49,900. యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, మ్యాజిక్ కీబోర్డ్ ఫోలియో రూ.24,900, స్మార్ట్ ఫోలియో రూ.8,500.

ఈ ఐప్యాడ్ బ్లూ, పింక్, సిల్వర్, ఇంకా ఎల్లో కలర్స్‌లో వస్తోంది. మార్చి 12వ తేదీ నుంచి యాపిల్ ఆన్‌లైన్ స్టోర్, యాపిల్ స్టోర్ యాప్ ద్వారా కొనొచ్చు. మొత్తానికి కొత్త ఐప్యాడ్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్, మంచి డిస్‌ప్లే, ఎక్కువ స్టోరేజ్‌తో వస్తోంది. సాధారణంగా వాడేవాళ్లకి, ప్రొఫెషనల్స్‌కి కానీ ఇది మంచి ఛాయిస్ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple launched the 2025 iPad in India, featuring the A16 chip, 128GB base storage, and Liquid Retina display. It offers faster performance, improved cameras, Wi-Fi 6, 5G, available from March 12th.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X