M4 మ్యాక్‌బుక్ ఎయిర్‌పై రూ.12,000 వరకు భారీ డిస్కౌంట్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!
M4 MacBook Air: టెక్ దిగ్గజం యాపిల్ కొత్తగా విడుదల చేసిన మ్యాక్‌బుక్ ఎయిర్ M4 మోడల్ ధర భారీగా తగ్గింది. లాంచ్ అయిన కొన్ని రోజులకే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ ప్రకటించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంత తక్కువ ధరలో పవర్‌ఫుల్, ఫ్యూచర్-రెడీ ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారికి ఇది నిజంగా సూపర్ డీల్. ఈ ఆఫర్‌లో డైరెక్ట్ ధర తగ్గింపుతో పాటు, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
వీటితో ధర మరింత తగ్గుతుంది. కానీ మార్కెట్లో M2, M3 మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్ తక్కువ ధరకే దొరుకుతుండగా, M4 కొనడం నిజంగా విలువైనదేనా? అనే దానిపై చర్చిద్దాం. అలాగే అసలు ఈ డీల్‌లో ఏముందో చూద్దాం. హాట్ కేకుల్లా అమ్ముడుపోయే లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్ ఎలా లభిస్తుంది తెలుసుకుందాం.

* ఫ్లిప్‌కార్ట్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర తగ్గింపు..
ఫ్లిప్‌కార్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4ని అసలు ధర రూ.99,999 నుంచి తగ్గించి, ఇప్పుడు కేవలం రూ.95,990కే అమ్ముతోంది. అంటే డైరెక్ట్‌గా రూ.4,009 తగ్గింపు అన్నమాట. అంతేకాదు, SBI క్రెడిట్ కార్డు వాడేవారికి అదనంగా రూ.12,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ధర ఏకంగా రూ.83,990కి పడిపోతుంది.
ICICI క్రెడిట్ కార్డుతో కొంటే రూ.10,000 డిస్కౌంట్ వస్తుంది, అప్పుడు ధర రూ.85,990 అవుతుంది. ఈ ఆఫర్లతో ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లో మాత్రమే కనిపిస్తుంది. అంటే, పీసీ వెబ్ వెర్షన్‌లో ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేస్తే, ఈ ఆఫర్ కనిపించదు.
* మ్యాక్‌బుక్ ఎయిర్ M4 కొనాలా వద్దా?
మ్యాక్‌బుక్ ఎయిర్ M4లో 10-కోర్ CPU ఉంది, ఇది M3లో ఉన్న 8-కోర్ CPU కంటే అప్‌గ్రేడ్ వెర్షన్. యాపిల్ ప్రకారం ఇది M1 కంటే రెండింతలు వేగంగా పనిచేస్తుంది. కానీ M4కి, M3కి మధ్య తేడా మాత్రం కాస్త తక్కువే. ఒకవేళ మీరు మ్యాక్‌బుక్ ఎయిర్ M1 వాడుతుంటే, M4కి అప్‌గ్రేడ్ కావాలి.
దేనికంటే దానితో పోలిస్తే M4లో పెర్ఫార్మెన్స్ పరంగా మంచి జంప్ ఉంటుంది. కొత్త మోడల్‌లో 12MP కెమెరా ఉంది, సెంటర్ స్టేజ్, డెస్క్ వ్యూ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇంకా డ్యూయల్ ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే సపోర్ట్ కూడా ఉంది, దీంతో ఇది ఫ్యూచర్-ప్రూఫ్ ఆప్షన్ అవుతుంది.
M2 లేదా M3 మోడల్స్ వాడుతున్నవారికి మాత్రం, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ పెద్దగా ఉండకపోవచ్చు, అప్‌గ్రేడ్ చేయడానికి అంతగా కారణం కనిపించకపోవచ్చు. బెంచ్‌మార్క్స్ ప్రకారం, M3తో పోలిస్తే M4 CPU స్పీడ్ 25-30% ఎక్కువ, GPU పెర్ఫార్మెన్స్ 21 శాతం బెటర్‌గా ఉంది.
ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ అవసరమయ్యే పనులు ఉంటే, M4 బెస్ట్ ఛాయిస్. లేదంటే, M2, M3 యూజర్లు అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ కొనాలనుకుంటే, ఈ డిస్కౌంట్ ధరకు M4 మోడల్ మంచి డీల్. బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు, ఇంకా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అన్నీ కలిపి చూస్తే ఇది చాలా గొప్ప ఛాయిస్.


Click it and Unblock the Notifications







